Suryaa.co.in

Andhra Pradesh

మరోసారి మానవత్వం చాటుకున్న చంద్రబాబు

– అభిమాని చిరకాల కోరిక తీర్చిన సీఎం చంద్రబాబు నాయుడు

రేణిగుంట: శనివారం ఉదయం తిరుమల తిరుపతి రెండు రోజుల పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో రేణిగుంట విమానాశ్రయం నందు తనను ప్రాణంగా అభిమానించే అభిమానిని కలిసి అతని చిరకాల ఆకాంక్షను నెరవేరుస్తూ తానున్నానని భరోసా కల్పించారు.

అతని ఆరోగ్యం మెరుగుదలకు ఐదు లక్షల రూపాయల తక్షణ ఆర్థిక సాయం ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అందచేసి మరో మారు మానవత్వం చాటుకున్నారు.

తమ నాయకుడితో ఫోటో దిగాలని ఎప్పటి నుండో అనుకుంటున్న ఓ అభిమాని కోరికను తీర్చారు చంద్రబాబు నాయుడు. అంతేకాదు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అభిమాని వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం అందించారు. వివరాల్లోకి వెళితే… రేణిగుంట కు చెందిన పసుపులేటి సురేంద్రబాబు(30) మానసిక దివ్యాంగుడిగా జన్మించారు. దీనికి తోడు ఇటీవల లివర్ కేన్సర్ తోడైంది.

సురేంద్ర బాబుకు చంద్రబాబు అంటే చిన్నతనం నుండే అంతులేని అభిమానం…అమితమైన ప్రేమ. తాను ఎంతో ఇష్టపడే నాయకుడైన చంద్రబాబుతో చనిపోయేలోపు ఒక్క ఫోటోనైనా దిగాలన్నది సురేంద్ర బాబు వాంఛ. ఈ విషయం చంద్రబాబుకు తెలిసింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి వస్తున్న సమయంలో ఎయిర్ పోర్టుకు పిలిపించుకుని, సురేంద్ర బాబు తో ప్రత్యేకంగా మాట్లాడి ఫోటో దిగారు.

క్యాన్సర్ తో బాధపడుతున్నందున వైద్య ఖర్చులకు రూ.5 లక్షలను ప్రభుత్వం తరపున సాయం అందించారు. భయపడొద్దని, అన్ని విధాలా అండగా ఉంటానని సురేంద్రబాబుకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. తన అభిమాన నేత ఆప్యాయతతో పలకరించడంతో సురేంద్రబాబు ఎంతో సంతోషించాడు.సీఎం వెంట తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE