విజయవాడ: మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి సంచలన విజయం వైపు దూసుకెళుతుండడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో మళ్లీ మహాయుతి ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని అన్నారు. కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షాకు చంద్రబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు అపూర్వ విజయం కట్టబెడుతున్నారని వ్యాఖ్యానించారు.