టీడీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ సీఎం కేసీఆర్ను పరామర్శించారు. సోమవారం సోమాజీ గూడ యశోదా ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు అక్కడ చికిత్స పొందుతున్న కేసీఆర్ను కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
టీడీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ సీఎం కేసీఆర్ను పరామర్శించారు. సోమవారం సోమాజీ గూడ యశోదా ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు అక్కడ చికిత్స పొందుతున్న కేసీఆర్ను కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రజా జీవితంలోకి రావాలని, అంకిత భావంతో ప్రజలకు సేవ చేయాలని చంద్రబాబు ఆకాంక్షించారు. చంద్రబాబు వెంట పలువురు టీడీపీ నాయకులు, నేతలు ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈనెల 7 అర్ధరాత్రి బాత్రూమ్లో జారిపడ్డారు. తుంటి ఎముకకు గాయం కావడంతో సోమాజీగూడ యశోదా ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ చేశారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్కు చికిత్స అందిస్తున్నారు.