Suryaa.co.in

Andhra Pradesh

బొజ్జలకు చంద్రబాబు ఆత్మీయ పలకరింపు

– ఇంటికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టిడిపి అధినేత

అమరావతి: తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి కి టిడిపి అధినేత చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొద్ది రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన బొజ్జల…ప్రస్తుతం ఆరోగ్యం కాస్త కుదుట పడడంతో ఇంట్లోనే ఉంటున్నారు. ఈ రోజు బొజ్జల
bojjala2 పుట్టిన రోజు కావడంతో, చంద్రబాబు స్వయంగా హైదరాబాద్ లోని బొజ్జల ఇంటికి వెళ్లి బొజ్జల తో పాటు వారి కుటుంబ సభ్యులతో కొద్ది సేపు గడిపారు. బొజ్జల కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన కేక్ కటింగ్ లో చంద్రబాబు పాల్గొన్నారు. బొజ్జలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి ఆయనకు చంద్రబాబు కేక్ తినిపించారు. బొజ్జల ఆరోగ్య పరిస్థితిని తెలుకుని…జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

LEAVE A RESPONSE