Suryaa.co.in

Andhra Pradesh

సాగునీటి కల్పన కోసం సీరియస్‌గా పనిచేయండి

– గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ్ రాజు

రబీ సాగుకు పూర్తి స్థాయిలో సాగునీటి వనరుల కల్పించేందుకు ఇరిగేషన్ అధికారులు నిబద్ధతతో పనిచేయాల్సి ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ్ రాజు స్పష్టం చేశారు.సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని గౌతమి సమావేశ మందిరంలో కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యవసాయ సలహా మండలి సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ్ రాజు మాట్లాడుతూ, రైతులకు అన్ని రకాలుగా అండగా ఉండాలనే సంకల్పం ఉండాలన్నారు. సాగునీటి వనరుల సక్రమంగా వినియోగించే దిశలో రైతులతో కలసి సమన్వయం చేసుకోవాల్సి వుందన్నారు. డ్రైయిన్స్, కాలువల్లో పూడికతీత పనుల్లో వేసవి కాలం నాటి కి పూర్తి చెయ్యాల్సి ఉన్నా, ఆ విధానం అమలుకు సరైన ప్రణాళికలు అమలు చేయలేక పోతున్నట్లు శ్రీరంగనాధ్ పేర్కొన్నారు.

ముఖ్యంగా లాకుల సక్రమంగా నిర్వహణ చేయకపోవడంతో సాగునీరు వృధా అవుతోందన్నారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో సాగునీటి ని సక్రమంగా అందించే విధానం కోసం రూ.10 కోట్లు నిధులు విడుదల చేసి ఉన్నందున వాటిని పూర్తిగా ఖర్చు చెయ్యాల్సి ఉందన్నారు. లాకుల సక్రమంగా నిర్వహణ చెయ్యాలని, అవి రైతులకు దేవాలయం లాంటిదన్నారు. కొందరు కాంట్రాక్టర్లు సక్రమంగా పనులు చెయ్యక పోవడం, అధికారులు పర్యవీక్షణ కొరవరడం కారణం అని ఆయన తెలిపారు. 95 శాతం మంది కౌలు రైతులు సాగు చేస్తున్నారని తెలిపారు. అర్భికే ల పరిధిలో పండించే ప్రతి బస్తా పంట వివరాలు సంబంధించిన ఆయా ఆర్భికెలు లో వాటి వివరాలు నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వానికి లేదా ప్రవేటు వారికి అమ్మినా వాటి గురించి వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఆస్కారం వుంటుంది అని తెలిపారు.

రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని తరహాలో ప్రతి బస్తాకి పెట్టుబడి, ఇతర ఖర్చులు కోసం నేరుగా రైతులకు రూ.25 అదనంగా చెల్లించడం కోసం కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో నిధులు మంజూరు కావడం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఖరీఫ్ సమయంలో పంట కొనుగోలు, చెల్లింపు విషయం పై అధికారులతో సమీక్షించారు. కొనుగోలు చేసిన ధాన్యం కి చెల్లింపు త్వరితగతిన రైతుల ఖాతాలకు జమచేయాలని మంత్రి స్పష్టం చేశారు. వరితో పాటుగా అనువైన భూముల లో వేరుశెనగ, అపరాలు, కూరగాయలు సాగు విస్తీర్ణం పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ, రబీ సాగుకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిరంతరం పర్యావరణ చెయ్యడం జరుగుతోందని పేర్కొన్నారు. సభ్యులు సలహాలు సూచనలు తీసుకుని ఎప్పటికప్పుడు మెరుగైన ఫలితాలు దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 3,69,000 ఎకరాలలో రబీ సాగు లక్ష్యం కాగా , ఇప్పటికే జనవరి 22 నాటికి 3,46,225 ఎకరాల్లో నాట్లు పూర్తి చేసారని, ఇంకా 22,775 ఎకరాల విస్తీర్ణంలో నాట్లు పూర్తి చేసుకున్న స్థాయి కి క్షేత్రస్థాయిలో అధికారులు చర్యలు చేపట్టారన్నారు.

ఇంకా ఈరోజు నాటికి కేవలం 3 శాతం లో నాట్లు పూర్తి చెయ్యాల్సి ఉందన్నారు. సాగునీటి వనరుల సమృద్ధిగా ఉన్నాయని, ఒక్క చుక్క నీరు కూడా వృధాగా సముద్రంలో కి వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశామన్నారు. 38,826 ఎకరాల ఆయకట్టు కు ప్రయోజనం చేకూర్చడం కోసం రూ.211.83 కోట్ల 28 ప్రతిపాదిత 135 క్రాస్ బండ్స్ పనులు చేపట్టడం జరగనుందన్నారు. వీటిలో ప్రస్తుతం 9 ప్రతిపాదిత పనుల్లో 49 క్రాస్ బండ్స్ ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయని, మిగిలిన పను లను నామినేటెడ్ పద్దతిలో చేపట్టడం పై సమావేశంలో చర్చించి, ఆదేశించడం జరిగిందన్నారు.

నాలుగు సబ్ డివిజన్ పరిధిలోని చేపడుతున్న పనులు వివరాలు అధికారులు వివరించారు. అదేవిధంగా ధాన్యం సేకరణ, చెల్లింపు వివరాలు, డ్రైయిన్స్ మరమ్మత్తు లు తదితర అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ద్వారా మంత్రి కి వివరించారు.జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ సుబ్బారావు, ఇతర సభ్యులు సర్ ప్లస్ వాటర్, యూరియా, ప్యాక్ కేంద్రాలు, లాకులు , డ్రైయిన్స్ లలో పూడికతీత, తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.

ఈ సమావేశంలో ఉంగుటూరు శాసన సభ్యులు పి.శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ సుబ్బారావు,జాయింట్ కలెక్టర్ డా.బీఆర్ అంబేద్కర్, సభ్యులు పి. తాతారావు, ఎమ్మార్ కెపీఆర్ బాబ్జి, పీడీ ప్రసాదరాజు, యూ. విజయరామరాజు, కె.కుటుంబ రావు, వడ్డే లక్ష్మీ,.తదితరులు, జెడి (అగ్రి) జగ్గారావు, ఎస్సి (ఇర్రి గేషన్) శ్రీరామకృష్ణ, ఇరిగేషన్ డ్రైయిన్స్, మార్కెటింగ్, మత్స్య శాఖ, విద్యుత్తు, నాబార్డు, బ్యాంక్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE