-కేసులంటే భయం లేనప్పుడు కోర్టుల్లో స్టేలు ఎందుకు బాబు?
-ఎన్టీఆర్ ను గుర్తుచేసుకునే అర్హత టీడీపీకి లేదు
-చంద్రబాబు అనుకుల మీడియా నిస్సిగ్గుగా నర్తిస్తోంది
-దేశంలో అత్యధిక పెన్షన్లు ఇస్తున్నది ఏపీలోనే
-ఎంపి విజయసాయిరెడ్డి
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన మండలాల ప్రజలపై తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు ఎక్కడలేని ప్రేమ కురిపించడం ఒక వింత అని వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన సోషల్ మీడియా వేదికగా పలు అంశాలపై ఆయన స్పందించారు.
తండ్రి చంద్రబాబు పిలుపునకు స్పందించి తన ‘సొంత’ నియోజకవర్గం మంగళగిరి నుంచి తన వంతుగా బియ్యం, కూరగాయలు పంపినట్టు లోకేష్ గొప్పలు చెప్పుకోవడం మరో విశేషం అన్నారు. తన తండ్రి విలీన మండలాల పరిస్థితి చూసి చలించిపోయారంటూ లోకేశ్ ప్రకటించుపడం విడ్డురంగా ఉందని చేప్పారు. ఈ మాత్రం సాయం వరద బాధితులకు అందించడానికి చినబాబు స్వయంగా తాను ఓడిన మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు రోజులు క్రితమే రావాల్సివచ్చిందని ఎద్దేవా చేశారు.
తన రాజకీయ జీవితంలో ఎన్నటికీ మరవలేని తొలి ఓటమి అందించిన మంగళగిరి అసెంబ్లీ స్థానం లోకేష్‌కు అంత హఠాత్తుగా గుర్తుకు రావడానికి కారణం రెండేళ్లలోపు వచ్చే ఎన్నికలే అని వేరే చెప్పాల్సిన పనిలేదనన్నారు. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ఎంబీఏ అని గర్వంగా చెప్పుకునే చంద్రబాబు కొడుకు అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్ ఎంత శ్రద్ధగా నేర్చుకున్నారో తెలియదుగాని, రాజకీయ పార్టీని నడపడంలో నైపుణ్యం మాత్రం స్వల్పంగానైనా ప్రదర్శించడం లేదని దుయ్యబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే కేసులంటే తమకు భయమే లేదని ఈ మధ్య లోకేష్ మీడియాకు చెబుతున్నాడని మరి, అంత నిజాయితీపరులు, ధైర్యవంతులు అయితే తమపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సీబీఐ దర్యాపు జరగకుండా ఆయన తండ్రి చంద్రబాబు ఎందుకు కోర్టులు చుట్టూ తిరిగి స్టేలు తెచ్చుకున్నారో లోకేష్ బాబు చెప్పగలడా? అని ప్రశ్నించారు.
ఎన్టీఆర్ మాటలను గుర్తుచేసుకునే అర్హత టీడీపీకి లేనే లేదు!
అధికారంలో ఉన్నవాళ్లు సమాజాన్ని మోసగించే విషయంపై నలభై సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు చెప్పిన మాటలను ఆ పార్టీ నేడు గుర్తు చేసుకోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని విజయసాయిరెడ్డి అన్నారు. తక్కువ కాలంలో ఎన్టీఆర్ రాజకీయాలను అవగాహన చేసుకున్నారంటూ ఆ ప్రజానాయకుడికి ఈ దివాళాకోరు పార్టీ ప్రశంసాపత్రం ఇవ్వడం కూడా తెలుగువారికి మింగుడుపడని విషయమన్నారు. పార్టీ స్థాపించిన రెండన్నరేళ్ళలోపే 1984 ఆగస్టు–సెప్టెంబర్‌లో మొదటి వెన్నుపోటును తన ఆర్థిక మంత్రి నుంచి రామారావు ఎదుర్కొనవలసి వచ్చిందని గుర్తు చేశారు. కానీ ప్రజల అభిమానంతో దానిని తిప్పికొట్టగలిగారు.
60 ఏళ్లు నిండుతున్న సమయంలో 1982లో సొంత పార్టీ పెట్టిన ఎన్టీఆర్ మరో 11 ఏళ్లకే రెండో బలమైన వెన్నుపోటుకు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంతోపాటు ఆరోగ్యం కోల్పోయారని చెప్పారు. సొంత అల్లుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన 1995 ఆగస్టు తిరుగుబాటు విజయవంతమైందన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన 14 ఏళ్లలోనే రామారావు రెండు తిరుగుబాట్లను ఎదర్కొనడంతో ఆయనకు ఈ కొద్ది కాలంలోనే 50 ఏళ్ల రాజకీయానుభవం వచ్చేసిందని వ్యాఖ్యానించారు.
తన మొదటి ఆర్థిక మంత్రి, ‘కోపైలట్’ అర్ధాంతరంగా పొడిచిన వెన్నుపోటును ఎన్టీఆర్ తట్టుకుని నిలబడగలిగారని,కాని తన చివరి ఆర్థికమంత్రి అయిన అల్లుడు నారా చంద్రబాబు నాయడు కొట్టిన దెబ్బకు అధికారంతోపాటు చివరికి ప్రాణాలే కోల్పోయారని చెప్పారు. ఇలా ఆలస్యంగా పార్టీ పెట్టిన 14 సంవత్సరాల లోపే రాజకీయ జీవితంతోపాటు ఎన్టీఆర్ జీవనయానం కూడా ముగిసిందని అన్నారు. కొద్ది కాలంలోనే సాధించిన రాజకీయ అవగాహన ఎన్టీఆర్ కు ఉపయోగపడకుండా పోయిందని చెప్పారు.
చంద్రబాబు అనుకుల మీడియా నిస్సిగ్గుగా నర్తిస్తోంది
చంద్రబాబు అనుకుల మీడియా నిస్సిగ్గుగా వ్యవహర్తిస్తోందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో లక్ష కోట్లకు పైగా ఖర్చులకు లెక్కలే లేవని తెలిసినా ఈ మీడియా ఎందుకు ప్రశ్నించాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు…జగన్ గారి హయాంలో అప్పులంటూ కాకి లెక్కలతో గోల చేస్తోందని మండిపడ్డారు. టీడీపీకి ఓటేస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆగి స్కాంలే మిగులుతాయని ప్రజలందరికీ తెలుసని ఆది ఒక్క పచ్చ మీడియాకు తెలియదన్నారు.
శ్రీలంకతో పోల్చడం అవివేకం
శ్రీలంక ఆర్థిక పరిస్థితిని భారత్‌తో పోల్చడం అవివేకమని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా అన్నారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రాన్నైనా శ్రీలంకతో పోల్చడం అవివేకమని చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాలని ఆయన హితవు పలికారు.
దేశంలోనే అత్యధిక పెన్షన్లు ఇస్తున్నది మన ఏపీలోనే
దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో కూడా వృద్ధాప్య, వికలాంగ, వితంతు పెన్షన్లు 300 నుంచి వెయ్యిలోపే ఉన్నాయని చెప్పారు. కేంద్రం ఇచ్చే డబ్బునే పేరు మార్చి పంచుతున్నారనే అజ్ఞానులు ఇది తెలుసుకోవాలని హితవు పలికారు. దేశంలోనే అత్యధిక పెన్షన్లు ఇస్తున్నది మన ఏపీలోనే అని ఆయన అన్నారు.