Suryaa.co.in

Andhra Pradesh

నవరత్నాల అమలుతో మహిళా పక్షపాతిగా ముఖ్యమంత్రి

– అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అసమానతలు తొలగడానికి నవరత్నాల అమలు : టూరిజం మంత్రి ఆర్.కె రోజా

తిరుపతి : నవరత్నాల అమలుతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మహిళా పక్షపాతిగా నిలిచారని డిప్యూటీ సి ఎం కె. నారాయణ స్వామి అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఎస్.సి, ఎస్.టి, బి.సి మైనారిటీ, మహిళల ఆర్ధిక అసమానతలు తొలగించేలా మన ముఖ్యమంత్రి జగనన్న నవరత్నాలను అమలు చేసి ఆదుకుంటున్నారని టూరిజం మరియు క్రీడల శాఖామాత్యులు ఆర్.కె రోజా అన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్ సున్నా వడ్డీ మూడవ విడత స్వయం సహాయ సంఘాల మహిళల ఖాతాలకు జమ చేసే కార్యక్రమాన్ని ఒంగోలు నుండి ప్రారంభించగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి వర్చువల్ విధానంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు డిప్యూటీ సి ఎం, టూరిజం శాఖ మంత్రి, తిరుపతి ఎం పి గురుమూర్తి, శాసన సభ్యులు తిరుపతి భూమన కరుణాకర రెడ్డి, గూడూరు వరప్రసాద్, నగర మేయర్ శిరీష, ఉప మేయర్ ముద్ర నారాయణ, జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణా రెడ్డి, నగరపాలక సంస్థ కమీషనర్ అనుపమ అంజలి, డి ఆర్ ఓ ఎన్. శ్రీనివాస రావు, అధికారులు, ఎస్.హెచ్.జి సంఘాల ప్రతినిధులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

డిప్యూటీ సిఎం నారాయణ స్వామి మాట్లాడుతూ నవరత్నాలు పథకాలను పేదల పక్షపాతిగా మహిళలకే అందిస్తున్నారని ఆర్ధిక ఎదుగుదలకు తోడ్పడుతున్నారని అన్నారు. నేడు మూడవ విడత సున్నా వడ్డీ మహిళల ఖాతాలకు జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. స్వయం సహాయక సంఘాల మనుగడకు పెట్టుబడి ప్రధానం అని అందుకే జగనన్న ఋణం తీసుకున్న మొత్తానికి చెల్లించాల్సిన వడ్డీని ప్రతి సంవత్సరం చెల్లిస్తున్నారని అన్నారు.

రాష్ట్ర టూరిజం, క్రీడలు, సాంస్కృతిక వ్యవహారాలు, యువజన సర్వీసుల శాఖామంత్రి ఆర్ కె రోజా మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఆర్ధిక సమానత్వం కోసం ఆడపిల్లల తండ్రిగా జగనన్న మహిళా సాధికారత దిశగా పథకాలు, చట్టాలు, యాప్ లు మహిళలకు అందిస్తున్నారని అన్నారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి పావలా వడ్డీ అమలు చేస్తే నేడు జగనన్న సున్నా వడ్డీ అమలు చేసి రూ. 3615 కోట్లు మూడు విడతల్లో మహిళల ఖాతాలకు జమ చేసారని అన్నారు.

ముఖ్యమంత్రి ప్రతి కుటుంబానికి అన్నగా, తమ్ముడిగా రాష్ట్రం ఆర్ధిక పరిస్థితి కష్టాల్లో ఉన్నా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తున్నారని ప్రతిపక్షాలు జగనన్న అభిమానాన్ని చూసి తట్టుకోలేక ఎదో ఒకటి అంటున్నారని అన్నారు. గతంలో ముఖ్యమంత్రి మహిళలకు ఇస్తానన్న పథకాలు ఇవ్వకపోగా వాటి బకాయిలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత చెల్లించి మహిళల జీవితాలలో వెలుగు నింపారని అన్నారు. మూడు సంవత్సరాల కాలంలో 43 లక్షల మంది పేదలకు పించన్లు, 31 లక్షల మంది మహిళలకు ఇంటి పట్టాలు, 12 లక్షల మందికి వసతి దీవెన, 45-60 సం. ల వయసు గల 23 లక్షల మంది మహిళలకు వై.ఎస్.ఆర్ చేయూత, ఇలా ఎన్నో అమలు చేసి దేశంలో ఏ రాష్ట్రం లో కూడా అమలు చేయని పథకాలను మన రాష్ట్రం లో అమలు చేస్తున్నారని అన్నారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో మొత్తం 41,828 స్వయం సహాయక సంఘాలకు రూ.70.78 కోట్లు వై.యస్.ఆర్. “సున్నా వడ్డీ” లబ్ది పొందారని వివరించారు. సున్నా వడ్డీ చెక్కులను గ్రామీణ ఎస్.హెచ్.జి లకు రూ.56.13 కోట్లు, పట్టణ మెప్మా ఎస్ హెచ్ జి లకు రూ. 14.72 కోట్లు చెక్కులను లబ్దిదారులకు ఈ సమావేశం లో అందించారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఏ ఇంచార్జ్ పట్టాభి రెడ్డి, డి పి ఎం మాధవి, ఏ సి దినేష్ రెడ్డి, జిల్లా లోని 34 మండలాలకు సంబంధించిన మండల కో ఆర్డినేటర్లు, ఏ పి ఎం లు, ఎస్ హెచ్ జి లు, మెప్మా, సి ఓ లు, ఆర్ పి ఎస్ లు లబ్దిదారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE