Home » ప్రజల ఆకాంక్షల కోసం తొలి రోజు నుంచే చంద్రబాబు కృషి

ప్రజల ఆకాంక్షల కోసం తొలి రోజు నుంచే చంద్రబాబు కృషి

– మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్య
– దెందులూరులో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, చింతమనేని ప్రభాకర్ ఆత్మీయ కలయిక

పెదవేగి: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు , ఉపముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసి, ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరాక రాష్ట్రంలో ప్రజలంతా ఒక పండగ వాతావరణంలా భావించి, సంతోషంగా ఉన్నారని మంత్రి కొలుసు పార్థసారథి వ్యాఖ్యానించారు.

ఆ ప్రజల ఆకాంక్షలను సాకారం చేయటానికి ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం శ్రమించటం మొదలు పెట్టారని, రాష్ట్రంలో పునర్వైభవం తీసుకురావటం కేవలం చంద్రబాబు నాయుడు కే సాధ్యం అని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖా మంత్రి కోలుసు పార్థసారథి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.

దుగ్గిరాలలోని దెందులూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం మంత్రి కొలుసు పార్థసారథి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ల ఆత్మీయ కలయిక జరిగింది. దుగ్గిరాలలోని చింతమనేని ప్రభాకర్ క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పుష్పగుచ్చాలు అందించి, దుస్సాలువాలతో ఘనంగా సత్కరించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో స్థానం దక్కించుకున్న సందర్భంగా మంత్రి కొలుసు పార్థ సారథి, మైలవరం ఎమ్మెల్యే గా ఘన విజయం సాధించిన వసంత కృష్ణ ప్రసాద్కు చింతమనేని ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన చింతమనేని ప్రభాకర్ ను మంత్రి కొలుసు పార్థ సారథి, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం దెందులూరు నియోజకవర్గంలోని మండల పార్టీల అధ్యక్షులు సహా పలువురు నాయకులను చింతమనేని ప్రభాకర్ మంత్రి పార్థసారథికి స్వయంగా పేరు పేరునా పరిచయం చేశారు. అనంతరం గృహ నిర్మాణ శాఖకు చెందిన దెందులూరు నియోజకవర్గంలోని పలు అంశాలపై చింతమనేని ప్రభాకర్ మంత్రి కొలుసు పార్థసారథితో చర్చించారు. తమ శాఖ ద్వారా దెందులూరు నియోజకవర్గానికి ఎల్లప్పుడూ పూర్తి సహకారం అందిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏర్పాటు చేసిన అల్పాహార కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం పోలవరం లో జరగనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

ఈ కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గ మండల పార్టీల అధ్యక్షులు బొప్పన సుధా, లావేటీ శ్రీనివాస్, మాగంటి మిల్లు బాబు, నంబూరి నాగరాజు, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ, ఉప్పలపాటి రాం ప్రసాద్, మోతుకూరి నాని, మాజీ పీ.పీ. మాగంటి ప్రభాకర్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply