క్రీడోత్సవాలకు సిద్ధమైన సికింద్రాబాద్ యువత

– నిజాం కాలేజ్ గ్రౌండ్ లో గ్రాండ్ గా ప్రారంభోత్సవ కార్యక్రమం
– మార్చ్ 4న ఫైనల్స్, 5న LB స్టేడియంలో ముగింపు ఉత్సవాలు
– ABV ఫౌండేషన్ లో ఆధ్వర్యంలో జరగనున్న పోటీలు
– ఫిట్ ఇండియా లక్ష్యంతో.. యువతలో క్రీడా స్ఫూర్తి నింపేందుకు ప్రధాని మోడీ పిలుపుతో ఆటల పోటీలు
– ఫిట్ ఇండియా లో భాగంగా యువతను మానసికంగా శారీరకంగా ఫిట్ గా తీర్చిదిద్దదమే లక్ష్యం
– గ్రామీణ ప్రాంత యువతను క్రీడల్లో ప్రోత్సహించడానికి.. అవకాశాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు
– సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో పోటీ పడుతోన్న 578 టీమ్ లు
-ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్న క్రీడా ప్రముఖులు, సినీ తారలు
-వివిధ విభాగాల్లో పోటీ పడుతోన్న స్త్రీ, పురుషులు
-కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభోత్సవ కార్యక్రమం

హైదరాబాద్: యువతలో క్రీడా స్ఫూర్తి నింపడమే లక్ష్యంగా .. వారిని అంతర్జాతీయ క్రీడాపోటీల్లో సత్తాచాటేలో తీర్చిదిద్ధడమే ధ్యేయంగా .. ప్రధాని మోడీ పిలుపుతో నిర్వహిస్తున్న సికింద్రాబాద్ క్రీడోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఫిట్ ఇండియా నినాదంతో .. ఖేలో తెలంగాణ.. జీతో తెలంగాణ పేరుతో వారం రోజుల పాటు జరిగే పోటీలకు సికింద్రాబాద్ యువత రెడీ అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం నిజాం కాలేజ్ గ్రాండ్ గా క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖుల మధ్య అట్టహాసంగా జరగనుంది.

సికింద్రాబాద్ లో క్రీడోత్సవాలకు సర్వం సిద్ధమైంది ప్రధాని మోడీ పిలుపుతో.. ఫిట్ ఇండియా లక్ష్యంగా.. యువతలో క్రీడా స్ఫూర్తి నింపేందుకు మూడు రోజలు పాటు ఆటల పోటీలు నిర్వహించనున్నారు. ఖేలో సికింద్రాబాద్, జీతో సికింద్రాబాద్ అంటూ సత్తాచాటేందుకు రెడీ అయ్యారు సికింద్రాబాద్ యువత. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో సాగే పోటీల్లో 578 టీమ్ లు సత్తాచాటేందుకు సిద్ధమయ్యాయి.

స్త్రీ, పురుషుల విభాగాల్లో కబడ్డీ, క్రికెట్, ఖోఖో, వాలీబాల్, రన్నింగ్ విభాగాల్లో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు పోటీలు జరగనున్నాయి.. ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవరం సాయంత్రం 4 గంటలకు నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించబోతున్నారు. కేంద్ర మంత్రి కిషణ్ రెడ్డి ముఖ్యఅథిగా హాజరవుతోన్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి .. గెస్ట్ ఆఫ్ హానర్ గా ఇండియన్ వెయిట్ లిఫ్టర్, అర్జున్ అవార్డు గ్రహీత కరణం మల్లీశ్వరి, ప్రముఖ బ్యాడ్మెంటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ రానున్నారు. అలాగే సినీ ఇండస్ట్రీ నుంచి హీరో సాయి ధరమ్ తేజ్, హీరో మంచు మనోజ్, హీరోయిన్ శ్రీలీల రాబోతున్నారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ పిలుపు మేరకు దేశంలోని ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీలు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో గేమ్స్ ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో యువతలో ఉన్న క్రీడా సామర్థ్యాన్ని వెలికితీసి పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఇటీవల నిర్వహించిన పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. క్రీడలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం.. బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించిందన్నారు. మన దేశ జనాభాకు తగ్గట్టు క్రీడాకారులు లేరని.. అందుకే మోడీ సర్కార్ యువతలో క్రీడా స్ఫూర్తి నింపేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.

సికింద్రాబాద్ క్రీడోత్సవాలకు ఫిబ్రవరి 10 వరకు ఉచిత రిజిస్ట్రేషన్లు జరిగాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి చాలా మంది యువత క్రీడోత్సవాల్లో పాల్గొనేందుకు పోటీపడ్డారు. మొదట సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ స్థానాల్లో పోటీలు నిర్వహించి.. దానిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారిని.. పార్లమెంట్ స్థాయిలో పోటీలకు సెలెక్ట్ చేయనున్నారు. ఇలా అన్ని నియోజకవర్గాల్లో మొత్తం 578 టీమ్ లు పోటీ పడుతున్నాయి.

నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి క్రికెట్ కు 32, కబడ్డీకి 2, ఖోఖోకు 2, వాలీబాల్ కు 3 .. మొత్తం 39 టీమ్ లో పోటీకి సిద్ధమయ్యాయి. ఇక అంబర్ పేట్ నియోజకవర్గం నుంచి క్రికెట్ లో 62, కబడ్డీలో 19, ఖోఖోలో 15, వాలీబాల్ లో 13 మొత్తంగా 109 టీమ్ లు పోటీపడుతున్నాయి. అలాగే సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి క్రికెట్ కు 39, కబడ్డీకి 19, ఖోఖోకు 13, వాలీబాల్ కు 9 .. మొత్తం 80 టీమ్ లను సెలెక్ట్ చేశారు. అలాగే సనత్ నగర్ నియోజకవర్గం నుంచి క్రికెట్ లో 37, కబడ్డీకి 9, ఖోఖోకు 6, వాలీబాల్ కు 11, మొత్తంగా 63 టీమ్ లు పోటీలు రెడీ అయ్యాయి.

ఇక జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి క్రికెట్ కు 40, కబడ్డీకి 17, ఖోఖోకు 17, వాలీబాల్ కు 5, మొత్తంగా 79 టీమ్ లో పోటీల్లో పాల్గొంటున్నాయి. ఇక ఖైరతాబాద్ నియోజకవర్గంలో క్రికెట్ కు 60, కబడ్డీకి 17, ఖోఖోకు 13, వాలీబాల్ కు 13, మొత్తం 103 టీమ్ లను సెలెక్ట్ చేశారు. అలాగే ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి క్రికెట్ కు 46, కబడ్డీకి 17, ఖోఖోకి 14, వాలీబాల్ కు 11, మొత్తంగా 88 టీమ్ లో పోటీకి సిద్ధమయ్యాయి. అలాగే కాలేజీ స్థాయిలోను కోన్ని గ్రూపుల్లో ఈ విభాగాల్లో 17 టీమ్ లు పోటీ పడుతున్నాయి.

Leave a Reply