తండ్రీ కొడుకులిద్దరికే స్క్రూ లూజ్‌

-ఆ స్క్రూలు ఇంకా లూజ్‌ అవుతాయి
-ఎందుకంటే మేజర్‌ షాక్‌ ముందుంది
-ఆ ఇద్దరూ రాష్ట్రం నుంచి ఖాళీ చేయాలి
-చంద్రబాబు, లోకేష్‌కు ఎమ్మెల్సీ భరత్‌ చురక
-వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి తప్పదు
-ఆయనకు ఆ విషయం స్పష్టంగా తెలుసు
-అందుకే అసత్య ప్రచారాలు, విమర్శల పర్వం
-చంద్రబాబు కుప్పంకు ఒరగబెట్టిందేమీ లేదు
-కుప్పం ప్రజలు ఇప్పుడు అభివృద్ధిని చూస్తున్నారు
-గుర్తు చేసిన చిత్తూరు ఎంపీ ఎన్‌.రెడ్డప్ప

మీ స్క్రూలు ఇంకా లూజ్‌:
తొలి నుంచి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎంతో మద్దతు ఉంది. ఆయనది ఘనమైన రాజకీయ చరిత్ర. అలాంటి చరిత్ర ఉన్న గొప్ప రామచంద్రారెడ్డిపై నారా లోకేష్‌ పిచ్చి విమర్శలు చేస్తున్నాడు. ఏక వచనంతో సంబోధిస్తున్నాడు. రామచంద్రారెడ్డికి స్క్రూ లూజ్‌ అయిందని లోకేష్‌ అంటున్నాడు. నిజానికి మేము ఇస్తున్న షాక్‌లకు తండ్రీ కొడుకులు ఇద్దరికీ స్క్రూలూజ్‌ అయింది. వారి స్క్రూలు ఇంకా లూజ్‌ అవుతాయి. ఎందుకంటే మేజర్‌ షాక్‌లు ఇంకా ముందుంది. మీరిద్దరూ రాష్ట్రం నుంచి ఖాళీ చేయాలి. ఇంకోసారి రామచంద్రారెడ్డిపైన, సీఎంగారిపైన ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే సహించబోము.
మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది. ఇంకోసారి ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదు.

చంద్రబాబు వచ్చినప్పుడే విధ్వంసం:
చంద్రబాబు కుప్పం వచ్చినసారి ఇలాంటి విధ్వంసకాండ జరుగుతోంది. ఆయన వెళ్లిపోగానే అంతా ప్రశాంతంగా ఉంటుంది. కావాలంటే అన్ని వివరాలు ఇస్తాను. నాలుగు రోప్‌ పార్టీలు ఏర్పాటు చేసి, భద్రత కల్పిస్తే జగన్‌ పాదయాత్ర చేశారని లోకేష్‌ అంటున్నాడు.
అది కాదు. జగన్‌కి ఉన్న ప్రజాభిమానంలో, ఆ సునామీలో వారంతా మీమీద పడతారని భయపడి పోలీసులను పెట్టారు. అంతేతప్ప, ఆయన రక్షణ కోసం కాదు. ఎందుకంటే జగన్‌కి రక్షణ, రోప్‌ పార్టీలు అవసరం లేదు.

అర్ధం లేని విమర్శలు:
మేము అన్యాయంగా కేసులు పెడుతున్నామని విమర్శిస్తున్నారు. కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో 46 కేసులు పెట్టారు. 70 ఏళ్ల వృద్ధుడి మీద రేప్‌ కేస్‌ నమోదు చేశారు. పోలీసులపై రాళ్ల దాడి చేస్తే కేసులు నమోదు చేయకుండా ఉంటారా? అందుకు తగిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి. వాటి వీడియోలు కూడా చూపాం.
మీరు ఇళ్లు మంజూరు చేస్తే ఆపామని నిందిస్తున్నారు. కానీ అది అబద్ధం. మేము 7 వేల ఇళ్లు మంజూరు చేశాం. ఇంకా 3 వేల ఇళ్లు అదనంగా కావాలని కలెక్టర్‌ వద్ద కోరాం. కానీ మీరు ఎన్నికలకు ఒక నెల ముందు ఓట్ల కోసం ఒక పచ్చ కరపత్రం ముద్రించి, కనీసం దాని మీద స్టాంప్‌ కూడా లేకుండా. ఇల్లు మంజూరు అయిందని చెప్పి, నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ఇంటింటికీ వైయస్సార్‌సీపీలో భాగంగా మేము వెళ్తుంటే, వారు ఆ కాగితాలు చూపి, తమకు ఈ ఇల్లు రాలేదని చెబుతున్నారు. కావాలంటే కుప్పం రండి. మీకు అలాంటివెన్నో చూపుతాం.
డీకె పల్లి అనే ఊరిలో దొంగ పట్టాలు సృష్టించి ఇళ్లు అమ్ముకున్నారు.

ఆ మైనింగ్‌ మీ పార్టీ వారిదే:
రామచంద్రారెడ్డి అక్రమ మైనింగ్‌ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల చంద్రబాబు ఒక మైన్‌ వద్ద హంగామా చేశారు. నిజానికి అది మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులుది. వారి మైన్‌ వద్ద వారే హంగామా చేశారు.
మీరు అధికారంలో ఉన్నప్పుడు 17 లీజ్‌లు ఇచ్చారు. అదే మా ప్రభుత్వం కేవలం రెండే లీజ్‌లు ఇచ్చింది. మీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్యకర్తలకే ఆ లీజ్‌లు ఇచ్చారు. దాంతో వచ్చే డబ్బులతో కుప్పంలో పార్టీ నడుపుతున్నారు.
చివరకు మీ కార్యకర్తల వద్ద కూడా సభ్యత్వ నమోదు పేరుతో అంతులేని అవినీతికి పాల్పడుతున్నారు. ఆ విధంగా మీ కార్యకర్తలను కూడా మీరు వదిలి పెట్టడం లేదు.

కుప్పంకు మేము ఇవి చేశాం:
మేము కుప్పంకు ఏమీ చేయలేదని అంటున్నారు. పెద్దిరెడ్డి ఈ నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. ఆయన అడిగిన వెంటనే సీఎం రూ.66 కోట్లు మంజూరు చేశారు. అదే విధంగా కుప్పంను రెవెన్యూ డివిజన్‌ చేశారు. కుప్పంను మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేశారు. మరి మీరు అవేమీ ఎందుకు చేయలేదు?.
మీరు కుప్పంకు రూ.300 కోట్లు ఇచ్చామంటున్నారు. కానీ ఎందుకిచ్చారు? ఎన్నికల ముందు ఓట్ల కోసం ఇచ్చారు. కానీ ఆ ని«ధులతో ఏయే పనులు చేశారో చెప్పండి.

ప్రైవేటు కాలేజీలతో అభివృద్ధా?:
ఇంజనీరింగ్, మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసినా, అవి ప్రైవేటువే. 14 ఏళ్లు మీరు సీఎంగా పని చేశారు. కానీ ఒక్కనాడైనా ప్రభుత్వ కాలేజీలు ఏర్పాటు చేయాలని ఎందుకు అనుకోలేదు. ప్రైవేటు కాలేజీలు ఏర్పాటు చేస్తే, దాన్ని అభివృద్ధి అంటారా? వాటిలో మీ వాటా ఎంత? ఇప్పుడు కూడా మీ కుటుంబ సభ్యులు కుప్పంకు వస్తే, ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌజ్‌లో ఉండకుండా, మెడికల్‌ కాలేజీ గెస్ట్‌ హౌజ్‌లో ఎందుకు ఉంటున్నారు? మీ వాటాల కోసమే అక్కడ బస చేస్తున్నారా?

ఓడిపోగానే ఎందుకు అప్పగించారు?:
కుప్పంలో ఎన్టీఆర్‌ తాగునీటి పథకం ఏర్పాటు చేశామంటున్నారు. అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే, ఆర్‌డబ్ల్యూఎస్‌కు ఎన్టీఆర్‌ ట్రస్టు వారు ఒక లేఖ రాశారు. ఎన్టీఆర్‌ సుజల ప్లాంట్‌ను నిర్వహించలేమని, కాబట్టే ప్రభుత్వమే చేయాలని ఆ లేఖలో కోరారు.
చివరకు ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా కూడా మీరు కుప్పంకు నీరు ఇవ్వలేకపోయారు. అది తాగే నీరు. అంతకు ముందు 5 ఏళ్లు అదే ట్రస్టు ద్వారా నీరిచ్చారు కదా? అంటే ఆ నీరు ఇస్తూ, ప్రభుత్వం నుంచి నిధులు పొంది, వాటిని ట్రస్టుకు బదిలీ చేసి, మీరు తినేసి, నామమాత్రంగా దాన్ని నిర్వహించారా? అందుకే ఓడిపోగానే ప్రభుత్వానికి అప్పగించారా? మీరు అధికారంలో ఉన్నప్పుడు అలా ఎందుకు ఇవ్వలేదు.

అన్న క్యాంటీన్లు–రచ్చ రచ్చ:
కరోనా సమయంలో మీరు పేదలకు అన్నం పెట్టలేదు. కరోనా సమయంలో మీరు కుప్పంపైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు.
ఇప్పుడు మాత్రం అన్న క్యాంటీన్‌ అంటూ కావాలని రచ్చ చేస్తున్నారు. కుప్పంలో ఒక ట్రాక్టర్‌ పెట్టి, దాన్ని రచ్చ రచ్చ చేసి గోల గోల చేస్తున్నారు.
ఆ ట్రాక్టర్‌ వద్ద నిన్న కూడా భోజనం పెట్టారు. పేదలకు నిజంగా అన్నం పెట్టొద్దు అని మేము అనుకుంటే, ఆ ట్రాక్టర్‌ను తీసేయడం ఎంత పని?
కుప్పంలో మీకు ఆఫీస్‌ ఉంది కదా? అక్కడ అన్న క్యాంటీన్‌ పెట్టొచ్చు కదా? అలా కాకుండా బస్టాండ్‌ వద్దనే దాన్ని ఎందుకు పెట్టాలి?.
కుప్పంలో గాంధీ విగ్రహం వద్ద, మీరు పెట్టిన ట్రాక్టర్‌ ఎదురుగా ఉన్న ఒక పెద్ద చెట్టు భారీ వర్షానికి కూలి పోయింది. దాంతో ఆ పందిరి కూలి పోయింది. అలా వర్షానికి పందిరి కూలిపోతే, నారా లోకేష్‌ వస్తున్నారని చెప్పి, దాన్ని వైయస్సార్‌సీపీ కార్యకర్తలు కూల్చేశారని దుష్ప్రచారం చేస్తున్నారు.

రెచ్చగొడుతోంది ఎవరు?:
కేవలం వివాదాస్పదం చేయడం కోసమే, పార్టీ ఆఫీస్‌ వద్ద కాకుండా, బస్టాండ్‌ వద్ద ఒక పందిరి వేసి, అన్న క్యాంటీన్‌ అని ఎందుకు అనాలి?
నా దగ్గర ఒక క్లిప్పింగ్‌ ఉంది. ‘మీ ఇంటికి వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు వస్తే ఆడవాళ్లంతా రెడీగా ఉండండి. వారిని చీపురు, చాటలతో కొట్టాలని చంద్రబాబు ఒక పెద్దావిడతో స్వయంగా అన్నారు. ఆ వీడియో నా దగ్గర ఉంది. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి అనాల్సిన మాటలేనా ఇవి? ప్రజలను రెచ్చగొడుతున్నది ఎవరు?

ఎక్కడ ఆ పరిశ్రమలు?:
కుప్పంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల 25 వేల మందికి ఉపాధి లభించిందని అంటున్నారు. కానీ అది పచ్చి అబద్ధం. ఇప్పటికీ రోజూ 10 వేల మంది పుష్‌పుల్‌ ట్రెయిన్‌లో బెంగళూరు వెళ్తున్నారు. ఉద్యోగాల కోసం. టైడల్‌సీ పెడతానన్నావు. బ్రిటానియా కంపెనీ వస్తుందన్నావు. ఆదిత్య బిర్లా గ్రూప్‌ పరిశ్రమ పెడతానన్నావు. ఎయిర్‌పోర్టు అన్నావు. ఏవి అవన్నీ? ఇక మీరు పెట్టిన పరిశ్రమలు ఎక్కడున్నాయి?
హంద్రీనీవా ప్రాజెక్టు పనుల్లో మీరు కనీసం బ్రాంచ్‌ కెనాల్‌ కూడా ఎందుకు పూర్తి చేయలేదు. 30 ఏళ్లలో మీరు ఆ పని చేయకపోగా, మేము మూడేళ్లలో చేయలేదని అంటున్నారు. పాలార్‌ ప్రాజెక్టును ఎందుకు ఆపారు?

దేవుడినీ వదిలిపెట్టరా?:
కుప్పంలో అయ్యప్పస్వామి పూజ జరుగుతుంటే, దానికి మంత్రి రామచంద్రారెడ్డి వస్తే, ఒక బ్యానర్‌ పెడితే, దాన్నీ కొట్టారు. ఇప్పుడు ఆ గుడిలో చిరుతపులి తిరుగుతోంది. అందుకే కనీసం దేవుడిలను అయినా వదిలిపెట్టండి.
గంగమ్మతల్లి గుడి అభివృద్ధికి రూ.2.5 కోట్లు మేము మంజూరు చేయించాము. అదే విధంగా మల్లప్పకొండ, యామునూరు గుడి అభివృద్ధి పనులు మంజూరు చేయించాం. ఏమన్నా అంటే రోడ్లు వేశామంటారు. కమిషన్ల కోసం ఆ పని చేశారు. ఇంకా చెప్పాలంటే, మీ హెరిటేజ్‌ కంపెనీ నుంచి మరో కంపెనీకి పోవడం కోసం ఆ రోడ్లు వేసుకున్నారు.

చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది: ఎన్‌.రెడ్డప్ప. ఎంపీ
సీఎం వైయస్‌ జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నారా లోకేష్‌ ఇష్టానుసారం విమర్శలు, వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడిపోబోతున్నారు. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ గెల్చే అవకాశం లేదు.

తరుచూ ఎందుకు పర్యటనలు?:
ఇటీవల చంద్రబాబు తరుచూ కుప్పంలో పర్యటిస్తున్నారు. ఎందుకంటే, ఆ నియోజకవర్గం బాధ్యతలను సీఎం వైయస్‌ జగన్, మంత్రి శ్రీ పెద్దిరెడ్డికి ఇచ్చారు. అప్పుడే కుప్పంలో చంద్రబాబు పతనం మొదలైంది. ఈ విషయం చంద్రబాబుకు స్పష్టంగా తెలుసు. అందుకే తరుచూ అక్కడ పర్యటిస్తూ, పెద్దిరెడ్డిని విమర్శిస్తూ, పుంగనూరు పుడుంగి అని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల వల్ల అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. వారంతా వైయస్సార్‌సీపీకి మద్దతు పలుకుతున్నారు. అందుకే చంద్రబాబులో వణుకు మొదలైంది.
కుప్పంకు సీఎంగారు రూ.66 కోట్లు మంజూరు చేయడంతో, ఇక ఓటర్లంతా తమకు దూరమవుతారని చంద్రబాబులో భయం ఇంకా ఎక్కువైంది.

కుట్రలు. దౌర్జన్యాలు:
అందుకే కొల్లుపల్లిలో సురేష్‌రెడ్డి అనే వైయస్సార్‌సీపీ నాయకుడి ఇంటిపై ఉన్న జెండాను తొలగించి, ఆయనపై దాడి చేశారు. తల పగలగొట్టారు. అక్కడ దాదాపు 2 వేల మంది టీడీపీ కార్యకర్తలు ఉండగా, వైయస్సార్‌సీపీకి చెందిన ఎవ్వరూ లేరు.
ఎమ్మార్వో ఆఫీస్‌ వద్ద అన్న క్యాంటీన్‌ పెడతామని చెప్పి, గత 5 ఏళ్లలో కనీసం బిల్డింగ్‌ కూడా కట్టలేదు. కానీ ఇప్పుడు దాన్ని రాజకీయం చేయడం కోసం ఆర్టీసీ బస్టాండ్‌ ఔట్‌గేట్‌ మూసేసి, అక్కడ అన్న క్యాంటీన్‌ పేరుతో పందిరి వేశారు. పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి నానా హంగామా చేస్తున్నారు. రోజుకు రూ.6 వేలు చందాలు వేసుకుని, ఒక్కో భోజనం రూ.60 చొప్పున 100 మందికి భోజనం పెడుతున్నారు. ఆ పందిరి భారీ వర్షానికి కూలిపోతే, దానికి కూడా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు.

అబద్దాలతో రోజులు:
ఈ విధంగా అబద్ధాలు చెప్పి, మసి పూసి మారేడుకాయ చేస్తున్నారు. ఒక సెక్షన్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో రామచంద్రారెడ్డి అడుగు పెట్టడంతో ఓటమి భయం పట్టుకున్న చంద్రబాబు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. మంత్రిని తిడుతున్నాడు. పోలీసులను నిందిస్తున్నాడు అన్నీ అబద్ధాలు చెబుతున్నారు. ప్రభుత్వంపై బురద చల్లుతున్నాడు. మొన్న 29వ తేదీ రాత్రి 1000 మందికి 26 రకాల వంటలతో చంద్రబాబు భోజనం పెట్టారు. నేను ఈ రాత్రి ఇక్కడ ఉంటాను. మీరు ఏదైనా చేయండి అని కార్యకర్తలను రెచ్చగొట్టాడు. ఆ విధంగా కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలతో చంద్రబాబు రోజులు గడుపుకుంటున్నారు. ఏం చేసినా వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పదు.

Leave a Reply