Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు తప్పుచేశాడనడం.. ముఖ్యమంత్రి రాజకీయ కక్షలో భాగంగా చేస్తున్న దుష్ప్రచారమే

• స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు సహా..తదనంతర పరిణామాలు…టీడీపీ ప్రభుత్వ పాత్ర…మొత్తం ప్రాజెక్ట్ లో కీలకంగా వ్యవహరించిన అధికారుల ప్రమేయాన్ని ప్రజలు తెలుసుకోవాలి
– మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్

“ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు సంబంధించిన వాస్తవాలను నేడు పుస్తకరూపంలో తెలుగుదేశం పార్టీ ప్రజల ముందు ఉంచిందని, రాజకీయ కుట్రలోభాగంగానే ఈ ముఖ్యమంత్రి, వైసీపీ ప్రభుత్వం చంద్రబాబునాయుడిని, ఆయనకు ఎలాంటి సంబంధం లేని కేసులో అన్యాయంగా ఇరికించిందని, టీడీపీ అధినేతను కుట్రపూరితంగా జైలుకు పంపిన విధానంపై రాష్ట్రప్రజలందరూ ఆలోచన చేయాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ సూచించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

వైసీపీ ప్రభుత్వం.. జగన్ రెడ్డి దృష్టిలో..యువత భవిత, రాష్ట్రాభివృద్ధికోసం పాటుపడటమే చంద్రబాబు చేసిన నేరం
“ ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించాక, రూ.16వేలకోట్ల లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు, కొత్తగా ఏర్పడిన ఏపీని అభివృద్ధిపథంలో పయనింపచేయాలన్న సత్సంకల్పంతో ఏపీలో 6 మిషన్ల అమలుకు ప్రభుత్వపరంగా శ్రీకారం చుట్టారు. దానిలో ఒకటే నాలెడ్జ్ అండ్ స్కిల్ మిషన్. ఆ మిషన్లో భాగంగా కోట్లాదిమంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తే, తద్వారా రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి, అభివృద్ధి వేగవంతమవుతుందని ఆనాడు మా నాయకు డు చంద్రబాబునాయుడు భావించారు.

2013లో గుజరాత్ రాష్ట్రంలో సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు అమలచేసిన ప్రాజెక్ట్ ను పరిశీలించాలని ఏపీ నుంచి ప్రత్యేకంగా ఒక అధికారుల బృందాన్ని పంపారు. ఆ బృందం సూచనలు.. సలహాలు పరిగణనలోకి తీసుకొని, నాడు టీడీపీప్రభుత్వం యువత భవితకోసం స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేష న్ ఏర్పాటు చేసి, దాని అమలుకోసం ప్రత్యేకంగా ఒక శాఖను కూడా ఏర్పాటు చేశారు. ఏపీ యువత భవితకోసం.. రాష్ట్రాభివృద్ధికోసం చంద్రబాబు పాటుపడటమే ఆయన చేసి న తప్పా అని ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం.

ఏపీ నుంచి గుజరాత్ వెళ్లిన అధికారుల బృందం అందించిన సూచనలు సలహాలను అనుసరించి స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన నాటి చంద్రబాబు ప్రభు త్వం దానిలో భాగంగా తొలుత రాష్ట్రంలో 6 సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాలు… 36 శి క్షణా కేంద్రాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తీసుకున్నారు.

ఆ క్రమంలో రాష్ట్రంలో 42 శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి, వాటి ద్వారా దాదాపు 2.13లక్షల మందికి పైగా యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి, వారిలో 72 వేలమందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించడం జరిగింది. అంత గొప్పగా అమలైన ప్రాజెక్ట్ లో తప్పుజరిగిందని నిందలేసి అన్యాయంగా చంద్రబాబుని అరెస్ట్ చేయడం ఎంత దుర్మార్గమో ప్రజలు ఆలో చించాలి. ఈ ప్రభుత్వం చేస్తున్న విషప్రచారంపై ప్రతి ఒక్కరూ లోతుగా ఆలోచించాలి.

ఈ ప్రభుత్వం, సీఐడీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పై చేస్తున్న ఆరోపణలు.. దుష్ప్రచారం అంతా అసత్యాలు.. కట్టుకథల మయం
స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ అనుమతి లేదని చెప్పడం పచ్చి అబద్ధం. ఏ నిర్ణయాన్ని అయినా పాలసీపరంగానే అమలుచేసే వ్యక్తి చంద్రబాబునాయుడు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటులో ముఖ్యమైన జీవోనెం-47ను ఆనాడు టీడీపీప్రభుత్వంలో ఉన్నతవిద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీమతి నీలంసహానీ జారీ చేశారు. అదే నీలంసహానీ నేడు వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పనిచేశారు. అలానే నాడు టీడీపీప్రభుత్వంలో కీలకస్థానంలో ఉన్న అజయ్ కల్లం రెడ్డి స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు అవసరమైన రూ.4 లక్షలను (సీడ్ కేపిటల్ మనీ) విడుదల చేశారు.

కార్పొరేషన్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించి సంతకాలు పెట్టిన వారిలో అజయ్ కల్లంరెడ్డితో పాటు, ఐ.వై.ఆర్ కృష్ణారావు కూడా ఉన్నారు. ఇలా ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించిన అధికారుల జోలికి వెళ్లకుండా వారిని విచారించకుండా పాలసీపరంగా నిర్ణయం తీసుకున్న చంద్రబాబునాయుడిని తప్పుపట్టడం ఎంతవరకు సరైంది? బాధ్యులైన అధికారుల్ని వదిలేసి కేవలం చంద్రబా బునాయుడే లక్ష్యంగా జగన్ సర్కార్ కుట్రపూరితంగా వ్యవహరించడం కక్షపూరితం కాదా?

సిగ్గు, శరం లేకుండా రాజకీయపార్టీకి వచ్చిన విరాళంగా వచ్చిన నిధుల్ని అవినీతి సొమ్ముగా చూపే ప్రయత్నం చేస్తున్నారు
స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లో అవినీతి అని 20 నెలల క్రితమే ఈ ప్రభుత్వ విభాగ మైన సీఐడీ కేసు నమోదు చేసి, దాదాపు 30 మందిని అరెస్ట్ చేసింది. వారితో పాటు ఎందరినో విచారించింది. కొందరి బ్యాంక్ ఖాతాలు పరిశీలించారు. కానీ చివరకు ఒక్క రూపాయి ఫలానా వారి అకౌంట్ కు వెళ్లిందని నిరూపించలేకపోయారు. చివరకు సీఐడీ అభియోగాలు మోపిన వారందరికీ హైకోర్టు బెయిల్ మంజూరుచేసింది. సీజ్ చేసిన బ్యాంక్ ఖాతాలను వెంటనే విడుదలచేయాలని కూడా న్యాయస్థానం ఆదేశించిం ది. అంతా అయిపోయాక మరలా ఇప్పుడు అదే వ్యవహారాన్ని బయటకుతీసి, చంద్ర బాబునాయుడిపై బురదజల్లే ప్రయత్నం మొదలెట్టింది జగన్ రెడ్డి అతని పరివారం.

వేలకోట్ల అవినీతి అని.. వందలకోట్లు చంద్రబాబుకు వెళ్లాయని.. వాళ్లకు డబ్బులు వెళ్లాయి..వీళ్లకు వెళ్లాయని నానా యాగీ చేసిన వారు చివరకు సిగ్గు, శరం లేకుండా ఒక రాజకీయపార్టీకి వచ్చిన విరాళాల సొమ్ముని అవినీతిసొమ్ముగా చూపేందుకు కిందామీదా పడుతున్నారు. ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ నుంచి తీసుకున్న సమాచారాన్ని న్యాయ స్థానాల ముందు పెట్టే దుస్థితికి జగన్ రెడ్డి.. అతని ప్రభుత్వం.. వచ్చిందంటే ఎంతగా దిగజారిపోయిందో ప్రజలు అర్థం చేసుకోవాలి.

