Suryaa.co.in

Andhra Pradesh

తల్లి పెంపకం వల్ల తప్పు జరిగితే….విజయమ్మను మనం ఏమని అడగాలి?

– కోర్ట్ ఆగ్రహం తో IAS లకు శిక్ష విధించింది…వారికి సిగ్గు అనిపించడం లేదా?
– నాకు కొత్త గా సీఎం పదవి ఎందుకు? 14 ఏళ్లు సీఎం గా ఉన్నా
– ప్రధాని చెప్పినా పెట్రో రేట్లు తగ్గించలేదు
– రుషికొండ ఏమైనా పాకిస్థాన్ లో ఉందా?
– తెదేపా అధినేత చంద్రబాబు

విశాఖ:-వైకాపా ప్రభుత్వం ఇచ్చేవన్నీ పాత పథకాలేనని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖ జిల్లా తాళ్లవలసలో చంద్రబాబు మాట్లాడారు. జగన్‌ బాదుడే బాదుడుకు తెదేపా మాత్రమే విరుగుడని చెప్పారు. పెట్రోల్‌ ధర ఏపీలో కంటే ఎక్కువ ఏ రాష్ట్రంలోనైనా ఉంటే రాజకీయాలు వదులకుంటానని సవాల్‌ విసిరారు.

‘‘భూములు, ఖనిజాలు ఎక్కుడున్నాయో చూసేందుకే జగన్‌ పాదయాత్ర చేశారు. జగన్‌ బాదుడుకు రుషికొండ తరిగిపోయింది.జగన్‌ వల్ల 8 మంది
babu-tweet1ఐఏఎస్‌ అధికారులకు జైలు శిక్ష పడింది.జగన్‌ కన్ను పడితే చాలు.. ఏదైనా గోవిందా.. నరకాసుర వధ పోరాటంలో అందరూ కలిసి రావాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో ప్రతి ఇంట్లో వినిపించే మాట బాదుడే బాదుడు.బాదుడే బాదుడుకు విరిగుడు తెలుగు దేశం ప్రభుత్వం రావడమే. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇంత దౌర్భాగ్యపు ముఖ్యమంత్రిని చూడలేదు. ప్రధాని చెప్పినా పెట్రో రేట్లు తగ్గించలేదు. టీడీపీ హయాంలో 5 రూపాయలు తగ్గించాం.

పోలీసులు కూడా మళ్ళీ రేపు అనేది ఉందని గుర్తు ఉంచుకోవాలి. జగన్ ను నమ్మిన అధికారులు జైల్ కు పోతున్నారు. కోర్టు ఆగ్రహం తో IAS లకు శిక్ష విధించింది…వారికి సిగ్గు అనిపించడం లేదా?10 వ తరగతి పరీక్షలు కూడా నిర్వహించలేక పోతున్నారు.10 వ తరగతి ఫలితాల కోసం కాపీ కొట్టిస్తున్నారు….రేపు ఉద్యోగం కోసం ఎక్కడ కాపీ కొడతారు. నేను యువతకు IT ఉద్యోగం ఇచ్చాను….జగన్ 5 వేల జీతం తో వాలంటీర్ ఉద్యోగం ఇచ్చాడు.

కూలీ వారి బిడ్డ, రైతు బిడ్డ మంచి ఉద్యోగం చెయ్యకూడదా? 10వ తరగతి పరీక్ష లు నిర్వహించలేని ఈ మంత్రులు ఎందుకు? జగన్ పాలనలో ఎన్నో అరిష్టాలు….11 లక్షల కోట్ల అప్పు చేస్తారా? 300 యూనిట్స్ కరెంట్ వాడితే అమ్మఒడి పథకం లేదు.

జగన్ అడిగిన ఒకే ఛాన్స్ ఇక వైసీపీ కి చివరి ఛాన్స్. యువతకు ఫిష్ మార్కెట్లు, మటన్ మార్ట్ ల లో ఉద్యోగాలు ఇస్తారా? ఫిష్ మార్కెట్ గురించి గొప్పగా చెప్పిన సీఎం జగన్ ఒక్కడే. పేదవారికి అన్నకోసం

అన్నా క్యాంటీన్ పెట్టాము. ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ గనులు ఉన్నాయి తెలుసుకోవడం కోసమే జగన్ పాదయాత్ర. రుషికొండ ఏమైనా పాకిస్థాన్ లో ఉందా? విశాఖ పట్నం అంటే నాకు చాలా అభిమానం ఉంది. మంచి ప్రజలు ఉండే ప్రాంతం ఇది.

ఎంతో చరిత్ర ఉన్న ప్రాంతం రుషికొండ…అలాంటి చోట రుషికొండ పై జగన్ కన్ను పడింది. వైజాగ్ ను నేను ఐటీ హబ్ చెయ్యాలి అనుకున్నాను. A1,A2 కలిసి విశాఖను కబ్జా పెట్టారు. అదానీ డాటా సెంటర్, లాలూ గ్రూప్, HSBC సెంటర్, ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ లాంటి సంస్థలు వైజాగ్ నుంచి వెళ్లి పోయాయి. వైజాగ్ కు రాజధాని కాదు…అభివృద్ధి కావాలి. ప్రజా వేదికతో రాష్ట్రంలో విద్వంసం మొదలు పెట్టారు.

నేను నాడు వద్దు అనుకుంటే జగన్ పాదయాత్ర చేసే వాడా?ఆడబిడ్డలపై అత్యాచారాలకు తల్లుల పెంపకం కారణం అని మంత్రి ఎలా అంటారు? తల్లి పెంపకం వల్ల తప్పు జరిగితే….విజయమ్మను మనం ఏమని అడగాలి? దక్షిణ భారత దేశానికి గంజాయి సరఫరా మన రాష్ట్రం నుంచి జరగడం అవమానకరం. గంజాయి పై సీఎం ఒక్క రివ్యూ చేశాడా? సిఎం గా ఉండే అర్హత ఉందా?

విజయవాడ లో ప్రభుత్వ ఆసుపత్రి లో సామూహిక అత్యాచారం జరిగితే సీఎం స్పందించరా?పోలీసులు గట్టిగా ఉంటే ఆకృత్యాలకు కట్టడి చెయ్యవచ్చు. చట్టం లేని దిశ పేరుతో హడావుడి చేస్తున్నారు. నాకు కొత్త గా సీఎం పదవి ఎందుకు? 14 ఏళ్లు సీఎం గా ఉన్నాను. ప్రజల కోసమే నా అవేదన…యువత కోసం నా ఆలోచన.కోడి బొచ్చు అంతా పీకి ఆ కోడికి నాలుగు గింజలు వేస్తారు…అదే సంక్షేమం అంటున్నాడు. ఫీజు రీయింబర్స్మెంట్ కొత్త పథకం అన్నట్లు సొంత పేపర్ లో ప్రకటనలు. ఈ ప్రకటనల ఖర్చు లేకపోతే చెత్త పై పన్ను వేయాల్సిన పనే ఉండదు.

LEAVE A RESPONSE