Suryaa.co.in

Telangana

అభివృద్ధి, సంక్షేమ రంగాలకు బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

– ప్రజామోదం పొందిన బడ్జెట్ ఇది
– రాష్ట్ర బడ్జెట్ పై రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఆర్థిక దిగ్బంధనం చేసినా… ఎలాంటి సహకారాన్ని అందించకున్నా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన సొంత రాబడి నుంచి గణనీయంగా ఆదాయాన్ని సమకూర్చుకుని ఆ మేరకు రూ. రెండు లక్షల 90 వేల బడ్జెట్ ను రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు.

అభివృద్ధి, సంక్షేమ రంగాలకు బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని వినోద్ కుమార్ తెలిపారు. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ ప్రజామోదం పొందిన బడ్జెట్ ఇది అని వినోద్ కుమార్ అన్నారు. రెవెన్యూ రాబడి గణనీయంగా పెరిగిందని, ముఖ్యంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగంలో రూ. 18,500 కోట్లు, ఎక్సైజ్ లో రూ. 20,000 కోట్లు, రోడ్ ట్రాన్స్ పోర్ట్ లో రూ. 7,512 కోట్లు, మైనింగ్ లో రూ. 5,917 కోట్ల రాష్ట్ర ఆదాయం సమకూరిందని వినోద్ కుమార్ తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విజన్, దూర దృష్టితో రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం అవుతోందని, ఆ మేరకు ఆదాయాన్ని సమకూర్చుకుని ముందుకు సాగుతోందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. అందుకే గత ఏడాది కన్నా ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ లో పెరుగుదల సాధ్యమైందని వినోద్ కుమార్ తెలిపారు.

LEAVE A RESPONSE