Suryaa.co.in

Andhra Pradesh

స్కూల్ సిబ్బందికి అయోధ్య నుంచి వచ్చిన పూజా అక్షింతలు పంపిణీ చేస్తున్న చిన్నారులు

– నాడు పాకెట్ మనీ తో రామాలయం నిర్మాణానికి విరాళం …. నేడు అయోధ్య పూజా అక్షింతలు పంపిణీ

నేడు దేశవ్యాప్తంగా రామాలయం ప్రారంభం గురించి స్మరిస్తూ అయోధ్య నుంచి వచ్చిన పూజా అక్షింతలు ప్రజలకు పంపిణీ చేయడం లో హిందూ భంధువులందరూ నిమగ్నమయ్యారు. పలు ప్రాంతాల్లో చిన్నారులు కూడా తమ భాధ్యత గా భావించి భక్తి తో పూజా అక్షింతలు పంపిణీ చేస్తున్నారు. ఇదే కోవలో ఈ చిన్నారులు కూడా వున్నారు. ఎప్పడు కొత్త కొత్త ఆలోచనలతో తమ పాకెట్ మనీ తో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న స్వతంత్ర సమరయోధుల కుటుంబం కి చెందిన చిన్నారులు పుట్టా లిఖిత, పుట్టా కేదార్ రామ్.

వెంకటగిరి, శ్రీకృష్ణ నగర్ సి బ్లాక్ శ్రీ సాయిరాం స్కూల్ లో చదువుతున్న ఈ చిన్నారులు అయోధ్య నుంచి వచ్చిన పూజా అక్షింతలు తాము చదువుతున్న స్కూల్ ఉపాధ్యాయులకు, సిబ్బంది కి, ఆయా లకు పంపిణి చేశారు. కొన్ని రోజులుగా అక్షింతలు కోసం ఎదురుచూస్తున్న సిబ్బందికు పుట్టా లిఖిత, పుట్టా కేదార్ రామ్ అయోధ్య నుంచి వచ్చిన పూజా అక్షింతలు, ఫోటోస్, కరపత్రం పంపిణీ చేశారు. ఈ చిన్నారులు గతం లో రామాలయం నిర్మాణానికి పాకెట్ మనీ తో విరాళం అందించి రాష్ట్ర గవర్నర్ తమిళసై తో పాటు కేటిఆర్ మొదలగు పలువురి అభినందనలు పొందిన సంగతి తెల్సిందే. ప్రముఖ సామాజిక కార్య కర్త, రక్తదాత పుట్టా రామకృష్ణ కుమార్తె, కుమారుడు ఈ చిన్నారులు.

– పుత్తా రామకృష్ణ

LEAVE A RESPONSE