Suryaa.co.in

Andhra Pradesh

ఆ ఘటనలకు చంద్రబాబుగారిదే పూర్తి బాధ్యత

అందుకు ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాలి
పక్కా ప్రణాళిక ప్రకారమే ఆయన వ్యవహరించారు
అందుకే పార్టీ అధికార ప్రతినిధితో అలా మాట్లాడించారు
ముఖ్యమంత్రి మీద అసాధారణ స్థాయిలో విమర్శలు
ఆ మాటలకు ఎవరైనా తప్పనిసరిగా రియాక్ట్‌ అవుతారు
అలా స్పందిస్తారని చంద్రబాబుకు బాగా తెలుసు
అందుకే ప్లాన్‌ ప్రకారమే అలా మాట్లాడించారు
వైయస్సార్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి
అది పక్కాగా క్యాలిక్యులేటెడ్‌. డెలిబరేట్‌. ప్రిమెడిటేటెడ్‌ కోల్డ్‌ బ్లడెడ్‌ ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ అండ్‌ ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ ఎగైనెస్ట్‌ స్టేట్‌ ఏ మాత్రం ఆలోచించినా దాన్ని స్పష్టంగా అర్ధం చేసుకోవచ్చు.ఇక ముందు కూడా అలా మాట్లాడితే మళ్లీ స్పందిస్తాం.మనిషన్న వాడు ఎవరైనా సరే, రియాక్ట్‌ అయి తీరుతారు.స్పష్టం చేసిన వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
చేతకాని దద్దమ్మలు, అసమర్థులు, మాట నిలుపుకోని వారు నిరాశ నిస్పృహలో ఉన్నవారి నుంచే ఆ మాటలు వస్తాయి.ఇప్పుడు మేము చేస్తున్నది రాజకీయంగా ఎదుర్కోవడమే.ఇంత జరిగినా చంద్రబాబు ఆ మాటలను ప్రస్తావించలేదు.దేనికైనా హద్దు ఉంటుంది. టీడీపీ ఆ హద్దులు కూడా దాటింది.ఆ పార్టీకి రాజకీయాల్లో కొనసాగే అర్హత అస్సలు లేదు.ప్రెస్‌మీట్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టీకరణ.ప్రెస్‌మీట్‌లో  సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే..:
అలుసుగా తీసుకున్నారేమో!:
నిన్న (మంగళవారం) టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి అనే నాయకుడు, రెండున్నర ఏళ్లుగా ప్రజారంజక పాలన అందిస్తున్న మహా నాయకుడు, కోట్లాది మంది అభిమానించే మహా నాయకుడు, సీఎం  వైయస్‌ జగన్‌ను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో దుర్భాషలాడారు. దాన్ని అందరూ గమనించారు. అది ప్రస్తావించాలన్నా ఇబ్బందికరమైన మాట.
గత ఆరు నెలలుగా చూస్తే ఆ పార్టీ నేతలు, పార్టీ అధ్యక్షుడు, ఆయన కుమారుడు నిరాశ నిస్పృహతో వ్యవహరిస్తున్నారు. నోరు తెరిస్తే తీవ్ర దూషణలు. అయినా మా పార్టీ నుంచి సంయమనం పాటిస్తున్నాం. ఇక సీఎంగారు అయితే తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. దీంతో మా సంయమన వైఖరిని అలుసుగా తీసుకున్నారేమో.. అందుకే నిన్న టీడీపీ అధికార ప్రతినిధి చాలా దారుణంగా మాట్లాడారు.
అనివార్యంగా చూపిస్తున్నాం:
ఇవాళ (బుధవారం) రాష్ట్ర బంద్‌. మళ్లీ ఏదో దీక్ష చేస్తారట. ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేస్తారట. ఇవన్నీ చూసే ప్రజలకు లేని అనుమానాలు వస్తాయి కాబట్టి.. నిన్న పట్టాభి మాట్లాడిన మాటలు ఇప్పుడు మీ అందరికీ చూపించాల్సి వస్తోంది అన్న  సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వీడియో ప్రదర్శించి చూపారు.
ఉద్దేశపూర్వకంగానే..:
దీన్ని చూసిన తర్వాత ఒక విషయం అర్ధమవుతుంది. అది నోరు జారి ఆవేశంతో మాట్లాడింది కాదని స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అది పార్టీ కార్యాలయం. ఆయన ఆ పార్టీ అధికార ప్రతినిధి. ప్రతిదీ ముందుగా అనుకునే ఆ విధంగా, ఉద్దేశపూర్వకంగా, పూర్తి స్పృహలో ఉండి మాట్లాడాడు. ఆ మాటకు కచ్చితంగా రియాక్షన్‌ వస్తుందని అందరికీ తెలుసు. ఆ మాట ఉత్తర భారత్‌లో చాలా బూతు మాట. ఇలాంటి మాట పదే పదే అనడం వెనక ఉద్దేశం ఏమిటి. అదీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని ఆ మాట అనడం ఏమిటి?
నిన్న పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో చర్చించిన తర్వాతే వచ్చి, ఆ విధంగా మాట్లాడాడు. ఎందుకంటే, చంద్రబాబు అనుమతి లేకపోతే పార్టీ అధికార ప్రతినిధి ఆ స్థాయిలో మాట్లాడడు. ఆయన గతంలో కూడా చాలా విమర్శలు చేశాడు. కానీ దీని ముందు అవన్నీ వెలవెలబోయాయి.
కర్త. కర్మ. డైరెక్షన్‌ బాబుదే:
చంద్రబాబు నిర్దేశం ప్రకారమే ఆయన మాట్లాడాడు. అంటే దీనికి కర్త, కర్మ చంద్రబాబు. ఆయన డైరెక్షన్‌లోనే ఇదంతా జరిగింది. ఇక్కడ మా కర్మకాలి అది విపక్షం. ఆ పార్టీ అధినేత ఒక గతి తప్పిన మనిషి. ఆయన ఏనాడూ ప్రత్యక్షంగా ప్రజా రాజకీయాలు చేయలేదు. ఆయన మార్గదర్శకత్వంలో ఎలా జరిగిందనేది మరోసారి నిన్న అందరూ చూశారు.
ఇంత ఘోరమైన మాట మాట్లాడిన తర్వాత స్పందించకపోతే మనిషి కాడు. అలా చేయకపోతే మనిషి కాడు. అభిమానం ఉన్న వారు ఎవరైనా తప్పనిసరిగా స్పందిస్తారు. అదే నిన్న కనిపించింది.
ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ ఎగైనెస్ట్‌ స్టేట్‌:
అది పక్కాగా క్యాలిక్యులేటెడ్‌. డెలిబరేట్‌. ప్రిమెడిటేటెడ్‌. కోల్డ్‌ బ్లడెడ్‌. ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ అండ్‌ ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ ఎగైనెస్ట్‌ స్టేట్‌.. అదే ఆ పార్టీ చేసింది. ఏ మాత్రం ఆలోచించే వాళ్లు అయినా దాన్ని స్పష్టంగా అర్ధం చేసుకోవచ్చు. అది క్లియర్‌గా కనిపిస్తుంది.
ఆ మాటలకు ఆ మాత్రం రియాక్షన్‌ తప్పనిసరిగా వస్తుంది. ఎందుకంటే మా నాయకుణ్ని అభిమానించే వారు ఎందరో ఉన్నారు.
అసలు మీరు అలా మాట్లాడక ఉండి ఉంటే, ఆ రియాక్షనే ఉండేది కాదు కదా. అయినా అలా ఎందుకు మాట్లాడుతున్నారంటే..
అబద్ధపు మేడలు:
గత రెండున్నర ఏళ్లుగా సీఎంగారు అమలు చేస్తున్న పథకాలు. ప్రజల్లోకి వెళ్తున్న తీరు. విశ్వాసాన్ని నిలబెట్టుకున్న విధానం. ఇటీవలి స్థానిక ఎన్నికల్లో అఖండ మెజార్టీ రావడం.. దీంతో ఏం చేయాలో అర్ధం కాక.. తప్పుదోవ పట్టించాలని, ప్రజలను గందరగోళానికి గురి చేయాలని చూస్తున్నారు. ఒక అబద్ధం చుట్టూ అల్లి అల్లీ ఒక అబద్ధపు మేడ కడుతున్నారు. దానిలో నుంచి ఏదో ఒక ప్రయోజనం పొందాలని చూస్తున్నారు.
గతంలో దారుణ వ్యవహారం:
అసలు నిన్న ప్రెస్‌మీట్‌ చూస్తే.. గంజాయి ఇక్కడే పండిస్తున్నారు అని ఆ పార్టీ నాయకుడు నక్కా ఆనంద్‌బాబు మాట్లాడితే, అందుకు ఏమైనా ఆధారాలు ఉంటే ఇవ్వమని పోలీసులు నోటీసు ఇచ్చారు. నిజానికి టీడీపీ హయాంలో అలా ఎన్నోసార్లు నోటీసులు ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే అప్పుడు మా పార్టీ నేతల పట్ల ఇంకా దారుణంగా వ్యవహరించారు. అప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేలే రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పట్ల అనైతికంగా ప్రవర్తించారు.
పక్కా ప్రణాళికతో:
పోలీసుల నోటీస్‌ మీద ప్రెస్‌మీట్‌ పెట్టినప్పుడు ఈ స్థాయిలో విమర్శలు అవసరం లేదు కదా. అయినా మాట్లాడారు అంటే, అందుకు తప్పనిసరిగా రియాక్షన్‌ వస్తుందని తెలుసు. అంతా పక్కా ప్రణాళికతో చేశారు. గతంలో చంద్రబాబు మాటలకు కలత చెందిన మా పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్, అది తప్పు అని చెప్పడానికి ఆ నాయకుడి ఇంటి వద్దకు పోయినప్పుడు, నిమిషాల వ్యవధిలోనే టీడీపీ నాయకులు చేరారు. కానీ నిన్న అలా ఎందుకు రాలేదు.
హఠాత్తుగా చంద్రబాబు బయటకు వచ్చి. ఏదో సుత్తి పట్టుకుని ఏదేదో మాట్లాడాడు. ఏమో జరిగిందన్నాడు. రాష్ట్రంలో ఆర్టికిల్‌ 356 ప్రయోగించాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు అమిత్‌షాతో మాట్లాడంట. నిజంగా కేంద్ర హోం మంత్రి స్పందించారో లేదో తెలియదు. ఎందుకంటే ఆయన చెప్పడు కదా. అయ్యన్నపాత్రుడు కూడా గతంలో చాలా దారుణంగా మాట్లాడాడు. మహిళా హోం మంత్రిని పట్టుకుని కూడా పిచ్చిగా మాట్లాడారు. ఆ తర్వాత వాటిని సమర్థించుకున్నారు.
చంద్రబాబుదే బాధ్యత:
ఒక ముఖ్యమంత్రిని, కోట్లాది మంది అభిమానులు ఉన్న నాయకుణ్ని పట్టుకుని అంత దారుణంగా మాట్లాడారు కాబట్టే ఆ రియాక్షన్‌ వచ్చింది. ఏదైనా మాట్లాడితే దాన్ని మీడియా బయటకు తీసుకువస్తే, రియాక్షన్‌ లేకుండా ఎలా ఉంటుంది. దీనికి బాధ్యత పూర్తిగా చంద్రబాబు వహించాలి. ఆయన పెట్టుకున్న మూక ఆ బాధ్యత తీసుకోవాలి.
వారు సమర్థిస్తున్నారా?:
ఆ వెంటనే కొన్ని పార్టీలు కూడా స్పందించాయి. అంటే వారు ఆ మాటను సమర్థించినట్లే అనుకోవాలా. వారి నేతలను అలా అంటే ఊర్కుంటారా. ఆ మాటలు పార్లమెంటరీ అనుకోవాలా. పార్టీ ఆఫీస్‌ మీదకు పోవడాన్ని తప్పు పడుతున్న వారికి, అందుకు కారణాలు కూడా ప్రస్తావించాలి కదా. అలాంటి తిట్లను తప్పు పట్టాలి కదా. అసలు ఆ మాటలను రాజకీయంగా ఎదుర్కోవాలి అంటే ఎలా సాధ్యం?
ఇలాంటి పదజాలం తరాలు మారాయి కాబట్టి, ఒప్పుకోవాలా. అంత దారుణ మాటలపై కనీసం చర్చలైనా జరగాలి కదా.
అలాంటప్పుడే ఇలాంటి మాటలు:
ఇలాంటి తిట్లు చేతకాని దద్దమ్మలు, అసమర్థులు, మాట మీద నిలబడలేని వారు, నిరాశ నిస్పృహలో ఉన్నవారి నుంచి మాత్రమే వస్తాయి. నిన్న జరిగిన దానికి చంద్రబాబు మాత్రమే పూర్తిగా బాధ్యత వహించాలి. ఆయన క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు మేము చేస్తున్నది రాజకీయంగా ఎదుర్కోవడమే. కచ్చితంగా టీడీపీ నేతల ఇళ్లకు వెళ్లి ఆ మాటలు మాట్లాడడం సరేనా అని నిలదీస్తే తప్పేమిటి.
మీ ఇంట్లో వాళ్లను ఆ మాట అంటే ఊర్కుంటారా అని నిలదీయలేమా. ఇంత జరిగినా చంద్రబాబు కనీసం ఆ మాటలను ప్రస్తావించలేదు. అలా మాట్లాడడం తప్పు అనలేదు.
మిమ్మల్ని అంటే ఊర్కుంటారా?:
ఇంత జరిగినా రెండు పత్రికలు కేవలం ఒకవైపు మాత్రమే రాశాయి. మా పార్టీ రియాక్షన్‌ మాత్రమే రాశాయి. అదే పత్రికల యాజమాన్యాలను అడుగుతున్నాం. మిమ్మల్ని అదే మాట అంటే ఊర్కుంటారా. తప్పు పట్టరా అని అడుగుతున్నాం.
రియాక్షన్‌ తప్పదు:
ఒక్కటే చెబుతున్నాం. ఇక ముందు ఎప్పుడైనా ఇలా మాట్లాడితే కచ్చితంగా రియాక్షన్‌ ఉంటుంది. ఎందుకంటే ఆ మాటలు అంత దారుణంగా ఉన్నాయి. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. టీడీపీ ఆ హద్దులు పూర్తిగా దాటింది. ఆ పార్టీకి కొనసాగే అర్హత లేదు.
కుట్రలూ కుతంత్రాలు:
చంద్రబాబు రాజకీయ జీవితం మొదలైందే కుట్రలు, కుతంత్రాలతో. ఎప్పుడూ అబద్దాలు చెప్పడమే. ఇప్పుడు గంజాయి మీద కూడా అవే విమర్శలు. గంజాయి కేవలం ఈ రెండేళ్లలోనే వచ్చిందా? ఏడాదిన్నర కాలంలోనే లక్షల కిలోల గంజాయి పట్టుకున్నారు. అందుకు ఎస్‌ఈబీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఒక యజ్ఞంలా పని చేస్తున్నారు.
బాధ్యత కలిగిన ప్రతిపక్షం అయితే, ఏది పడితే అది మాట్లాడదు. గంజాయికి ఇప్పుడు హెరాయిన్‌ కూడా జత చేశారు. పచ్చి అబద్ధం అని మీకూ తెలుసు. అయినా మాట్లాడడం. విమర్శించడం.
