Suryaa.co.in

Andhra Pradesh

చంద్రగిరి నియోజకవర్గం చెదపట్టిన చెక్కలా తయారైంది

– ఓటర్ల జాబితాలో అవకతవకలు.. పోలింగ్ బూత్ ల ఏర్పాటులోఅధికారుల్ని మారిస్తే తప్ప.. నియోజకవర్గంలో ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరిగే పరిస్థితి లేదు
• 2019 ఎన్నికల వేళ చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా 2.90లక్షల ఓట్లుంటే, 325 పోలింగ్ బూత్ లు ఉన్నాయి
• తాజాగా ఎన్నికల కమిషన్ విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పరిశీలిస్తే 3.09లక్షల ఓట్లు.. 395 పోలింగ్ బూత్ లు ఉన్నట్టు చూపారు
• పెంచిన మరియు… స్థానమార్పిడి చేసిన పోలింగ్ బూత్ లు కలిపి మొత్తం 129కి పైగా ఉన్నాయి. ఈ స్థాయిలో దేశంలో ఎక్కడా బూత్ లు ఏర్పాటు చేయలేదు
• చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి భయపడి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారుల్ని వదిలిపెట్టం
• చంద్రగిరి నియోజకవర్గ ఓటర్ల జాబితాలోని అవతతవకలు.. అధికారుల తప్పిదాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి చెవిరెడ్డి అక్రమాలకు చెక్ పెడతాం
– టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు

ఎన్నికల సంఘం విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్లో భాగంగా టీడీపీ జరిపిన ఇంటింటి సర్వేలో కొన్ని నియోజకవర్గాల్లో అత్యంత దారుణమైన పరిస్థి తుల్ని గమనించామని, ప్రధానంగా చంద్రగిరి నియోజకవర్గంలో నమోదైన దొంగ ఓట్లు చూస్తే ఎవరైనా కంగుతినాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు తెలిపారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ 2019 నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో ఇప్పటివరకు మూడు ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్.. స్థానిక సంస్థల ఎన్నికలు… గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ మూడుఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో సాధారణ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికి వందలాది దొంగ ఓటర్లను తాము గుర్తించి, ఎన్నికల అధికారులకు అప్పగించడం జరిగింది.

దేశంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా చంద్రగిరిలో 129కి పైగా బూత్ లు (కొత్త మరియు స్థానమార్పిడి చేసిన బూత్ లు) ఏర్పాటు చేశారు
2019 ఎన్నికల జాబితా ప్రకారం చంద్రగిరి నియోజకవర్గంలో 2.90లక్షల ఓట్లు ఉంటే, 325 బూత్ లు ఉన్నాయి. 27-10-2023న ఎన్నికల కమిషన్ ఇచ్చిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రకారం ఆ నియోజకవర్గంలో ఉన్న ఓట్లు 3.09లక్షల ఓట్లు. 3 లక్షల 9వేల ఓట్లకు అక్కడున్న పోలింగ్ బూత్ లు మాత్రం 395. గతంలో 325 బూత్ లు ఉంటే తాజాగా 70 బూత్ లు పెంచి.. 395 బూత్ లు ఉన్నట్టు చూపారు. 70 పోలింగ్ బూత్ లు పెరగడమే కాకుండా, 59 పోలింగ్ బూత్ లను వేరేచోటకి మార్చారు. మొత్తంగా 129 పోలింగ్ బూత్ లను చంద్రగిరి నియోజకవ ర్గంలో డిస్టర్బ్ చేయడం జరిగింది. దేశంలో ఏ నియోజకవర్గంలో కూడా ఈ స్థాయిలో కొత్త బూత్ ల ఏర్పాటు.. పాత బూత్ ల స్థానమార్పిడి జరగలేదు. ఈ స్థాయిలో పోలింగ్ బూత్ లు పెరిగాయంటే కనీసం ఆ నియోజకవర్గంలో దాదాపు 50వేలకు పైగా కొత్తఓట్లు నమోదవ్వాలి.

కానీ అదేమీ జరగలేదు. 2019 ఎస్.ఎస్. ఆర్ తో పోలిస్తే, తాజాగా ఎన్నికల కమిషన్ విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ను పరిశీలిస్తే చంద్రగిరి నియోజకవర్గంలో 19వేల ఓట్లు మాత్రమే పెరిగాయి. పెరిగిన ఓట్ల ప్రకారం చూస్తే 5, 6 కు మించి పోలింగ్ బూత్ లు పెరగడానికి వీల్లే దు. పోలింగ్ బూత్ లు మార్పిడి కూడా 4, 5 కు మించి జరగదు. కానీ 59 పోలింగ్ బూత్ లు మార్చారంటే ఆ నియోజకవర్గంలో అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో జరుగుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చంద్రగిరి నియోజకవ ర్గంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న వ్యవహారాలపై తాము కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాం. ఎలక్షన్ కమిషనర్ స్థానిక జిల్లా కలెక్టర్.. ఇతర అధికారుల్ని ఆదేశించినా, వారంతా స్థానికఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారానికి భయపడి ఏమీ చేయలేని పరిస్థితి.

టీడీపీ బీఎల్వోలు ఇచ్చే ఓట్ల దరఖాస్తులు బుట్టదాఖలు చేస్తూ..వైసీపీ బీఎల్వోల వివరాల్ని మాత్రమే అధికారులు అప్ లోడ్ చేస్తున్నారు
డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ విడుదలకు ముందు చంద్రగిరి నియోజకవర్గంలో 36వేల కొత్త ఓట్ల నమోదుకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ మొత్తంలో 10,557 ఓట్లను పరిగణన లోకి తీసుకొని, 16,410 ఓట్లను పక్కనపెట్టారు. 16వేల పైచిలుకు ఓట్లు నమో దు చేయకుండా ఎందుకు పక్కన పెట్టారా అని ఆరాతీస్తే ఆ ఓట్లవివరాలు టీడీపీ బీ.ఎల్.వోలు ఇచ్చినవని తేలింది. వైసీపీ బీ.ఎల్.వోలు ఇచ్చిన ఓట్లను మాత్రమే జాబితాలో చేర్చి.. టీడీపీ ఇచ్చినవాటిని పక్కనపెట్టారు. అలానే ఫామ్-7 దరఖా స్తుల్లో కూడా అలానే చేశారు. మొత్తం 13వేలకు పైగా ఫామ్-7 దరఖాస్తులువస్తే, వాటిలో వైసీపీ ఇచ్చిన 5,990 దరఖాస్తులు ఆమోదించి, టీడీపీ ఇచ్చిన 7వేల కు పైగా దరఖాస్తులు పక్కన పెట్టారు.

ఇదంతా గమనిస్తే చంద్రగిరి నియోజకవర్గం లో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయా అనే అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతోంది. నియోజకవర్గంలోని అధికారుల్ని మార్చకపోతే ఎవరూ వచ్చేఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునే పరిస్థితి ఉండదు. స్థానిక జిల్లా కలెక్టర్ తన తీరు మార్చుకోకుంటే టీడీపీ అధికారంలోకి రాగానే కచ్చి తంగా అతని సంగతి తేలుస్తుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా అధికారులు చాలా దారుణంగా వేలాది దొంగఓట్లు చేర్పించారు. చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దుశ్చర్యలు, దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి వ్యక్తికి భయపడే అధికారులు ఓటర్ లిస్ట్ ను కూడా చెవిరెడ్డి చెప్పి న విధంగా ఎలా పడితే అలా మారుస్తున్నారు.

ఒకే వ్యక్తి ఫోటోతో వేర్వేరు ప్రాంతాల్లో ఓట్లు ఉండటం చంద్రగిరి నియోజకవర్గంలో సర్వసాధారణంగా మారింది
ఒకే వ్యక్తి ఫోటోతో వేర్వేరు చోట్ల ఓట్లు ఉండటం అనేది చంద్రగిరి నియోజకవర్గంలో సర్వసాధారణమైన విషయం. తిరుపతి వెళ్లి తలనీలాలు ఇచ్చినప్పటి ఫోటోతో ఒక ఓటు..తర్వాత జుట్టు వచ్చాక అదే వ్యక్తి ఫోటోతో మరో ఓటు నమోదు చేశా రు. అలానే ఒకే డోర్ నెంబర్లో ఉండే ఓట్లే, మరో ప్రాంతంలో మరో డోర్ నెంబర్లో ఉన్నాయి. ఇవన్నీ గమనిస్తే చెదపట్టిన చెక్క మాదిరిగా చంద్రగిరి నియోజకవర్గ ఓటర్ల జాబితా ఉందని చెప్పక తప్పదు. మరోవైపు టీడీపీ బీఎల్వోలపై స్థానిక పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. వారు ఓటర్ల జాబితా పరిశీలన చేయకుండా అడ్డుకుంటున్నారు.

చంద్రగిరి నియోజకవర్గంలో తప్పు చేసిన అధికారుల్ని కచ్చితంగా శిక్షించే తీరుతాం. రిటైరైనా సరే వారిని న్యాయస్థానాల్లో నిలబెట్టి శిక్ష పడేలాచేస్తాం
27-10-2023న విడుదలైన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ లో డిసెంబర్ 9వరకు మార్పు చేర్పులు చేసుకునే అవకాశముంది. దాని ప్రకారం చంద్రగిరి నియోజకవర్గంలో ఇష్టానుసారం ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లు మార్చాలని.. అవసరం లేని వాటిని తొలగించాలని తాము ఫిర్యాదు చేస్తే స్థానిక అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎలాంటి సమస్యాత్మక ప్రాంతం కానప్పటికీ ఒక్కోచోట 4, 5 చిన్నచిన్న పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. పెరుమాళ్లపల్లి కాలనీ అనే ప్రాంతంలో 2019లో 4 పోలింగ్ బూత్ లలో 4152 ఓట్లు ఉంటే, ఇటీవల విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రకారం 4 బూత్ లను 7 బూత్ లు చేసి, వాటిలో 4314 ఓటర్లు ఉన్నట్టు చూపారు.

ఈ విధంగా ఎందుకు బూత్ లు మారుస్తున్నారని అడిగినా అధికారుల నుంచి సమాధానం రావడంలేదు. ఒకే ప్రాంతంలో సమీప దూరంలోనే వరుసగా 7 పోలింగ్ బూత్ లు పెట్టారు. అలా పెట్టడం నిబంధనలకు విరుద్ధమని తెలిసినా, అధికారులు ఏవేవో సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు . పోలింగ్ బూత్ లపై అధికారపార్టీ ఎమ్మెల్యేకి.. అతని అనుచరులకు పట్టుకల్పిం చాలనే ఉద్దేశంతోనే అధికారులు ఇష్టమొచ్చినట్టు బూత్ లు మార్చారని అర్థమ వుతోంది. చంద్రగిరి నియోజకవర్గంలో జరిగే తప్పిదాలు.. దొంగఓట్ల నమోదుకు బాధ్యులైన ఏ అధికారిని వదిలిపెట్టం. వారు రిటైరైనా సరే.. ఎక్కడున్నా న్యాయ స్థానాల్లో నిలబెట్టి, కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తాం.

ఎన్నికల విధుల్లో ఉన్న ఆర్డీవోలు, తహసీల్దార్లు, స్థానిక కలెక్టర్ తక్షణమే స్పందించి చంద్రగిరి నియోజకవర్గంలోని ఓటర్ల జాబితా సవరణ, బూత్ ల మార్పుపై చట్టపరంగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని హెచ్చరిస్తున్నాం. ప్రజలు తమమనస్సాక్షి ప్రకారం ఓటేయాలని ఒకసారి నిర్ణయించుకుంటే, ఎవరుఎన్ని కుట్రలు పన్నినా వారి నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం ఉండదని ఇప్పటికే తేలిపోయింది.” అని అశోక్ బాబు స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE