Suryaa.co.in

Andhra Pradesh

మాట తప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

-ఏ పార్టీకి సపోర్ట్ చేయాలో నిర్ణయించుకుని ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తాం
– ఆంధ్రప్రదేశ్ రజక సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు పాతపాటి అంజి బాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రజకులకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామని పాదయాత్రలో వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పిన ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలుగా రజకులకు ఎటువంటి పార్టీ పదవి గాని రాజకీయ ప్రాధాన్యత గాని నామినేటెడ్ పదవుల్లో గాని అవకాశం కల్పించకుండా రజక జాతిని అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రజక కులానికి సంబంధించి ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయని ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు.

బీసీలకు 86% ఇచ్చామని చెప్పుకుంటున్నటువంటి వైయస్సార్ సిపి బీసీలలో ఓటు బ్యాంకులో రెండో స్థానంలో ఉన్న రజక కులానికి అన్యాయం చేయడం భావ్యమేనా? అదే విధంగా తెలుగుదేశం పార్టీ గతంలో ఎమ్మెల్సీ సీటు 1 దువ్వారపు రామారావు గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా పార్టీ పదవుల్లో కొన్ని వందల మందికి అవకాశం కల్పించడం జరిగింది. వైసీపీ పార్టీలో ఉన్న మేము కూడా ప్రజల ముందు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నాం. కాబట్టి వైసిపి రజక కార్యకర్తలు మరియు రజక అన్నదమ్ములు అందరం కూడా త్వరలో ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఏ నిర్ణయం తీసుకోవాలో ఏ పార్టీకి సపోర్ట్ చేయాలో నిర్ణయించుకుని ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తాం ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం రాజకీయంగా ఆర్థికంగా అణగదొక్కిన ఏ పార్టీ అయినా గద్దించటం లో వెనకడుగు వేయబోమని కుల అభివృద్ధి కోసం పార్టీలు పక్కనపెట్టి అందరం కూడా ఐక్యంగా పనిచేసే మాకు అన్యాయం చేసిన ఏ పార్టీకైనా బుద్ధి చెప్పి తీరే విధంగా కార్యచరణ రూపొందించుకొని త్వరలోనే గ్రామాల్లో ఉన్న రజకులందరు కూడా చైతన్యవంతం చేసి ఒక భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేసి మా ఓటు బ్యాంక్ ఆవశ్యకతను పార్టీలకు తెలియజేస్తాం

LEAVE A RESPONSE