– ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
– క్యాబ్ సర్వీస్, బస్సు సర్వీస్ పెంచాలని సూచన
– విమానాశ్రయంలో ఎయిర్ పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
విజయవాడ : ఎయిర్ పోర్ట్ లో కొత్త టెర్మినల్ నిర్మాణానికి సంబంధించి 2025 జనవరి నాటికి కాంక్రీట్ పనులు పూర్తి అవుతాయి. అనంతరం ఇతర పనులు పూర్తి చేసి జూన్ నాటికి నూతన టెర్మినల్ భవనాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ చెప్పారు.
గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమనాశ్రయంలో శనివారం ఎయిర్ పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఏసీ చైర్మన్ ఎంపి వల్లభనేని బాలశౌరి తో కలిసి ఏఏసీ వైస్ చైర్మన్ ఎంపి కేశినేని శివనాథ్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ప్రయాణీకుల అవసరాల దృష్టిలో పెట్టుకుని కల్పించాల్సిన సదుపాయాలతో పాటు ముఖ్యంగా కొత్త టెర్మినల్ నిర్మాణం పనులు మరింత వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.పనుల్లో మరింత పురోగతి సాధించేలా ప్రతి వారం రివ్యూ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు