Suryaa.co.in

Andhra Pradesh

పంచాయతీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయంపై పార్టీ అధినేత చంద్రబాబు హర్షం

– గెలిచిన అభ్యర్థులు, నాయకులకు చంద్రబాబు అభినందనలు

అమరావతి:- రాష్ట్రంలో నేడు జరిగిన పంచాయతీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయంపై పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన సర్పంచ్ లు, వార్డు మెంబర్లను చంద్రబాబు నాయుడు ఈ సందర్భం గా అభినందించారు. గతంలో వైసీపీ చేతిలో ఉన్న ఈ స్థానాలను…ఉపఎన్నికల్లో టీడీపీ కైవసం చేసుకోవడం శుభ పరిణామం అని చంద్రబాబు అన్నారు.

వైసీపీ ప్రభుత్వం రోజురోజుకూ ప్రజల మద్దతు కోల్పోతోందని….అందుకే ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు చైతన్యంతో వైసీపీని ఓడించి…తెలుగు దేశం పార్టీని గెలిపిస్తున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల్లో తెలుగు దేశం అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ ఎన్నికల ప్రక్రియలో కూడా కొన్ని చోట్ల పోలీసులు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినా, వైసీపీ అక్రమాలకు తెగబడినా..అన్నింటినీ ఎదరించి మరీ టీడీపీ అభ్యర్ధులు గెలుపు సాధించారని చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకోసం పని చేసిన కార్యకర్తలు, నాయకుల పనితీరును చంద్రబాబు నాయుడు ప్రశంసించారు.

LEAVE A RESPONSE