కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతికి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సంతాపం
హైదరాబాద్:- సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతికి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు. సాయన్న హఠాన్మరణం తనను బాధపెట్టిందని చంద్రబాబు నాయుడు అన్నారు. 5సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన సాయన్న… తెలుగు దేశం పార్టీ నుంచి తన రాజకీయ జీవితం ప్రారంభించారని అన్నారు. టీటీడీ సభ్యునిగా కూడా సాయన్న పని చేశారని ఈ సందర్భం గా గుర్తు చేశారు. సాయన్న ప్రజా సేవలో ఎప్పుడూ ముందుండేవారని అన్నారు. సాయన్న ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు చంద్రబాబు నాయుడు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.