నంద్యాల : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లన్న దర్శనాలలో పలు మార్పులు చేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ అధికారి చంద్రశేఖర్ ఆజాద్ మంగళవారం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైల పుణ్యక్షేత్రంలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాల్లో మార్పులకు శ్రీకారం చుట్టారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా ప్రతి శని, ఆది, సోమవారాలు, ప్రభుత్వ సెలవు రోజుల్లో దేవస్థాన వైదిక కమిటీ నిర్ధారించిన మేరకు భక్తులందరికీ కేవలం స్వామివారి అలంకరణ దర్శనం మాత్రమే కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
వైదిక కమిటీ సూచించిన విశేష రోజుల్లో రూ.500 రుసుంతో కల్పించబడుతున్న శ్రీ స్వామివారి సర్పదర్శనం, రూ.5 వేల రుసుంతో నిర్వహిస్తున్న గర్భాలయ ఆర్జిత అభిషేకాలు, రూ.1500 రుసుంతో నిర్వహిస్తున్నసామూహికార్జిత అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేయటమైనదని తెలిపారు. ఆన్ లైన్ టికెట్లు అన్నింటిని కూడా నిలుపుదల చేయటమైనదని తెలిపారు. భక్తులందరూ ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు.