– ప్రతిపక్షనేతను అడుగడుగునా అడ్డుకోమని పోలీసులకు ఏ చట్టం చెప్పింది?
• రాష్ట్రంలో వారు వ్యవహరిస్తున్న తీరుచూశాక, వారి విధులు, బాధ్యతలు, చట్టాల అమలు, ఏపీ పోలీస్ మాన్యువల్, సీ.ఆర్.పీ.సీ, ఇండియన్ పీనల్ కోడ్ వంటి వాటిగురించి మరలా ‘రీఓరియంటేషన్’ క్లాసులు పెట్టి, వారి విధులు, బాధ్యతలు మరోసారి గుర్తుచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
• స్కాట్లాండ్ యార్డ్ పోలీసుల ప్రశంసలు అందుకున్న ఏపీ పోలీస్ వ్యవస్థ ఈనాడు రీఓరియంటేషన్ క్లాసులు పెట్టించుకునే దుస్థితికి రావడానికి ముఖ్యమంత్రి జగనే కారణం.
• రాష్ట్ర పోలీస్ వ్యవస్థ రెండుగా చీలిపోయింది. ఒకటి అధికారపార్టీకి తొత్తుగా వ్యవహరించేది. రెండోది చట్టబద్ధంగా నడుచుకునేది.
• డీజీపీని న్యాయస్థానంలో నించోబెట్టి, న్యాయమూర్తులు ఆయనతో 151 సీ.ఆర్.పీ.సీ సెక్షన్లు చదివించినా పోలీసులు మారరా?
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
“రాష్ట్ర పోలీస్ వ్యవస్థ రెండుగా చీలిపోయిందని, ఒక వ్యవస్థ అధికారపార్టీకి తొత్తుగా వ్యవహరిస్తుంటే, మరోటి చట్టవిరుద్ధంగా పనిచేయడానికి ప్రయత్నిస్తోందని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిత్వంలో కొందరు పోలీస్ అధికారుల వ్యవహారశైలి అభ్యంతరకరంగా, చట్టానికి వ్యతిరేకంగా ఉందని, నాలుగేళ్ల జగన్ పాలనని బేరీజువేస్తే, పోలీస్ వ్యవస్థలో 50శాతంపైగా అధికారులకు ‘రీఓరియంటేషన్’ క్లాసులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య అభిప్రాయపడ్డారు.
చంద్రబాబుని అడుగడుగునా అడ్డుకోమని, వైసీపీవారిని యథేచ్ఛగా వదిలేయమని పోలీసులకు ఏ చట్టంచెప్పింది?
పోలీసులకు వారి విధులు, బాధ్యతలు, చట్టాలఅమలు, ఏపీ పోలీస్ మాన్యువల్, సీ.ఆర్.పీ. సీ, ఇండియన్ పీనల్ కోడ్ వంటి వాటిగురించి మరలా రీ ‘ఓరియంటేషన్’ క్లాసులు పెట్టాల న్న అభిప్రాయం ప్రజల్లోకూడా బలంగాఉంది. రీ ఓరియంటేషన్ పెట్టకపోతే భవిష్యత్ లో ఇప్పటి పోలీస్ అధికారుల తీరు నిజమేనని అనుకునే ప్రమాదం ఉంది. కొందరు పోలీస్ అధికారుల తీరుచూసి, తోటిసహచరులు కూడా వారి ఓవరాక్షన్ చూసి బాధపడుతూ, విస్తు పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలో, చంద్రబాబు ప్రతిపక్షనేత హోదాలో, పల్నాడులో అధికారపార్టీ ఆగడాలకు బలైన దళితులకు ధైర్యం చెప్పడానికి ఆత్మకూరుకు బయలుదేరితే, ఆయన్ని ఇంటినుంచి బయటకు రాకుండా, పోలీసులే ఇంటిగేట్లకు తాళ్లు కట్టారు. చంద్రబాబు ఇంటిగేట్లకు తాళ్లు కట్టమని పోలీసులకు ఏ పోలీస్ చట్టం చెప్పింది? తరువాత రాజధాని పర్యటనకు వెళ్లిన చంద్రబాబు బస్సుపై రాళ్లు, చెప్పు లు, కొందరు పోలీసులు వారికర్రలుకూడా విసిరారు. ఆ ఘటనపై నాటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ, “ఆర్టికల్19 ప్రజలకు ఇచ్చిన స్వేచ్చ ఫ్రకారమే వారు అలాచేశారు, అలాచేయడం సబబే” అన్నారు. అదే డీజీపీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చేతులుకట్టుకొని నిలబడి, న్యాయమూర్తులఎదుట 151 సీ.ఆర్.పీ.సీ ఏంచెప్పిందో చదివారు. ఆయనస్థానంలో మరొకరు ఉంటే, డీజీపీ పదవికి రాజీనామాచేసేవారు. 151 సీ.ఆర్.పీ.సీ డీజీపీకి తెలియదా? అలాచేయడం ద్వారా డీజీపీకి, పోలీస్ సిబ్బందికి ‘రీఓరియంటేషన్’ అవసరమని నాడు హైకోర్ట్ న్యాయమూర్తులు చెప్పకనేచెప్పారు. చంద్రబా బు తరువాత విశాఖపట్నం పర్యటనకువెళ్తే, ఆయన్ని పోలీసులు విమానాశ్రయంలోనే ఆపేశారు. వైసీపీవారిని మాత్రం యథేచ్ఛగా రోడ్లపైకి వదిలేశారు. వైసీపీవారు రోడ్లపైకి వచ్చారని, శాంతిభద్రతలసమస్యలు తలెత్తుతాయని పోలీసులు చంద్రబాబుని అడ్డుకొని తిరిగి హైదరాబాద్ కు పంపించారు. మరోసందర్భంలో మంత్రి పెద్డిరెడ్డి రామచంద్రారెడ్డి తననియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల్లో చేసిన దారుణాలపై ప్రశ్నించడానికి వెళ్లిన ప్రతిపక్షనేత చంద్రబాబుని అడ్డుకొని నేలపై కూర్చోబెట్టారు. ప్రతిపక్ష నేత అసలు బయటకు రాకూడదనే చట్టంఉందా?
చంద్రబాబు సభల వేడితగిలే, జగన్మోహన్ రెడ్డి అనపర్తిలో ప్రధానప్రతిపక్షనేతను అడ్డుకో మని పోలీసుల్ని ఆదేశించారు. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినవ్యక్తిని, 7కిలోమీటర్లు చిమ్మచీకట్లో నడిపించిన పోలీసులకు రీ ఓరియంటేషన్ అవసరమా..కాదా? మొన్న అనపర్తిలో పోలీసులే చంద్రబాబు బహిరగంసభకు ముందు అనుమతిచ్చారు. పెద్దాపురంలో ఎలాంటి చిన్నఅపశ్రుతి లేకుండా చంద్రబాబుసభ జరిగింది. అదేవ్యక్తి, అవేవాహనాలు, అదేసిబ్బందితో అనపర్తి బయలుదేరితో అనుమతిచ్చిన పోలీసులే ఎందుకు అడ్డుకున్నారు? పెద్దాపురంలో లేని శాంతిభద్రతల సమస్య, అనపర్తిలోనే ఎందుకొచ్చింది? పెద్దాపురంసభతో ముఖ్యమంత్రి కార్యాలయానికి చంద్రబాబు వేడితగలడమే అనపర్తిలో ఆయనసభను పోలీసులు అడ్డుకోవడానికి కారణం. చంద్రబాబుని అడ్డుకోవడానికి పోలీసులే రోడ్డుపై కూర్చోమని ఏచట్టం చెప్పింది డీజీపీ గారు?
పోలీసులే ప్రతిపక్షనేత కాన్వా య్ కి అడ్డంగా కూర్చోవడం ఎక్కడైనా గతంలోచూశామా? అనపర్తి సభలో 1000మందిపై కేసులు పెడతారా? చంద్రబాబు మీటింగ్ వచ్చే లక్షలమందిపై కూడా కేసులుపెడతారా? జడ్ ప్లస్ కేటగిరి భద్రతలో ఉన్నవ్యక్తి చిమ్మచీకట్లో 7కిలోమీటర్లు నడిచి వెళ్లడానికి కారణం ఈ ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థకాదా? అలాచేసిన మీరు పోలీస్ అధికారులేనా అన్న అనుమానం కలగబట్టే, వారికి ‘రీఓరియంటేషన్’ క్లాసులు పెట్టాలంటున్నాం. 14ఏళ్లు రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా పనిచేసిన వ్యక్తిని అర్థరాత్రి అడ్డుకొని, ఆయన ఏదో వెహికల్ ఎక్కి మాట్లాడితే, అప్పుడు కూడా మైక్ లాక్కోవాలని ప్రయత్నించి, ఆ వాహనం సీజ్ చేస్తారా? అన్ని చేసిన పోలీసులకు ‘రీ ఓరియంటేషన్’ క్లాసులు అవసరమా..కాదా? సంవత్సరకాలంగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రతిపక్షానికి ఒక్కరోజు కూడా అపాయింట్ మెంట్ ఎందుకివ్వలేదు? ఎవరి ఆదేశాలతో డీజీపీ రూల్ ఆఫ్ లాకు విరుద్ధంగా పనిచేస్తున్నారు?
డీజీపీస్థానంలో ఉండి రాజేంద్రనాథ్ రెడ్డి ఎందుకు సజ్జల ఆదేశాలను అమలుచేయమని చెప్పలేకపోతున్నారు? రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీఅయ్యాక ఎప్పుడూ టీడీపీవారి మొరవిన్నది లేదు. ప్రతిపక్షం ఇచ్చే వినతిపత్రాలు ఆయన స్వయంగా తీసుకున్నది లేదు.ప్రతిపక్షాల విజ్ఞప్తులు, వినతులు, వారి బాధలు మీరు పట్టించుకోరా.. డీజీపీగారు? మీతీరు చూశాక, మీకింద ఉండే అధికారుల వ్యవహారశైలి చూశాక మీకు ‘రీఓరియంటేషన్’ క్లాసులు, సైకలాజికల్ క్లాసులు పెట్టాలా వద్దా? స్కాట్లాండ్ యార్డ్ పోలీసుల ప్రశంసలు అందుకున్న ఏపీ పోలీస్ వ్యవస్థ, నేడు రీ ఓరియంటేషన్ క్లాసులు పెట్టాలనే పరిస్థితి రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి స్వార్థపూరిత నిర్ణయాలుకావా?
రాష్ట్ర పోలీస్ శాఖ చట్టబద్ధంగా పనిచేస్తోం దా? టీడీపీ కార్యాలయంపై దాడిచేస్తే, విచారించని పోలీస్ అధికారులకు ‘రీఓరియంటేషన్’ క్లాసులు అవసరమా..కాదా? డీజీపీని న్యాయస్థానంలో నించోబెట్టి, 151 సీ.ఆర్.పీ.సీ సెక్షన్లు చదివించినా పోలీసులు మారరా జడ్జీలను తిట్టినవారిని కూడా అరెస్ట్ చేయలేని వీక్ పోలీసింగ్ మనది. ఎంపీఅని చూడకుండా రఘురామరాజుని దారుణంగా చితక్కొట్టారు. అదే నా రాష్ట్ర పోలీసింగ్ ? 60ఏళ్లు నిండిన రంగనాయకమ్మను అకారణంగా అరెస్ట్ చేయడమేనా మన పోలీసింగ్? రూల్ ఆఫ్ లా ప్రకారం పనిచేసేలా పోలీస్ అధికారుల్ని తయారు చేయక పోతే రాష్ట్రానికే పెనుప్రమాదం. ముఖ్యమంత్రి చాలా చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నారు. తనపై ఉన్న అవినీతికేసులు, బాబాయ్ హత్యకేసువిచారణతో ఆయన దినదినం భయంభయంగానే బతుకుతున్నారు. చట్టప్రకారం.. న్యాయప్రకారం, రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేస్తేనే ముఖ్య మంత్రి అయినా, పోలీస్ అధికారులు అయినా సంతోషంగా, మానసికప్రశాంతతో ఉంటారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ అభాసుపాలు, అపహాస్యంపాలు కాకుండా ఉండాలంటే కొందరు పోలీస్ అధికారులకు ‘రీఓరియంటేషన్’ క్లాసులు తప్పనిసరి” అని రామయ్య స్పష్టంచేశారు.