-దళితుల్ని చంపి శవాలను డోర్ డెలివరీ చేయడానికి వైసీపీ వాళ్లకు లైసెన్సులు
-చిత్తూరు టిడిపి కార్యాలయ ఆవరణలో ఎస్సీలతో లోకేష్ ముఖాముఖి
జగన్ రెడ్డి రాజ్యంలో ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుకు నేను కూడా బాధితుడినే. టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసిపి మూకలు దాడిచేసినపుడు అక్కడకు వచ్చి ఫోటోలు తీస్తున్న నాయక్ అనే సిఐని మా కార్యకర్తలు ప్రశ్నించినందుకు నాపైన, అశోక్ బాబుపైన కేసుపెట్టారు.పులివెందులలో ఎస్సీ మహిళ నాగమ్మను అత్యాచారం చేసి దారుణంగా హత్యచేస్తే ఇంతవరకు ప్రభుత్వం ఆ కుటుంబానికి న్యాయం చేయలేదు.
ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన ఎం.ఎస్.రాజు, వంగలపూడి అనితపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు.అమరావతిలో దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపెట్టి, చేతులకు సంకెళ్లు వేసి జైలుకు తీసుకెళ్లారు.దళితులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంకింద కేసులు పెట్టే ప్రభుత్వం దేశం మొత్తమ్మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్కటే. ఎస్సీల కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 27సంక్షేమ పథకాలు ఎందుకు రద్దు చేశారు సాంఘిక సంక్షేమమంత్రి నాగార్జున సమాధానం చెప్పాలి. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను అమ్మఒడి, పెన్షన్లు, స్కూల్ ఫీజు రీయింబర్స్ మెంట్, ఇతర పథకాలకు మళ్లించారు. ఎస్సీల సంక్షేమానికి ఎవరెంత ఖర్చుచేశామో బహిరంగ చర్చకు నేను సిద్ధం…మీరు సిద్ధమా? మాల,మాదిగ,రెల్లి కార్పొరేషన్లు పెట్టి ఎంత నిధులు ఖర్చుచేశారో మంత్రి మేరుగ సమాధానం చెప్పాలి.
టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం రద్దుచేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరించే బాధ్యత మాది. దళితుల్లో పేదరికం ఉండకూడదనేది చంద్రబాబు లక్ష్యం. జగన్ సీఎం అయ్యాక దళితుల్ని చంపి శవాలను డోర్ డెలివరీ చేయడానికి వైసీపీ వాళ్లకు లైసెన్సులు ఇచ్చారు.వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం(దళితుడు)ను దారుణంగా చంపి డోర్ డెలివరీ చేశాడు. మాస్కులు ఇవ్వడంలేదని దళిత డాక్టర్ సుధాకర్ బాబును వైసీపీ నాయకులు వేధించి చంపారు.చీరాలలో కిరణ్ అనే దళిత యువకుడు మాస్కు పెట్టుకోలేదని నడివీధిలో కొట్టిచంపారు. పుంగనూరులో కల్తీ మద్యం గురించి ఓం ప్రతాప్ అనే దళిత యువకుడు మాట్లాడినందుకు రాత్రిపూటే చంపేశారు.తూర్పుగోదావరిజిల్లాలో వరప్రసాద్ ఇసుక అక్రమాలపై ప్రశ్నించినందుకు పోలీస్ స్టేషన్ లో శిరోముండనం చేశారు.
దేశంలోనే మొదటగా దళితుడైన బాలయోగిని లోక్ సభ స్పీకర్ గా, ప్రతిభాభారతిని అసెంబ్లీ స్పీకర్ గా చేసిన ఘనత చంద్రబాబుది.విదేశీవిద్య ద్వారా ప్రభుత్వమే డబ్బులిచ్చి విదేశాల్లో చదువుచెప్పించి దళితుల్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు భావించారు. దళిత పిల్లలకు కార్పొరేట్ విద్యనందించేలా బెస్ట్ అవెయిలబుల్ స్కూల్ విధానాన్ని చంద్రబాబు అమలు చేశారు.దళితుల స్వయం ఉపాధి కల్పించేందుకు ఇన్నోవా కార్లు కూడా చంద్రబాబు అందించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో దళిత కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, ఎల్ఇడి లైట్లు ఏర్పాటుచేశాం. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క కిలోమీటరు సిమెంట్ రోడ్డునైనా వేశారాసాంఘిక సంక్షేమశాఖ మంత్రికి సమాధానం చెప్పే దమ్ముందా? ఏపీలో దళితుల చేతుల్లో ఉన్న భూముల సంఖ్య వైసీపీ పాలనలో తగ్గుతూ వచ్చింది…టీడీపీ హయాంలో పెరుగుతూ వచ్చింది.వైసీపీ గూండాలు దళితులను బెదిరించి భూములు లాక్కుంటున్నారు.
నారాయణస్వామికి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. జగన్, పెద్దిరెడ్డి ఉన్నచోట ఆయన కూర్చునేందుకు కుర్చీకూడా ఇవ్వదు. అది వైసిపి ప్రభుత్వం దళితులకిచ్చే గౌరవం.దళితులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడంపై జ్యుడీషిల్ ఎంక్వయిరీ నియమిస్తాం. అక్రమంగా కేసులు పెట్టిన అధికారులెవరైనా, ఏ స్థాయి అయినా తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటాం. వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించి బ్రిటిష్ కాలంనాటి జీఓ-01 తీసుకొచ్చింది.1861పోలీసు చట్టం బ్రిటీషు వాళ్లు తెస్తే..దాన్ని జగన్ రెడ్డి నేడు అమలు చేస్తున్నాడు.అందరం కలిసికట్టుగా పోరాడాలి…రాష్ట్ర భవిష్యత్తును నిలబెట్టాలి.2019ఎన్నికల్లో ఓడింది టీడీపీ కాదు…ఆంధ్రప్రదేశ్ ఓడిపోయింది.వైసీపీ పాలనలో పోలీసులు కూడా ఏడుస్తున్నారు…వాళ్లకు టీఏ, డీఏ, మెడికల్ చెకప్ లు లేవు. యువగళంలో దళితులంతా చేయిచేయి కలిపి నడవాలి.. సహకరించాలి…అప్పుడే సైకోను తాడేపల్లి కొంపకు శాశ్వతంగా లాక్ వేయగలం.