– ఇండియా ఆఫ్రికా ట్రేడ్ కౌన్సిల్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా చంద్రబాబుని కలిసి ఆశీస్సులు తీసుకున్న ధనుష్
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఇండియా ఆఫ్రికా ట్రేడ్ కౌన్సిల్ చైర్మన్ బొల్లినేని ధనుష్ వారి తండ్రి మాజీ శాసన సభ్యులు బొల్లినేని వెంకట రామారావు తో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో కలిసిన ఘనా హై కమిషనర్ అసోమా చెరెమెహ్ క్వాకు. ఈ సందర్భంగా నారా చంద్రబాబునాయుడుతో మాట్లాడుతూ వాణిజ్య వివాదాలను పరిష్కరించేందుకు స్థిరమైన సమర్థమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం పెట్టుబడిదారులను ఆకర్షించడానికి కీలకమని స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలకు తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేసిందన్నారు.
తద్వరా ఆంధ్రప్రదేశ్ కు అనేక పరిశ్రమలు తీసుకు రాగలిగామని తెలిపారు. చిన్న వయసులోనే ధనుష్ పెద్ద బాధ్యతలు తీసుకున్నారని యువత వ్యాపారంలోనూ రాజకీయాల్లోనూ చురుకుగా రాణిస్తున్నారని కొనియాడారు. ఆయన వెంట బొల్లినేని కార్తీక్ తదితరులు ఉన్నారు. హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ లో శనివారం రాత్రి బొల్లినేని ధనుష్ ఆధ్వర్యంలో ఇండియా ఘన ట్రేడ్ సమ్మిట్ 2023 కార్యక్రమం నిర్వహిచారు.