మళ్లీ దక్షిణ తెలంగాణ ఉద్యమం వస్తుందేమోనని భయమేస్తోంది

– కాంగ్రెస్ కి ఓటేస్తే…టీఆర్‌ఎస్ కి వేసినట్టే
– మహబూబ్ నగర్ “ప్రజా సంగ్రామ యాత్ర” లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

భవిష్యత్ లో అంతా ఉత్తర తెలంగాణకే వెళ్తుందని… మళ్లీ దక్షిణ తెలంగాణ ఉద్యమం వస్తుందేమోనని భయమేస్తోంది. తెలంగాణ ఉద్యమంలో ఈ జిల్లాకు సంబంధించిన పాట అందరినీ కదిలించింది. పాలమూరు లో వలసలు అలానే ఉన్నాయి. 2009 లో పాలమూరు నుంచి వలసలు ఆపేస్తా అని కేసీఆర్ ఎంపీ అయ్యాడు.కేసీఆర్ సీఎం అయ్యాక కూడా వలసలు ఆగలేదు.

టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక పాలమూరు పరిస్థితి ఏం మారిందిపాలమూరులో పలుగురాళ్లే ఉన్నాయి తప్ప, పచ్చని చెట్లు లేవు. రాయచూరు, బీదర్, కర్ణాటక లో tsrtc వాళ్ళు వెళ్లి డీజిల్ ఎందుకు పోయించుకుంటున్నారో అడుగు కేటీఆర్. ప్రజలు తమ తలరాతలు మారాలని మీకు ఓట్లు వేస్తే… మీరు

చేసిందేంటి? భవిష్యత్ లో అంతా ఉత్తర తెలంగాణకే వెళ్తుందని… మళ్లీ దక్షిణ తెలంగాణ ఉద్యమం వస్తుందేమోనని భయమేస్తోంది.కోపం వచ్చి కొడంగల్ లో ఓడగొడితే… పోయి హైదరాబాద్ లో పడ్డడు. బీజేపీ బలం బీజేపీ కార్యకర్తలే.

కాంగ్రెస్ కు ఓటు వేస్తే… కాంగ్రెస్ బి ఫార్మ్ మీద గెలిచినోడు టీఆర్‌ఎస్ లోకి వెళ్తాడు. కాంగ్రెస్ కి ఓటేస్తే… టీఆర్‌ఎస్ కి వేసినట్టే. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పాలనలో పాలమూరు లో పలుగురాళ్లే మిగిలాయి తప్ప, అభివృద్ధి జరగలేదు. త్వరలోనే కేసీఆర్ అస్త్ర సన్యాసం చేస్తారని తెలుస్తోంది.తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ పాలన చూశారు. ఈ ఒక్కసారి బీజేపీ కి అవకాశం ఇవ్వండి. పాలమూరు ఎంపీ ఎప్పుడైనా ఇక్కడ కనిపించాడా? గెలిచిన 3 ఏళ్లలో మూడుసార్లు కూడా పాలమూరు లో పర్యటించలేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేలా పనిచేయండి.కేసీఆర్ స్ట్రక్చరల్ ఇంజినీర్ గా మారి,వేలకోట్ల రూపాయలతో యాదాద్రి కడితే… నిన్నటి వర్షానికి అన్నీ కొట్టుకుపోయాయి.

Leave a Reply