స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తో సీమెన్స్ సంస్థకు సంబంధంలేదని చేస్తున్న ఆరోపణ కూడా సత్యదూరమే
సుమన్ బోస్ తర్వాత సీమెన్స్ సంస్థకు ఇండియా హెడ్ గా వచ్చిన మాథ్యూస్ అనే వ్యక్తి, గతంలో ఈడీకి (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) సెక్షన్ – 50 కింద ఒక స్టేట్ మెంట్ ఇచ్చాడు. దానిలో అతనేం చెప్పాడంటే.. “మాకు డిజైన్ టెక్ సంస్థతో 2011 నుంచి భాగస్వామ్యం ఉంది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో మేం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అమలు చేపట్టినా డిజైన్ టెక్ సంస్థ మాకు పార్టనర్ గా వ్యవహరిస్తోంది. ఆ సంస్థ ద్వారానే మేం ఏపీలోప్రాజెక్ట్ అమలు చేశాం” అన్నాడు.

ఇంత స్పష్టంగా మాథ్యూస్ ఇచ్చిన స్టేట్ మెంట్ కనిపిస్తుంటే, స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తో సీమెన్స్ కు.. సీమెన్స్ సంస్థతో డిజైన్ టెక్ కు సంబంధంలేదని జగన్ రెడ్డి….సీఐడీ చెప్పడ దుష్ప్ర చారం కాదా? అలానే మాథ్యూస్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటులో భాగం గా ఏపీ ప్రభుత్వం నుంచి తమసంస్థకు రూ.90కోట్లు అందాయని కూడా ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు. మాథ్యూస్ చెప్పింది ఏదీ వైసీపీ ప్రభుత్వానికి… సీఐడీకి కనప డదు.

రూ.3వేలకోట్లు దారిమళ్లాయని చెబుతున్న బుగ్గన, సీమెన్స్ సంస్థ ఈడీకి ఇచ్చిన స్టేట్ మెంట్ పై ఏం సమాధానం చెబుతాడు?
స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లో రూ.3వేలకోట్లు దారి మళ్లాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి, బుర్రకథల బుగ్గన నిస్సిగ్గుగా నోటికొచ్చింది చెప్పాడు. మొత్తం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ వ్యయమే రూ.3,300కోట్లు. దానిలో సీమెన్స్ సంస్థ గ్రాంట్ ఇన్ కైండ్ గా 90 శాతం వ్యయం భరిస్తుంది. 90 శాతం వ్యయం అంటే నిధులివ్వదు.. సాఫ్ట్ వేర్..ఇతర పరికరాలు అందిస్తుంది. అదే పద్ధతిని కేంద్రప్రభుత్వ సంస్థలైన షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. సెయిల్..ఓఎన్జీసీ వంటివి.. ప్రపంపచంలోని వివిధ సంస్థలు కూడా ఫాలో అయ్యాయి. అదే విధంగా ఏపీలో కూడా సాఫ్ట్ వేర్..పరికరాలు అందించామని చెప్పారు.

ఈడీ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో రూ.35కోట్లు సీమెన్స్ సంస్థకు వస్తే, రూ.1235కోట్ల విలువైన సాఫ్ట్ వేర్ తాము ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు అందించినట్టు చెప్పారు. ఏపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం స్కిల్ డెవల ప్ మెంట్ కార్పొరేషన్ అమలు పర్యవేక్షణ భాద్యత అంతా సీమెన్స్ సంస్థదే. మొత్తం ప్రాజెక్ట్ లో నిజంగా అవినీతి జరిగితే ఆసంస్థను వదిలేసి, పాలసీపరమైన నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబునాయుడు తప్పుచేశాడనడం స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంలో భాగమే. దానిలో భాగమే మా నాయకుడి అక్రమ అరెస్ట్.

స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అంచనా వ్యయం అకారణంగా పెంచారన్న ఆరోపణా నిజంకాదు
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు సంబంధించిన పరికరాలు..సాఫ్ట్ వేర్ అంచనాల మదింపు బాధ్యతను తానే స్వయంగా కేంద్రప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైనింగ్ వారికి అప్పగించానని నాటి ప్రభుత్వంలో పనిచేసిన.. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో కొనసాగుతున్న ప్రేమచంద్రారెడ్డి అనే అధికారి చెప్పారు.

