Suryaa.co.in

Andhra Pradesh

25 మందికి ఐటీ ఉద్యోగ నియామక పత్రాలను అందజేసిన చంద్రబాబు నాయుడు

గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆలోచన లో భాగంగా డాక్టర్ రవి వేమూరు సారధ్యంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంతోమంది నిరుద్యోగ యువతకు పలు రంగాలలో శిక్షణ కార్యక్రమాలను ఎన్నారై టిడిపి సెల్ ఎంపవర్మెంట్ సెంటర్ నిర్వహిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అదేవిధంగా ఈ సెల్ విదేశాల్లో నివసిస్తున్న ఎన్నారై లను మంగళగిరిలో వారి యొక్క సంస్థ బ్రాంచ్ లను ప్రారంభించే విధంగా ప్రోత్సహిస్తుంది. తదుపరి ఈ సంస్థల్లో తెలుగుదేశం కార్యాలయంలో శిక్షణ పొందిన వారికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది.

ఇందులో భాగంగా ఈరోజు 25 మందికి వివిధ సంస్థల్లో ఉద్యోగ నియామక పత్రాలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ క్రమంలో ఉద్యోగాలను ఎన్ఆర్ఐ ల చే ప్రారంభించబడిన సంస్థలైన J1C లో ఏడు మంది కి, Riverside solutions లో ఆరుగురికి, C G V Tech లో ముగ్గురికి, Maganti solutions లో ఇద్దరికీ, Sanity Staffing Solutions లో ఏడుగురికి మొత్తంగా 25 మందికి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఉద్యోగాలు అందుకున్న యువతీ యువకులు తోపాటుగా ఇక్కడ ఫ్యాకల్టీగా ఉన్నటువంటి హిమబిందు, భవాని, ఎన్ఆర్ఐ టిడిపి సెల్ కోఆర్డినేటర్లు బుచ్చి రాంప్రసాద్, చప్పిడి రాజశేఖర్ మరియు ఇతరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE