చంద్రబాబు చేస్తున్న ఇదేమి ఖర్మ రోడ్ షోను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. పోలవరం వద్ద కావాలనే చంద్రబాబు రాద్ధాంతం చేసాడని మండిపడ్డ హోంమంత్రి. అనుమతి లేకుండా పోలవరం ప్రాజెక్ట్ కు వెళ్లడం సరైన నిర్ణయం కాదన్న హోం మినిస్టర్ వనిత. టీడీపీ హయాంలో పోలవరం ను ఏటీఎం లా వాడుకున్నారని ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన హోంమంత్రి.
14 ఏళ్ళు సీఎం గా చేసిన వ్యక్తి జన సమూహంతో అనుమతి లేకుండా ప్రాజెక్టుకు ఎలా వెళ్తారని ప్రశ్నించిన హోంమంత్రి. ప్రజలకు ఏమి చేస్తే నమ్ముతారని ఆలోచన లేకుండా టీడీపీ వాళ్ళు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న పనులకు ప్రజలు ఇదేమి ఖర్మ అని అనుకుంటున్నారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందన్న హోంమంత్రి. పెట్టిన ఒక్క గేట్ కూడా వరదలకు కొట్టుకుపోయిన విషయాన్ని గుర్తుచేసిన హోం మినిస్టర్. సీఎం జగన్ గారి పాలనలోనే పోలవరం పనులు జరిగాయన్న తానేటి వనిత. ఇప్పటికైనా చంద్రబాబు తీరు మార్చుకోవాలని తెలిపిన హోంమంత్రి తానేటి వనిత.