కేంద్రప్రభుత్వ సంస్థ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ శిక్షణా కేంద్రాల్లోని పరికరాలు.. సాఫ్ట్ వేర్ ను పరిశీలించి.. అంచనాలు మదించి..దానికి సంబంధించిన నివేదికను కూడా అందించినట్టు చెప్పారు. ఆయనే మరలా నిధుల విడుదలకు సంబంధించిన ఫైనాన్షియల్ అండర్ టేకింగ్ ఒప్పందంపై తానే సంతకం పెట్టినట్టు ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఆ ఒప్పందంలో డిజైన్ టెక్..సీమెన్స్ సంస్థలుకూడా సంతకాలు పెట్టాయ ని గంటా సుబ్బారావు అనే వ్యక్తి కేవలం సాక్షి సంతకమే పెట్టారని కూడా ప్రేమచంద్రా రెడ్డి ఈడీకి చెప్పారు. మొత్తం బాధ్యత తీసుకొని.. సంతకం పెట్టిన ప్రేమచంద్రారెడ్డిని విచారించకుండా.. సాక్షి సంతకం పెట్టిన గంటాసుబ్బారావుని నింది తుడిని చేయడం జగన్ సర్కార్ కక్ష సాధింపులో భాగమనక ఏమనాలి?

ప్రేమచంద్రా రెడ్డి పేరు కూడా ఎక్కడా సీఐడీ ఎఫ్.ఐ.ఆర్ లో లేదు. నిధుల విడుదలలో ప్రేమచంద్రా రెడ్డే ప్రధానంగా వ్యవహరించారు. ఆయనతో పాటు.. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో కీలకంగా వ్యవహరించిన నీలంసహానీ..అజయ్ కల్లంరెడ్డి… ఐ.వై.ఆర్ కృష్ణారావులు కూడా నిందితులు కారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలన్నీ నాడు టీడీపీప్రభుత్వంలో ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అజయ్ కల్లంరెడ్డే పరిశీలించి, నిర్ణయం తీసుకున్నారని, అప్పుడు ఆయనతో పనిచేసిన పీ.వీ.రమేశ్ అనే అధికారి చెప్పారు. అధికారులు ఎవరూ బాధ్యులు కానప్పుడు.. ముఖ్యమంత్రి, మంత్రులు ఎలా బాధ్యులు అవుతారు?

ఈ ముఖ్యమంత్రి సైకోనో…ఉన్మాదో.. ప్రజలే అర్థం చేసుకోవాలి
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో ఏమీ జరక్కపోయినా.. కావాలనే చంద్రబాబునాయుడి పై కక్షతోనే ఈ ప్రభుత్వం.. ఈ ముఖ్యమంత్రి ఆయన్ని అన్యాయంగా జైలుకు పంపారనే వాస్తవం ప్రజలు తెలుసుకోవాలి. జగన్ రెడ్డి చేస్తున్న వేలకోట్ల దోపిడీని తాము, తమ అధినేత ప్రశ్నిస్తున్నామనే ఈ విధంగా తప్పుడుకేసుల్ని తెరపైకి తెస్తున్నాడు.

చంద్రబాబునాయుడిని అరెస్ట్ చేయక ముందే తెలుగుదేశంపార్టీ జగన్ రెడ్డి అవినీతి..దోపిడీని ఆధారాలతో సహా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు మొదలెట్టింది. చంద్రబాబునాయుడు రాష్ట్ర యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలని ఆరాటపడితే, జగన్ రెడ్డేమో గంజాయి, డ్రగ్స్ కు యువశక్తిని బలిపెట్టే స్థితికి వచ్చాడు. ఇలాంటి వ్యక్తి ని ఉన్మాది అంటారో.. సైకో అంటారో.. ఆర్థిక ఉగ్రవాది అంటారో ప్రజలే నిర్ణయించుకోవా లి.” అని ధూళిపాళ్ల నరేంద్ర స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE