– నీ పేరు చెప్తే గుర్తుండే ఒక్క పథకమైనా చెప్పగలవా…?
– ఆనాడు రాష్ట్రం ఇప్పుడే పుట్టిన పసిబిడ్డ అన్నావ్..మరి రాష్ట్రానికి నువ్వేం చేశావ్..?
– నిత్యం జగన్ ని ఆడిపోసుకోవడమే మీ పనా..?:
– చంద్రబాబు పాలన కరువు కాటకాలకు చిరునామా.
– బాబు హయాంలో జీఎస్‌డీపీలో మన స్థానం 22
– జగన్ హయాంలో రాష్ట్రానికి ఫస్ట్ ర్యాంక్
– ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మనమే నంబర్ వన్
– చంద్రబాబు హయాంలో మైనస్‌గ్రోత్‌లో వ్యవసాయం
– నీ హయాంలో ప్రభుత్వ విద్యార్థులకు స్టేట్ ర్యాంక్స్ వచ్చాయా..?
– ఇవాళ మన విద్యా రంగంలోని సంస్కరణలను దేశమంతా చెప్పుకుంటోంది.
– జిల్లాకో మెడికల్ కాలేజీ ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా బాబూ..?:
మంత్రి బొత్స సత్యనారాయణ
చంద్రబాబూ ఇక నీ డ్రామాలు కట్టిపెట్టు:
-చంద్రబాబునాయుడూ ఇక నీ డ్రామాలు కట్టిపెట్టి వాస్తవాల్లోకి రా…
– సినిమాల్లో ఎన్టీఆర్ నటుడు అయితే చంద్రబాబు రాజకీయాల్లో మహానటుడు
– చంద్రబాబు ఏది చేసినా అన్నీ పబ్లిసిటీ కోసం..పత్రికల కోసం మాత్రమే.
– ఊకదంపుడు ఉపన్యాసాలు వద్దు..ఏదైనా నేరుగా మాట్లాడు చంద్రబాబు
– నువ్వు అధికారంలో ఉన్న కాలంలో చెప్పుకోడానికి ఏదైనా ఉంటే చెప్పు
– ఎన్టీఆర్, వైఎస్సార్ లాంటి వారి పేరు చెబితే అనేక పథకాలు ప్రజల గుండెల్లో ఉండిపోయాయి.
– అలాంటిది నీ పేరు చెప్తే గుర్తుండే ఒక కార్యక్రమం చెప్పగలవా…?
– గంటలు గంటలు ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పుకుని వెళితే లాభం లేదు.
– ఎంతసేపూ జగన్ ని ఆడిపోసుకోవడం తప్ప చంద్రబాబు చేస్తుంది ఏమీ లేదు.
– జగన్ ధనవంతుడు అయ్యాడట..పేదలు నిరుపేదలు అయ్యారట..
– ప్రజలు నిరుపేదలుగా కావడానికి కారణం నువ్వు కాదా చంద్రబాబు.
– సామాన్యులు ఇంకా అథోపాతాళానికి వెళ్లింది..కరువు వచ్చి ప్రజలు అల్లాడింది నీ హయాంలో కాదా..?
– బడుగు బలహీన వర్గాలు నీ వద్దకు వస్తే నువ్వు ఎంత హేళనగా మాట్లాడావో నీకు మళ్లీ చెప్పాలా..?
– నాయీ బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తాను అన్నది నువ్వు కాదా…
– ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలనుకుంటారా అన్నది నువ్వు కాదా..?
ఏపీ జీఎస్‌డీపీలో మొదటి స్థానంలో ఉన్నది నిజం కాదా..?:
– చంద్రబాబు పరిపాలనలో జీఎస్‌డీపీ 6.3 శాతంగా ఉండేది.
– జగన్ అధికారంలోకి వచ్చాక జీఎస్‌డీపీ 7.5 శాతానికి పెరిగింది.
– ఇది రాష్ట్ర అభివృద్ధి కాదా..? సామాన్యుడి ఆర్ధిక పరిస్థితి మెరుగుపడటం కాదా..?
– బాబు హయాంలో రాష్ట్రం 22 వ స్థానంలో ఉంటే ఈ రోజు జీఎస్‌డీపీలో ఏపీ మొదటి స్థానంలో ఉంది.
– ఎందుకు అన్నీ అబద్దాలు మాట్లాడతావు చంద్రబాబు..ప్రజలు వాస్తవాలు తెలియని అమాయకులు అనుకుంటున్నావా..?
– నువ్వున్నప్పుడు వ్యవసాయం మైనస్ గ్రోత్‌లో ఉండటం అబద్దమా..?
– రండి..నువ్వు..నీ ఆర్ధిక మంత్రి ఇది నిజం కాదని చెప్పే ధైర్యం ఉందా..?
– జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో 8 శాతం వృద్ధి నమోదైంది.
