-పబ్లిసిటీ కోసమే పడవ డ్రామా
-నవరత్నాల లబ్ధిదారులకు రూ.1.65 లక్షల కోట్లు జమ
-ట్విట్టర్ వేదికగా ఎంపి విజయసాయిరెడ్డి
గోదావరి లంక గ్రామాల్లో కాకుండా శ్రీలంకలో పర్యటిస్తే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు ఎక్కువ ప్రచారమొస్తుందని వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి,రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అన్నారు.పలు ఆంశాలపై శుక్రవారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రభుత్వం తమకు భోజనం, మంచినీళ్లు, వసతి కల్పిస్తోందని లంక గ్రామాల ప్రజలు చెప్పడంతో చంద్రబాబు ఖంగుతిన్నారని చెప్పారు. చేసేదిలేక టీడీపీ నేతలు పడవపై నుంచి కిందకి దూకి హడావుడి, హైడ్రామా చేశారని అన్నారు.
ఎవరైనా కొట్టుకుపోతుంటే పరామర్శకు వెళ్లినోళ్లు వరద నీటిలోకి దూకి వారిని ఒడ్డుకు చేర్చాలి. మీరే జారి నీళ్ళలో పడితే ఎలా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. పబ్లిసిటీ కోసం రెండు అడుగుల నీటిలో అంత డేంజరస్ ఫీట్ అవసరమా? ఎల్లో మీడియా లైవ్ కవరేజి కోసమే కదా అంటూ ఎద్దేవా చేశారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి సమర్థ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల దిశగా వేగంగా అడుగులు వేస్తోందని చెప్పారు. నవరత్నాల పథకాల ద్వారా జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం లబ్ధిదారులకు రూ.1.65 లక్షల కోట్లను నేరుగా నగదు బదిలీ ద్వారా జమ చేసిందని వెల్లండించారు. దేశంలో ఈ తరహా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ విధానం ఎక్కడా లేదని చెప్పారు.