-పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళుతున్న టిడిపి అధినేతను అడ్డుకున్న పోలీసులు
-పోలవరం ప్రాజెక్టు సందర్శనకు అనుమతిలేదని వాహనాలు అడ్డుపెట్టి టిడిపి అధినేతను, నాయకులను అడ్డుకున్న పోలీసులు
-రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు
అనంతరం పోలవరంలో సభకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన టిడిపి అధినేత:-
• పోలవరం ముంపు మండలాలను ఎపిలో కలిపితేనే సిఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాను అని నాడు చెప్పాను.
• అప్పుడు ప్రధాని సహా కేంద్ర పెద్దలు ఆర్డినెన్స్ తీసుకువచ్చారు.
• చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ప్రభుత్వం ఏర్పడకముందే ఏడుమండలాలు ఎపిలో కలుపుతూ నిర్ణయం తీసుకున్నారు.
• నేను పోలవరం చూడటం కొత్తకాదు…సీఎంగా ఉన్నప్పుడు నెలకు ఒక్క సారి వచ్చి ప్రాజెక్టు పనులను పరిశీలించాను
• ఇప్పుడుప్రాజెక్టు పరిశీలనకు వస్తే అడ్డుకున్నారు.
• కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో పోలవరం టెండర్లు రద్దు చేశారు. వైఎస్ హయాంలో ప్రాజెక్టు పనులు జరగలేదు.
• పోలవరం కోసం రైతులు, గిరిజనులు త్యాగం చేశారు.
• ఒక ప్రాజెక్టు వల్ల లాభం పొందేవారితో పాటు…నష్టం పోయేవారికి కూడా న్యాయం చెయ్యాల్సి ఉంటుంది.
• పునరావాసం కోసం నాడు కాలనీలు కట్టాము.వెడల్పైన రోడ్లు కట్టి కాలనీలు నిర్మించాము
• 28 సార్లు పోలవరం వచ్చాను…..82 సార్లు సోమవారాన్ని పోలవారంగా మార్చుకుని సమీక్షలు చేశాం.
• నిర్వాసితులకు నచ్చజెప్పి పనులు పూర్తి చేశాము.
• 72 శాతం ప్రాజెక్టు పూర్తి చేసిన నేను, మాజీ ముఖ్యమంత్రిగా పోలవరం వెళ్లే అర్హత నాకు లేదా.?
• నేను పోలవరం వెళుతుంటే ఉన్మాద పాలనలో అడ్డుకున్నారు
• 28 సార్లు నేను ప్రాజెక్టుకు వెళితే లేని నక్సలైట్ల సమస్య, భద్రత సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది.?
• ఇప్పుడు వద్దు అన్నారు….రేపు ఉదయం వస్తా…లేదా మళ్లీ మళ్లీ వస్తా….ఎప్పుడు రావాలో అధికారులు చెప్పాలి
• పోలవరం గురించి రాష్ట్రంలో ఉండే ప్రజలు అంతా ఆలోచించాలి
• సముద్రంలో నీరు వృధాగాపోతుంటే పట్టిసీమ కట్టి రైతులకు నీళ్లు ఇచ్చాము.
• పోలవరం కుడి, ఎడమకాలువల ద్వారా నీటి సదుపాయం కల్పించాలని కలలు గన్నాను
• పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజ్ కు నీరు వస్తోంది….మరో బ్యారేజ్ కట్టి బనకచర్ల
కు నీరు తీసుకువెళ్లే ఆలోచన చేశాను.
• పోలవరం పూర్తి అయితే అన్ని ప్రాంతాలకు నీరు వస్తుంది.
• కరవు అనేది లేకుండా ఉండాలని నేను కలలుకన్నాను
• మీ కోసం కలలు కనడం తప్పా….పట్టిసీమ కడుతుంటే ఇక్కడి రైతులు సహకరించారు
• తెలుగుదేశం అధికారంలో ఉండి ఉంటే పోలవరం పూర్తి అయ్యేది. పోలవరం గ్రామం ఒక పట్టణం అయ్యేది
• నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనులు పరిగెత్తాయి. జగన్ సిఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే పోలవరం రివర్స్ టెండర్ అని చెప్పాడు.
• నిర్మాణ సంస్థను మార్చవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి పిపిఏ స్పష్టంగా చెప్పింది.
• ఈ సైకో ముఖ్యమంత్రి పిపిఎ మాట వినలేదు.
• జగన్ పిపిఎ మాట వినకపోవడం వల్ల నష్టం రాష్ట్రానికి, ప్రజలకు
• అందుకే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని అంటున్నా
• కేంద్రం నిధులు ఇచ్చే ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు.
• పోలవరం పూర్తి అయ్యి ఉంటే దక్షిణ భారత దేశంలో ఉత్తమ ఫలితాలు సాధించేవాళ్లం
• చింతలపూడి ప్రాజెక్టును ఇలాగే చేశారు.
