Suryaa.co.in

Andhra Pradesh Crime News

మామను ముంచేసిన మేనల్లుడు

– మేనమామ కంపెనీలో పనిచేస్తూ 5 కోట్ల నిధులు స్వాహా చేసిన ఘనుడు
-స్థానిక పోలీసుల సహకారంతో నిందితుని అరెస్టు చేసిన చెన్నై సి సి బి పోలీసులు

పుంగనూరు : తమిళనాడు లోని చెన్నై సాలిగ్రామ్ లోనున్న బుల్ డైయర్స్ ఇంట్రగ్రేటెడ్ సొల్యూషన్స్ సంస్థ లో 5 సం లుగా వివిధ హోదాలలో పనిచేసిన ప్రస్తుతం ఫైనాన్సిల్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న పుంగనూరు పట్టణం తాటిమాకుల పాళ్యంకు చెందినరఘునాథ్ రెడ్డి కుమారుడు శ్రావణ్ కుమార్ 29 సం కంపెనీలో సుమారు 5 కోట్లు రూ నిధులు దుర్వినియోగం చేసి, కంపెనీని డిఫాల్ట్ చేసాడని చెన్నయ్ లోని సీ.సి.బి పోలీసులకు ఫిర్యాదు చేసిన కంపెనీ యజమాని శ్రీనాథ్ రెడ్డి. కంపెనీ యజమాని శ్రీనాధ రెడ్డికి నిందితుడు స్వయాన మేనల్లుడు కావడం కొసమెరుపు.

శ్రావణ్ కుమార్ రెడ్డి కంపెనీ వదిలి పెట్టిన నాటి నుండి శ్రావణ్ కుమార్ స్వగ్రామం ధర్మారం పల్లి పుంగనూరు మండలం అం పరిసరాల్లో గెస్ట్ హౌసుల స్థిరాస్తులు నిర్మించడమే కాకుండా లెగ్జీరి కార్లు, జేసిబిలు, కోళ్ల ఫారాలు నిర్మించాడు.కంపెనీ నిధులను మన కుటుంబ సభ్యుల 11 ఖాతాదారులకు స్వాహా చేసిన నిధులు మళ్ళించాడ ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇప్పటివరకు చెన్నై సీఐసిబి పోలీసులు దర్యాప్తులు నిందితుడు స్వాహా చేసిన నిధులు బయటపడబోతున్నట్లు కంపెనీ యజమాని శ్రీనాథ్ రెడ్డి తెలిపారు.నిందితుడిని అరెస్టు చేయడానికి వచ్చిన తమిళనాడు పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని, చివరకు పోలీసుల సహకారంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

LEAVE A RESPONSE