అలా మాట్లాడుతున్నారు కాబట్టే, ప్రజల్లో చులకన అవుతున్నారు. ఎందుకంటే ప్రజలకు అన్నీ తెలుసు.ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన నాయకుడు చులకన అయ్యారని చంద్రబాబు అన్నారు. అది ఆయనకే వర్తిస్తుంది.
నమ్మకముంటే పోటీ చేయండి:
జగన్‌గారు ప్రజల్లో విశ్వాసం కోల్పోయారంటున్నారు. మీకు ఆ నమ్మకం ఉంటే, బద్వేలు ఉప ఎన్నికలో ఎందుకు పోటీ చేయరు. కానీ ఆ పని చేయకుండా ఒక అబద్ధాన్ని పదే పదే తిప్పడం, అనుకూలంగా ఉన్న రెండు పత్రికలు, ఛానళ్లలో వేయడం. కోర్టులకు వెళ్లడం. అక్కడ ఏమి జరిగినా బ్యానర్లలో వేయడం. మళ్లీ దాని మీద మాట్లాడడం అలవాటుగా మారింది.
ప్రజాస్వామ్యం అపహాస్యం:
ఇప్పుడు చంద్రబాబు దీక్ష ఏమని చేస్తాడు. కనీసం ఆ దీక్షలో కూర్చున్నప్పుడు అయినా, ఆ పదానికి ఇది అర్ధం అని చెబితే బాగుంటుంది. లేకపోతే ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే.
మళ్లీ చెబుతున్నాం. ఇక ముందు మళ్లీ ఇలా మాట్లాడితే కచ్చితంగా రియాక్షన్‌ ఉంటుంది. ముందే రాసుకున్న స్క్రిప్ట్‌ ప్రకారం అన్నీ చేయడం, రియాక్షన్‌ రాగానే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వి«ధించాలని కోరడం.. ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారమే చేశారు.
పార్టీ ఆఫీసులపై దాడిని ఖండిస్తున్న వారు, ఆ మాటను స్వాగతిస్తున్నారా అన్న విషయం చెప్పాలి. పవన్‌కళ్యాణ్‌ కానీ, సీపీఐ నాయకులు ఆ మాట తప్పు అని ఎందుకు గట్టిగా చెప్పలేకపోతున్నారు.
పవన్‌ నిజానికి గతంలో కూడా పంచెలు ఊడగొడతామని మాట్లాడారు. కాబట్టి ఆయనకు ఈ మాట పెద్దగా తప్పు అనిపించకపోవచ్చు.
ప్రజలపై నమ్మకముంది:
మేము ఆ పార్టీలను పెద్దగా పట్టించుకోవడం లేదు. మాకు ప్రజల మీద నమ్మకం ఉంది. వారు అర్ధం చేసుకుంటారన్న నమ్మకం ఉంది.
అంత దారుణంగా మాట్లాడడాన్ని ఎవరూ సహించరు. పైగా అది కుట్రతో చేసింది మాత్రమే. అప్పడికప్పుడు ఆవేశంలో మాట్లాడిన మాటలు కాదు.
ఈసీ కూడా ఆలోచించాలి:
ఎన్నికల కమిషన్‌ కూడా ఇలాంటి పార్టీల గురించి ఆలోచించాలని కోరాలని భావిస్తున్నాం. దీనిపై జాతీయస్థాయిలో చర్చ జరగాలని కోరుకుంటున్నాం. ఎక్కడైనా ఎప్పుడైనా చర్చల (డిబేట్లు)లో ఆవేశంలో అలాంటి మాటలు అన్నా, ఆ తర్వాత ఉపసంహరించుకుంటారు. కానీ ఉద్దేశపూర్వకంగా ప్రెస్‌మీట్‌లో మాట్లాడడం అతి దారుణం.. అని ప్రెస్‌మీట్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE