Suryaa.co.in

Andhra Pradesh

పీఆర్సీపై ముఖ్యమంత్రి ప్రకటన

-పోలీసు అధికారుల సంఘం హర్షం
కోవిడ్ మహమ్మారిని పారద్రోలే క్రమంలో పోలీసు శాఖకు బాసటగా నిలిచిన ముఖ్యమంత్రి మరియు డీజీపీలకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం తీర్మానం.
ముఖ్యమంత్రి చొరవతో పోలీసు శాఖకు ఎన్నడూ లేని విధంగా వీక్లీ ఆఫ్ మంజూరు చేసినందుకు కలకాలం రుణపడి ఉంటాం. మిగతా అన్ని సమస్యలపై చొరవ చూపి, ముఖ్యంగా పోలీసు శాఖలో ఖాళీల భర్తీకి వారు చర్యలు తీసుకొంటారని పూర్తి నమ్మకం.
పీఆర్సీ పై ముఖ్యమంత్రి ప్రకటనను స్వాగతిస్తూ, ధన్యవాదాలు తెలియచేసిన పోలీసు అధికారుల సంఘం. ఆంధ్రప్రదేశ్ లోని యావత్ పోలీసు సిబ్బంది, అన్ని నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం.

LEAVE A RESPONSE