-జగన్ రెడ్డి అవినీతి, రాష్ట్రంలో వరుసగా ఆడబిడ్డలపై జరుగుతున్న అఘాయిత్యాలనుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే నారాయణ ను అరెస్ట్ చేశారు. నారాయణ అరెస్ట్ తో రాష్ట్రంలో ఆర్థికంగా, రాజకీయంగా బలపడుతున్న ఆయన సామాజికవర్గాన్ని జగన్ రెడ్డి లక్ష్యంగా చేసుకున్నాడని మరోసారి స్పష్టమైంది
• పదోతరగతి పరీక్ష పేపర్ల లీకేజ్ ఘటనలో నారాయణను అరెస్ట్ చేసుంటే, రాష్ట్రంలో ఎక్కడా పరీక్షపేపర్లు లీక్ కాలేదన్న మంత్రి బొత్స మాటలకు విలువలేదనే భావించాలా?
• పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు, నారాయణ అరెస్ట్ తో, జగన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రధాన సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారు అర్థమవుతోంది
• జగన్మోహన్ రెడ్డి ఇదేవిధంగా కక్షసాధింపు వైఖరితో ముందుకెళ్తే, అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటాడు
– మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు
రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ, జగన్ రెడ్డి ఆయన ప్రభుత్వం సాగిస్తున్న అవినీతి, ఆడబిడ్డలపై జరుగుతున్న అఘాయిత్యాలను ంచి ప్రజల దృష్టి మళ్లించడానికే మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను జగన్ రెడ్డి అరెస్ట్ చేయించాడని, రాయలసీమ, నెల్లూరు లో బలంగా ఉన్న నారాయణ సామాజికవర్గంపై ముఖ్యమంత్రికి ఉన్నకోపం, ఈర్ష్యాద్వేషాలు కూడా ఆయన అరెస్ట్ కు కారణమని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు పేర్కొన్నారు.
మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
హైదరాబాద్ లోని కొండపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాసముంటన్న మాజీమంత్రి నారాయణను, ఆయన సతీమణిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ నిమిత్తం చిత్తూరు కు తరలిస్తున్నట్లు చెప్పారు. పేపర్ లీకేజ్ ఘటనపై గత నెల 27న చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.
సదరు ఎఫ్ఐఆర్ లో నారాయణ ముద్దాయి అని ఎక్కడా పేర్కొనలేదు. దానికంటే ముందు రాష్ట్రంలో ఎక్కడా పదోతరగతి ప్రశ్నపత్రాలు లీక్ కాలేదని, అలా వస్తున్న వార్తలన్నీ కేవలం ఎల్లోమీడియా సృష్టిస్తున్న వేనని, స్వయంగా ప్రస్తుత విద్యాశాఖ మంత్రి బొత్ససత్యనారాయణే స్వయంగా చెప్పారు. “పదోతరగతిపరీక్షపత్రాలు ఎక్కడా లీక్ కాలేదని, విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరూఆందోళనచెందాల్సిన పనిలేదని, ఈప్రభుత్వం పదోతరగతిపరీక్షలను పకడ్బందీగా, కట్టుదిట్టమైన భద్రతావ్యవస్థలమధ్య నిర్వహిస్తోంది, పరీక్షపత్రాలు లీక్ అవుతున్నాయన్న వార్తలన్నీ ఎల్లోమీడియా సృష్టేననని, పేపర్ లీకేజ్ ఘటనలో ఎంతటిపెద్దవారున్నా చర్యలుతప్పవు” అని స్వయంగా బొత్స సత్యనారాయణే చెప్పారు.
