Suryaa.co.in

Andhra Pradesh National

నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3

జాబిల్లిపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-3 ప్రయోగాన్ని శుక్రవారం చేపట్టింది. ఈ మధ్యాహ్నం 2.35 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్వీఎం-3 ఎం4 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ తో కూడిన చంద్రయాన్-3 యాత్రలో భాగంగా ఈ అత్యంత శక్తిమంతమైన రాకెట్ జాబిల్లి దగ్గరకు బయల్దేరింది.

ఈ రాకెట్ చంద్రయాన్-3 ని భూమి చుట్టూ ఉన్న 170×36,500 కిలోమీటర్ల దీర్ఘ వృత్తాకార కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టనుంది. ఇది 24 రోజులు పుడమి చుట్టూ తిరుగుతుంది. ఆ తర్వాత క్రమంగా దీని కక్ష్యను పెంచుతూ చంద్రుడి దిశగా ప్రయాణించే కక్ష్యలోకి చేరుస్తారు.

పలు ప్రక్రియల తరవాత అంతిమంగా చంద్రుడి చుట్టూ 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి దీన్ని ప్రవేశపెడతారు. ఆగస్టు 23 లేదా 24న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్, రోవర్తో కూడిన మాడ్యూల్ విడిపోయి చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం దగ్గర దిగనుందని ఇస్రో వెల్లడించింది.

LEAVE A RESPONSE