– ఆ రోజు చంద్రబాబును ఎరువులు అడిగిన రైతులు లేరు. పంటలను కొనుగోలు చేయండి అని అడిగివారే లేరు
– కారణం ఆయన కాలం అంతా కరువు కాటకాల మయం.
– వ్యవసాయం దండగ అన్న వ్యక్తి పాలనలో రైతులు, రైతు కూలీలు ఈ రాష్ట్రం విడిచి పారిపోయారు.
– జగన్ ముఖ్యమంత్రి అయిన తరవాత పుష్కలంగా వర్షాలు పడ్డాయి..పంటలు కళకళలాడుతున్నాయి.
– ప్రభుత్వం వ్యవసాయ దారునికి ఇస్తున్న ప్రోత్సాహంతో వ్యవసాయం పుంజుకుంది.
– రైతు బరోసా కేంద్రాల నుంచి అనే సంక్షేమ కార్యక్రమాలు, రైతులకు అండగా నిలుస్తున్నాయి.
అధికారంలోకి వచ్చాక ఏం చేశామన్నది ముఖ్యం:
– అబద్దాలు చెప్పి అధికారంలోకి రావడం ముఖ్యం కాదు.
– అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రానికి, ప్రజలకు ఏం చేశామన్నది ముఖ్యం
– ప్రజల నమ్మకం ఏ రకంగా నిలబెట్టుకున్నామన్నది ముఖ్యం.
– వైఎస్సార్ స్పూర్తితో జగన్ ఈ రాజకీయాల్లో అడుగుపెట్టి, ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటనూ నిలబెట్టుకున్నారు.
– ప్రతి ప్రయోజనం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ అందేటట్లు పరిపాలన చేయబట్టే వ్యవసాయం విరాజిల్లుతోంది.
– అది వ్యవసాయ దారుని ఆత్మస్థైర్యాన్ని పెంచడం కాదా..?
నీ హయాంలో ప్రభుత్వ విద్యార్థులకు స్టేట్ ర్యాంక్స్ వచ్చాయా..?:
– నువ్వు అదికారంలో ఉన్నప్పుడు విద్యారంగానికి ఎంత ఖర్చు పెట్టావు చంద్రబాబు..?
– ఎప్పుడైనా ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే ఆలోచనైనా చేశావా..?
– ఎప్పుడైనా ప్రభుత్వ స్కూళ్లలో చదువుకున్న పిల్లల ఫలితాలు రాష్ట్ర స్థాయిలో ప్రైవేటు విద్యార్థులకు ధీటుగా వచ్చాయా..? ఇప్పుడు వచ్చాయి..
– నీ హయాంలో విద్యారంగంపై కేవలం రూ.19వేల కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు మేం రూ.40 వేల కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నాం.
– విద్యా, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం అనేవి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలు
– విద్యపై పెట్టే ఖర్చు దేశానికి పెట్టబడి అని మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావించారు.
– విద్య అంటే మొదటి స్థానంలో ఉన్న కేరళ రాష్ట్రం పేరు చెప్పేవారు.
– ఇవాళ మన విద్యా రంగంలోని సంస్కరణలను దేశమంతా చెప్పుకుంటోంది.
– రేపు స్కూళ్లు తెరిచే లోపు డిజిటల్ విద్యా బోధనకు సర్వం సిద్ధం చేస్తున్నాం.
– మన విద్యార్థి గ్లోబల్ కాంపిటీషన్లో ఉండాలంటే ఇంగ్లీషు మీడియం విద్య అవసరమని భావించి ప్రవేశపెట్టాం.
– చంద్రబాబు హయాంలో రాష్ట్రం విద్యారంగంలో 24 స్థానంలో ఉంటే..జగన్ హయాంలో 7వ స్థానానికి చేరాం. మొదటి స్థానానికి వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం.
జిల్లాకో మెడికల్ కాలేజీ ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా బాబూ..?:
– ఎంతసేపూ జగన్‌ని ఆడిపోసుకోవడం తప్ప చంద్రబాబు తానేం చేశాడో చెప్పడం లేదు.
– జిల్లాకో మెడికల్ కాలేజీ తీసుకురావాలనే ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడైనా వచ్చిందా..?
– ఇప్పుడు జగన్ 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నారు.
– రాష్ట్రంలో ప్రజలు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని భావించి వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాం.
– ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకుంటే దేశంలోనే మన రాష్ట్రం గత మూడేళ్లుగా నంబర్ 1 స్థానంలో ఉంది.
– సచివాలయ వ్యవస్థలో లక్షా 40 వేల మందిని ఒకే సారి రిక్రూట్‌చేశాం.
– పరిపాలనను ప్రతి గుమ్మం ముందుకు తీసుకెళ్లాం.
– అవినీతి లేకుండా డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.3 లక్షల కోట్ల వరకూ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్లింది.
– నీ హయాంలో ఈ డబ్బంతా ఏమైంది..? ఈ డబ్బంతా పెత్తందార్లకు దోచిపెట్టలేదా..?
– నిత్యం అబద్దాలు చెప్తే జనం నమ్ముతారు అనుకోవద్దు.
రాష్ట్రం ఇప్పుడే పుట్టిన పసిబిడ్డ అన్నావ్..మరి ఏం చేశావ్..?:
– నాకు పేద ప్రజల అండ, రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఉంటే చాలని జగన్ అంటున్నారు.
– మీ అండతోనే మళ్లీ నేను సేవ చేసే అవకాశంలోకి వస్తానని ధైర్యంగా చెప్తున్నాడు.
– నువ్వు ఎప్పుడైనా ఇలా చెప్పావా చంద్రబాబు..? ఇప్పుడు మళ్లీ వస్తే ఏదో రిపేరు చేస్తాడట…
– గతంలో ఆంధ్రా ఇప్పుడే పుట్టిన పసిపాప…నాకు అనుభవం ఉంది అంటే ప్రజలు అవకాశం ఇచ్చారు కదా..
– అప్పుడు ఏం చేశావ్..నీ తాబేదార్లు, నీ సామాజిక వర్గీయులకే దోచిపెట్టావు
– జన్మభూమి కమిటీలు పెట్టి దోచుకున్నది మర్చిపోయావా చంద్రబాబూ
– ఆనాడు పింఛన్ రావాలంటే ఎవరు చచ్చిపోతారా అని వేచిచూడాల్సిన పరిస్థితిని మర్చిపోయావా..?
– చంద్రబాబు తానేదో బ్రహ్మవాక్కు చెప్తున్నట్లు..దాన్నంతా రాష్ట్ర ప్రజలంతా నమ్ముతున్న ఫీలవుతున్నాడు.
– మీరు ఎన్ని మాట్లాడిన ఎన్ని చేసినా ఈ రాష్ట్రాన్ని ప్రతి రంగంలో కూడా 2018–19లో దానికంటే మిన్నగా తీర్చిదిద్దుతాం.
– అట్టడుగున ఉన్న రాష్ట్రాన్ని మళ్లీ అందరూ ఏపీ వైపు చూసేటట్లు చేస్తాం.
– పేదవానికి ఎటువంటి అవినీతి లేకుండా సంక్షేమ ఫలాలు అందాలనేది ఈ ప్రభుత్వం విధానం.
– ఎవరెన్ని అన్నా ఇదే విదానాన్ని కొనసాగిస్తాం..దానితోనే రాబోయే కాలంలో ప్రజల్ని మెప్పిస్తాం.
– మళ్లీ జగన్ అధికారంలోకి రావడం ఖాయం..ఖాయం…
– చంద్రబాబు చెప్పే మాయమాటలు నమ్మెద్దు.
ప్రశ్నలు–సమాధానాలు
– రోజుకో డ్రామా సీబీఐ ఆడుతుందా..? మేము ఆడుతున్నామా..?
– ఒకే సారి కాగితాలన్నీ పెట్టొచ్చుగా..రోజుకోకటి పెట్టడం ఎందుకు..?
– చంద్రబాబు ఎన్ని చేసుకున్నా ప్రజలు నమ్మే దశలో లేరు.
– జగన్ ని రెండు అంశాల్లో ప్రజలు నమ్మారు. తన తండ్రిలా జగన్ చెప్పిన మాట నిలబెట్టుకుంటాడని నమ్మారు.
– రెండోది ఆయన కొత్త వ్యక్తి…ఈయనకు అధికారం ఇస్తే ఏం చేస్తాడో చూద్దాం అని అధికారం ఇచ్చారు.
– జగన్ చెప్పింది చేశాడు…జనం నమ్మింది సార్ధకత చేశాడు.
– చంద్రబాబు చెప్పింది ఎపుడైనా చేశాడా..? మ్యానిఫెస్టో ఇది అని ఎప్పుడైనా చూపాడా..?
– మ్యానిఫెస్టో నా ఖురాన్, భగవద్గీత, బైబిల్ అని జగన్ అంటున్నారు.
– చంద్రబాబుకు అలా చెప్పే ధైర్యం ఉందా…?
– విశాఖ రాజధాని ఎప్పుడో వచ్చేసింది..వ్యక్తులు రావడమే మిగిలింది..
అమరావతి ఏమన్నా దేవేంద్రుని నిలయమా..?:
– అమరావతి అనేది ఏమైనా బ్రహ్మపదార్ధమా.? దేవేంద్రుని నిలయమా..?
– సామాన్యుడు, పేదవాడు ఉండటానికి వీళ్లేదా..?
– ఊరంటే ఒకే సామాజిక వర్గం ఉండాలని రాజ్యాంగంలో ఏమైనా రాసి ఉందా..?
– ఊరంటే అన్ని కులాలు, మతాలు, వర్గాలు కలిస్తేనే ఊరు
– అక్కడ ఇళ్ల స్థలాలు లేవు కాబట్టి వారికి ఇక్కడ ఇళ్లు కట్టించి ఇస్తున్నాం.