మోడీ అవినీతి పరులను జైళ్లలో ఎందుకు పెట్టించడం లేదు అని కొందరు మిత్రులు ప్రశ్నిస్తున్నారు. అసలు ముందు తెలుసుకోవలసింది ఏమిటంటే.. ఏ ప్రభుత్వం అయినా అవినీతి పై దాడులు చేయగలదు, కేసులు పెట్టగల దు , అరెస్ట్ చేయగలదు (కోర్టులు ముందస్తు బెయిల్ ఇవ్వని కేసుల్లో మాత్రమే). ఆ తరువాత ఆ కేసు పూర్తిగా కోర్టు పరిధిలోకి వెళ్ళిపోతుంది. ముందస్తు బెయిల్స్ ఇచ్చి విదేశాలకు వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఇస్తున్నాయి మన కోర్టులు.
ఇప్పటికే సోనియా, రాహుల్, ఆస్కార్ ఫెర్నాండెజ్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి హూడా, చిదంబరం, కార్తీ చిదంబరం, లాలూ, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, జగన్ మొదలగు చాలా మంది అవినీతి కేసులు పై బెయిల్ మీద వున్నారు. అలాగే అవినీతి పై యుద్ధం అంటూ కేజ్రీ మొదలుపెట్టిన ఆప్ ఢిల్లీ ప్రభుత్వ సగం మంది మంత్రులు జైల్లో వున్నారు.
₹900కోట్లు గడ్డి తిన్నాడు అనే ఆరోపణలు పై లాలూ మీద కేసు 30సం.లు నడిచి చివరకి శిక్ష పడితే , అనారోగ్యం అని చెప్పి శిక్షా కాలం అంతా ప్రభుత్వ గెస్ట్ హౌస్ ల్లో, ఎఐమ్స్ లో గడిపేసి, శిక్షా కాలం పూర్తిగా అనుభవించకుండానే మళ్లీ కోర్ట్ బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ తీసుకుని హాయిగా సింగపూర్ వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుని, ఆరోగ్యం తో బయట తిరుగుతూ మళ్ళీ మోడీ మీద ముఠా తయారు చేసే పనిలో బిజీగా వున్నాడు.
బోఫోర్స్ కేసు 30 సంవత్సరాలు పైగా సాగింది.
కోట్ల కొద్దీ ప్రభుత్వ వృధా ఖర్చు తప్పితే చివరకు తేలింది ఏం లేదు.
అదీ కాక ఓ పది మందిని జైల్లో పడేస్తే , అవినీతి పూర్తిగా తగ్గిపోతుందా? లేక అవినీతి జరుగుతున్న పద్ధతులకు కళ్లెం వేస్తే అవినీతి పూర్తిగా పోతుందా?
ప్రజలకు నిజమైన నిష్కలంక పాలన అందించాలంటే, కలకాలం నిలబడే పారదర్శతకు పెద్ద పీట వేసే చర్యలే మేలు.. ఆ చర్యలు ప్రజలకు కొన్నాళ్ళు ఇబ్బంది కలిగించినా, నాయకుడు అధికారం కోల్పోయే ప్రమాదం వున్నా .. నిజమైన నాయకుడు మరియు ప్రజల మేలు కోరుకునే నాయకుడు అటువంటి కఠినమైన చర్యలే తీసుకుంటాడు.
ఇక్కడ మనం అర్ధం చేసుకోవలసింది ఒకటి ఉంది. 70 ఏళ్లుగా కుళ్లిపోయిన అవినీతి వ్యవస్థలో, ప్రతీ పనిముట్టు అవినీతి మయమే.. మార్పు రావాలంటే రాత్రికి రాత్రే మార్పు రాదు.. పోనీ కనీసం పాలించేవాడికి ఆ దిశగా నిబద్దత ఉందా లేదా అనేది అతని చర్యలు బట్టి నిర్ణయించవచ్చు.
ఇక్కడ మనం చూడవలసింది అసలు మోడీకి అధికారం దేనికి?
వ్యక్తిగత ఆస్తులు పెంచుకోడానికా? కుటుంబ సభ్యులకు తన తరువాత అధికారం అప్పచెప్పడానికా?
కాదు, అంబానికి, ఆదాని కి దోచిపెట్టడానికే మోడీ కి అధికారం అంటారు కొందరు. పోనీ కాసేపు అదే నిజం అనుకుంటే.. ఈ ఇద్దరూ 2014 ముందే దేశంలోనే అతి పెద్ద ధనవంతులుగా తయారు చేసింది ఎవరు? అంటే ముందు ప్రభుత్వాలు వారికి దోచి పెట్టాయా?
అంటే మోడీ రాక ముందు అంబానీ ఆదానిలు పెరిగారు. అలాగే రాజకీయ కుటుంబాలు అయిన సోనియా, పవార్, లాలూ, ములాయం, కరుణానిధి, దేవా గౌడ, చంద్రబాబు, జగన్, కేసీఆర్ ఇలా చాలా రాజకీయ కుటుంబాలు ఏ పెద్ద వ్యాపారాలు చేయకుండా వేల కోట్లు పోగేసుకున్నది నిజం కాదా?
అంటే మోడీ రాక ముందు, అంబానీ ఆదానిలు వ్యాపారాలు చేసుకుంటూ పెరిగారు ఇప్పుడూ పెరుగుతున్నారు. మరి ఏ వ్యాపారాలు చేసి, కుల.కుటుంబ రాజకీయ పార్టీలు అన్ని వేల కోట్లు ఎలా కూడబెట్టుకున్నాయి? ఇప్పుడు కనీసం బిజెపి రాజకీయ కుటుంబాలు, ఏవి ఇంత పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నట్లు ఆరోపణలు లేవు కదా? అలాగే కేంద్ర మంత్రులు మీద కూడా ఈ 9 సం. లలో అవినీతి ఆరోపణలు లేవు కదా?
పోనీ, మోడీకి ఒట్టి అధికార పిపాస మాత్రమే.. అందుకే అధికారంలో ఉండడానికి తాపత్రయ పడుతున్నాడు అని అనుకుందాం. అదే నిజం అనుకుంటే అటువంటి వాడు ఏం చేస్తాడు?
దేశం నాశనం అయిపోయినా ఫరవాలేదు, ఆర్థిక వ్యవస్థ బ్రష్టు పట్టినా ఫరవాలేదు, ప్రపంచ బ్యాంకు నుండి కావలసినన్ని అప్పులు తెచ్చి.. అన్నీ ప్రజలకు ఫ్రీగా నో , చవగ్గా నో ఇవ్వవచ్చు. అందరికి అన్ని చవగ్గా వచ్చాయా లేదా? అనేదే కావాలి కానీ ఎలా చవగ్గా ఇవ్వ గలుగుతున్నారు అని ఎవరికి అవసరం లేదు?
సబ్సిడీ ఇస్తున్నారు అంటే అవి కూడా మన డబ్బులే కదా అనే కనీస ఆర్ధిక స్పృహ కూడా సామాన్య జనాలకు ఉండటం లేదు. జనాల ఈ పట్టించుకోని తనాన్ని అర్ధం చేసుకున్న కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు లాగా మోడీ కూడా అన్ని ఉచితాలు ప్రకటించవచ్చు. అలా చేసి ఉంటే 2019 లో ఏ కష్టం లేకుండా మోడీ 500 సీట్లలో గెలిచేవాడు.
కానీ, అలా కాకుండా ప్రజలకు ఇబ్బంది కలిగించే నోట్ల రద్దు, gst , పెట్రోల్, గాస్ ధరలు తగ్గించకపోవడం, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు ఇబ్బంది కలిగించే బినామీ చట్టాలు, బాంక్ లోన్స్ రికవరీ కోసం కఠిన మైన చట్టం వంటివి తేవడం లాటి చేదైన పనులు ఎందుకు చేస్తాడు? అప్పులు తెచ్చి గొప్ప గొప్ప హై వేలు నిర్మించడం వాటికి టోల్ రేట్లు పెట్టి ప్రజలతో తిట్లు తినడం దేనికి?
అంటే అతనికి పదవి పోయినా ఫరవాలేదు. ఉన్న 5 ఏళ్ళు కొంచం మంచి చేసి పోదాం. పైవాడు ఎన్నాళ్లు కుర్చీలో ఉంచితే అన్నాళ్లు ఉంటాను. లేకపోతే సంచి భుజాన వేసుకొని బయటకు పోతాను అని పరిపాలిస్తున్నాడు తప్ప.. పదవి అంటే యావ వుండే వాడు చేసే పరిపాలనా పద్దతి ఇది కాదు.