-రాష్ట్రంలో రాజా రెడ్డి రాజ్యాంగం
-రజక సామాజిక వర్గం పై జగన్ పాలన లో వేధింపులు
-ముని రాజమ్మ కి పార్టీ అన్ని విధాలా అండ
-మామండూరు రజక సామాజికవర్గం ప్రతినిధులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్
టీడీపీ యువనేత లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రలో రజకులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి చేస్తున్న దాడులను లోకేష్‌కు ఫిర్యాదు చేశారు. దానిపై స్పందించిన లోకేష్ రజకులకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
దోబి ఘాట్స్ లేవు… ఉన్న చోట కనీస సౌకర్యాలు లేక మహిళలు ఇబ్బంది పడుతున్నాం. కనీసం మధ్యాహ్నం భోజనం చెయ్యడానికి నీడ లేని పరిస్థితి.
వాషింగ్ మెషిన్లు, ఐరెన్ బాక్సులు సబ్సిడీలో అందించాలి.
ధోబి ఘాట్స్ కి విద్యుత్ బిల్లులు కట్టాలని జగన్ ప్రభుత్వం వేధిస్తుంది.
దేవాలయాలు, ఆసుపత్రుల్లో రజకులకు కాంట్రాక్టులు ఇవ్వాలి.
తిరుమల ఆలయం పరిధిలో బట్టలు ఉతికే కాంట్రాక్టులు ఇతర రాష్ట్రాలు వాళ్ళు చేస్తున్నారు ఆ కాంట్రాక్టులు రజకులకి ఇవ్వాలి.
మిగిలిన రాష్ట్రాల్లో మేము ఎస్సీలు గా ఉన్నాం. మమ్మల్ని ఎస్సీ ల్లో చేర్చాలి.
తిరుపతి లో రజక భవనాల నిర్మాణానికి సహాయం చెయ్యాలి.
మా పిల్లల చదువుల కోసం సహాయం చెయ్యాలి.
రోజంతా నిలబడి ఇస్త్రీ చేస్తే 500 రూపాయిలు మిగలడం కష్టం గా మారింది. జగన్ పాలనలో పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో బ్రతకడం కష్టం గా మారింది.
దోబి ఘాట్స్ ని వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారు.
చెరువుల్లో బట్టలు ఉతకడానికి లేదని వైసిపి నేతలు దౌర్జన్యం చేస్తున్నారు.
మాకు చెరువుల దగ్గర బట్టలు ఉతుక్కోవడానికి హక్కు కల్పించాలి.
మునిరాజమ్మ: చనిపోతా తప్ప మధుసూదన్ రెడ్డికి క్షమాపణ చెప్పను.ఇళ్లు కుల్చేస్తే చెట్టు కింద బ్రతుకుతాం.
వారి సమస్యలపై స్పందించిన లోకేష్ ఏమన్నారంటే ..ముని రాజమ్మ కి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది.రజక సామాజిక వర్గానికి చెందిన ముని రాజమ్మ పై ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గం.అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కావడం లేదు రాష్ట్రంలో రాజా రెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంది.లక్ష రూపాయిలు విలువ చేసే టిఫిన్ బండి, సామగ్రి ని ధ్వంసం చేశారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యుడు మధుసూదన్ రెడ్డి అవినీతి, కరెంట్ కనెక్షన్ కోసం కూడా డబ్బులు అడుగుతున్నారు అని చెప్పినందుకు మునిరాజమ్మ పై దాడి చేశారు.టిడిపి అధికారంలోకి ఉన్నప్పుడు ఆదరణ పథకం ద్వారా వాషింగ్ మిషన్లు, ఐరెన్ బాక్సులు ఇచ్చాం.22 కోట్ల తో దోబీ ఘాట్స్ నిర్మించాం.శాసన మండలి సభ్యుడు గా రజక సామాజిక వర్గానికి దువ్వారపు రామారావు గారికి అవకాశం కల్పించాం.
రజక సామాజిక వర్గం పై జగన్ పాలన లో వేధింపులు ఎక్కువ అయ్యాయి. ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారు.తప్పుడు కేసులు పెట్టిన అధికారుల పై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటాం.ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తామని జగన్ హామీ ఇచ్చి మోసం చేశారు. రూపాయి నిధులు ఇవ్వని కార్పొరేషన్ అవసరమా?ఒక్క వాషింగ్ మెషీన్, ఒక్క ఐరెన్ బాక్స్ ఇవ్వలేదు.టీడీపీ హయాంలో కొన్న ఆదరణ పనిముట్లు జగన్ ప్రభుత్వం రజకులకు ఇవ్వడం లేదు.
బీసీలకు పుట్టినిల్లు టిడిపి…జగన్ బిసిల వెన్నుముక విరిచాడు.టిడిపి తోనే బీసీలు రాజకీయ, ఆర్ధిక స్వాతంత్ర్యం వచ్చింది.రజకులను ఎస్సీ ల్లో చేర్చేందుకు టిడిపి కమిటీ వేసింది. రిపోర్ట్ కూడా ప్రభుత్వం వద్ద ఉంది.జగన్ వచ్చిన తరువాత రజకులను ఎస్సీ ల్లో చేర్చే అంశాన్ని పట్టించుకోలేదు.
జక భవనాల నిర్మాణానికి సహాయం అందిస్తాం.రజకుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం కావాలని అడిగారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం రూపొందిస్తాం.అన్ని సౌకర్యాలతో దోబి ఘాట్స్ ఏర్పాటు చేశారు.టిడిపి అధికారంలోకి వచ్చిన దోబి ఘాట్స్ కి విద్యుత్ ఉచితంగా ఇస్తాం. కట్టేది చంద్రబాబు … కూల్చేది జగన్ రెడ్డి.తిరుమల తో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో బట్టలు ఉతికే రజకులకు టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే కాంట్రాక్టులు ఇస్తాం.