ఆయన వ్యాఖ్యల తాలూకా అంశాలేప్రధానవార్తగా సాక్షిదినపత్రిక లో వార్తకూడాప్రచురితం అయ్యింది. అలానే కర్నూలులో డీఐజీ సెంథిల్ కుమార్ మాట్లాడు తూ, ఒక పదోపరగతి పరీక్షపత్రాన్ని స్కానింగ్ కోసం బయటకుతీసుకొచ్చి, దాన్ని ఆన్సర్ షీట్ కు యాడ్ చేశారుతప్ప, రాష్ట్రంలోఎక్కడా పదోతరగతి ప్రశ్నపత్రాలు లీక్ కాలేదని చెప్పా రు. అసలు రాష్ట్రంలో ఎక్కడా పదోతరగతి పరీక్షపత్రాలు లీక్ కాలేదనిచెప్పిన మంత్రి బొత్సనే తరువాత కొందరు ఉపాధ్యాయుల్ని అరెస్ట్ చేశామని కూడాచెప్పారు.
అదే మంత్రి మరలా ఇప్పుడు నారాయణ అరెస్ట్ పై మాట్లాడుతూ, తప్పు చేసిన వారు తప్పు చేయలేదని నిరూపించుకోవాలంటూ హితోపదేశం చేస్తున్నారు. ఈ విధంగా పరీక్షపేపర్ల లీకేజ్ ఘటనలో మంత్రి బొత్స,పోలీస్ అధికారి సెంథిల్ కుమార్ ఏమీ జరగలేదని చెప్పాక కూడా, ఇప్పుడు అదే అంశాన్నితెరపైకి తెచ్చి మాజీ మంత్రి నారాయణను ఎందుకు అరెస్ట్ చేశారో సమాధానం చెప్పాలి. 27-04-2022న చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదుచేసిన 111/2022 ఎఫ్ఐఆర్ లో ఎక్కడా నారాయణపేరులేదు. సదరు ఎఫ్ఐఆర్ లో నమోదుచేసిన సెక్షన్ల ప్రకారం 3 ఏళ్లనుంచి 7ఏళ్లవరకు శిక్షపడేఅవకాశాలున్నాయి. జస్టిస్ ఆర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్ ప్రభుత్వం కేసులో ఇచ్చిన తీర్పులో 7సంవత్సరాల్లోపు శిక్షలుపడే ఏసెక్షన్లు నమోదు చేసినా, వారిని అరెస్ట్ చేయకూడదని, ముందుగా సీఆర్ పీసీ 41(ఏ) కింద నోటీసులు ఇచ్చి, విచారణకు పిలవాలనిస్పష్టంగా ఆదేశాలివ్వడం జరిగింది.
కానీ ఏపీ ప్రభుత్వం నారాయణ అరెస్ట్ లో న్యాయస్థానం ఆదేశాలను తుంగలోతొక్కిమరీ, ఆయనేదో నేరస్తుడు, దొంగఅయిన ట్టు హడావుడిగా అరెస్ట్ చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకపాలన, రాజకీయకుట్రలో భాగంగానే నారాయణను అరెస్ట్ చేశారని, ఆయన్ని అదుపులోకి తీసుకున్నవిధానమే చెబు తోంది. జగన్మోహన్ రెడ్డి తన అవినీతి, దోపిడీతో రాష్ట్రాన్ని అప్పులఊబిలోకి నెట్టేసి, ఏపీని మరో శ్రీలంక చేయడానికి సిద్ధమైన తరుణంలో, ప్రజలు ఆవిషయాలు చర్చించుకోకూడదనే ఏపీ ప్రభుత్వం నారాయణ అరెస్ట్ అంశాన్ని తెరపైకి తెచ్చింది.
అలానే రాష్ట్రంలో ఆడబిడ్డలపై జరుగుతున్న అఘాయిత్యాలు తెరమరుగు చేసే కుట్ర కూడా ఈ అరెస్ట్ అంశం వెనకదాగిఉంది. కలెక్షన్ కింగ్ వై.ఎస్.కొండారెడ్డి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న జనాందోళనలు ఎక్కడా చర్చకు రాకూడదన్న ప్రభుత్వదురుద్దేశంలోనుంచి పుట్టుకొచ్చిందే నారాయణ అరెస్ట్. నారాయణను కొండాపూర్ లో అక్రమంగా అరెస్ట్ చేసి, చిత్తూరు తరలించడం చాలా దారుణం. నారాయణ విద్యాసంస్థలు ఏర్పాటుచేసి, లక్షల మందికి విద్యాబుద్ధులు నేర్పుతున్న నారాయ ణను అరెస్ట్ చేసిన ఏపీ ప్రభుత్వం, లక్షలాది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం తప్ప. నారాయణను పరీక్ష పేపర్ లీకేజ్ ఘటనపైనే అరెస్ట్ చేసి ఉంటే, ఎక్కడా ప్రశ్నపత్రాలు లీక్ కాలేదన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్య నారాయణవ్యాఖ్యలకు విలువలేదనే చెప్పాలి.
చివరకు సాధించేదేమీ ఉండదు. నారాయణ అరెస్ట్ ద్వారా ఈ ప్రభుత్వం పోలీసులను కూడా ఇబ్బందిపెట్టి, మరోసారి కోర్టులతో చీవాట్లు తినిపించే పరిస్థితి కల్పించింది. రాత్రికిరాత్రి ప్లాన్ చేసిన ఏపీ ప్రభుత్వం తనరాష్ట్రపోలీసులను తెలంగాణకు పంపింది. నారాయణ అరెస్ట్ జగన్ రెడ్డి ఒకసామాజికవర్గంపై కక్షతో చేస్తున్న దాడి అనేచెప్పాలి. రాయలసీమ, నెల్లూరులో ప్రధానంగా ఉన్న ఒక సామాజిక వర్గం ఎదుగుదలను, వారి రాజకీయ భవిష్యత్ ను అడ్డుకోవాలన్న దురాలోచనతో జగన్ రెడ్డి, నారాయణను అరెస్ట్ చేయించాడనే భావించాలి.
అదేవిధంగా పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీరుకి నొచ్చుకున్న జగన్ రెడ్డి, ఆయనపై తన పార్టీ వారితో వ్యక్తిగత ఆరోపణలు చేయిస్తున్నాడు. పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయించడం కూడా జగన్ రెడ్డి ఆయన సామాజికవర్గా న్ని లక్ష్యంగాచేసుకోవడంలో భాగమేనని భావించాలి.
నిజంగా పదోతరగతి పరీక్ష పత్రాలు లీక్ అయ్యాయో లేదో తేల్చుకోని ప్రభుత్వం, నారాయణను ఆ కారణంతో అరెస్ట్ చేసినా, హైదరాబాద్ నుంచి చిత్తూరు వరకు తీసుకురాగలదు తప్ప, ఏమీ చేయలేదని స్పష్టం చేస్తున్నాం. అందుకుప్రధాన కారణం నారాయణ కి సంబంధించి నమోదుచేసిన ఎఫ్ఐఆర్ కూడా ఒక ప్రధాన నిదర్శనం. నారాయణ చేసిన తప్పులేమీ లేకపో యినాకూడా జగన్ రెడ్డి, రాజకీయంగా కావాలనే ఆయనపై కక్షసాధింపు కి పాల్పడుతున్నారు.
గతంలో రాజధాని భూముల్లో ల్యాండ్ పూలింగ్ అని, మరోటని నారాయణను అరెస్ట్ చేసిన జగన్ ప్రభుత్వం చివరకు ఏమీసాధించలేక చేతులెత్తేసింది. ఇప్పుడు అదేకోవలో పేపర్ లీకేజ్ అంశాన్ని ఆయుధంగా వాడుకుంటూ, నారాయణను అరెస్ట్ చేశారు.
జగన్ రెడ్డి ఇదేవిధమైన వైఖరి కొనసాగిస్తే, భవిష్యత్ లో ఆయన తగినమూల్యం చెల్లించుకోవడం ఖాయం. నారాయణ అరెస్ట్ తో ఆయన సామాజికవర్గంపై కక్షసాధింపు కి పాల్పడాలన్న జగన్ రెడ్డి ఆశ ఎప్పటికీ నెరవేరదు. నారాయణ అరెస్ట్ ను తెలుగుదేశంపార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. నారాయణ అరెస్ట్ లాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా ఇకనుం చైనా ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలని సూచిస్తున్నాం.