• సత్యసాయి డ్రింకింగ్ వాటర్ స్కీంను నిలపివేశారు.
• వెస్ట్ గోదావరి జిల్లాలో అప్ ల్యాండ్స్ కోసం సత్యసాయిబాబా నాడు నీటి పథకం ఇచ్చారు.
• ఇప్పుడు ఆ పథకానికి కరెంట్ బిల్లులు కూడా కట్టడం లేదు.
• వందల కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టులు తెస్తే కనీసం కరెంట్ చార్జీలు కట్టకుండా పథకం నిలిపివేశాడు.
• నన్ను అడ్డుకున్న డిఎస్పిని అడిగాను…ఎప్పుడు రమ్మంటారో చెప్పమని అడిగాను
• మనల్ని రానివ్వని సిఎం జగన్ ను గద్దె దింపుదాం
• పోలవరం రాష్ట్రానికి ఒక వరం….రాష్ట్రానికి కరువు లేకుండా చేసే ప్రాజెక్టు పోలవరం
• ముంపు ప్రాంతాలను కలిపి పోలవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా చేస్తా అని ప్రకటిస్తున్నా.
• 1999లో విజన్ 2020 అని చెప్పాను…ఇప్పుడు నిజం అయ్యింది. అందుకే 2014లో విజన్ 2029 అని చెప్పాను. పుట్టే పిల్లల కోసం కూడా ప్రణాళికలు పూర్తి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది.
• పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలి…కానీ జగన్ ప్రభుత్వంలో ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు
• యువత తమ భవిత కోసం పోరాటానికి సిద్దంగా ఉండాలి. కేసులు పెడితే భయపడతారా.?
• ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం అనేది కొత్త సాంప్రదాయం
• మనం భయపడి ఇంట్లో పడుకుంటే శాశ్వతంగా ఇంట్లో పడుకుంటాం
• ఉద్యోగాలు అడిగితే…..గంజాయి ఇస్తున్నారు. అందుకే యువతను పోరాటానికి సిద్దమవ్వాలని కోరుతున్నా
• ధాన్యానికి గిట్టుబాటు ధర రావడం లేదు…ఒక్క రైతు కూడా సంతోషంగా లేరు
• పామాయిల్ కు మద్దతు ధర ఇవ్వడం లేదు. తెలంగాణలో రేటు వస్తుంది…ఎపిలో ఎందుకు పామాయిల్ కు మద్దతు ధర రావడం లేదు.?
• మోటార్లకు మీటర్లు పెట్టి ఈ సిఎం రైతుల మెడకు ఉరితాళ్లు వేస్తున్నాడు
• సిఎం బాబాయి వివేకా హత్యపై ఏం చెప్పారో చూశారు కదా..?
• సుప్రీంకోర్టు తీర్పుపై జగన్ ను అడుగుతున్నా….సిగ్గుంటే జగన్ రాజీనామా చేసి వెళ్లాలి
• ఒక ఆడబిడ్డ తండ్రికి జరిగిన అన్యాయంపై పోరాడుతోంది.
• ఆడబిడ్డ పోరాటాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి
• పులివెందుల కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు సునితా రెడ్డి పోరాడింది. కేసును తెలంగాణకు బదిలీ చేయించింది.
• చెల్లికి న్యాయం చెయ్యని వ్యక్తి, బాబాయిని కనికరించని సిఎం ప్రజలపై కనికరం చూపుతారా
• సంక్షేమ కార్యక్రమాలు పోయాయి….అభివృద్ది ఆగిపోయింది.
• నేడు రాష్ట్రంలో మద్యం, ఇసుక, ల్యాండ్, రెడ్ శాండిల్ మాఫియా మొదలు పెట్టారు.
• రాష్ట్రంలో ఈ అక్రమార్కులు ఏమీ వదలడం లేదు.
• గిరిజనుల కోసం తెచ్చిన కార్యక్రమాలు అన్నీ జగన్ రెడ్డి రద్దు చేశాడు
• ఏజెన్సీలో కాఫీ తోటలు ప్రోత్సహించాను
• మొన్న గోదావరికి వరదలు వస్తే ప్రజలను జగన్ వరదలకు వదిలేశాడు
• గోదావరికి వరదలు వస్తే నేనే అన్ని ప్రాంతాలు తిరిగి చేతనైన సాయం చేశాను.
• కులం, మతం, ప్రాంతం పేరుతో జగన్ చిచ్చు పెడతాడు….హైకోర్టు విషయంలో సుప్రీంకోర్టుకు ఏం చెప్పారు. సిగ్గుందా వీళ్లకు?
• ముఖ్యమంత్రి అన్ని మతాలను గౌరవించాలి…కానీ రాష్ట్రంలో అందుకు భిన్నమైన పాలన ఉంది.
• వరద వచ్చింది అంటే నవ్వుతాడు….చావుకు వచ్చి నవ్వుతాడు….ఈ సిఎం పైశాచిక ఆనందం పొందుతున్నాడు.
• నిర్వాసితులకు జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి.