Suryaa.co.in

Telangana

చిల్డ్రన్ మాక్ అసెంబ్లీ స్ఫూర్తిదాయకం

– ఎమ్మెల్యేగా పోటీ చేసే వయసు 21 ఏళ్లకు కుదించాలని చిల్డ్రన్ మోక్ అసెంబ్లీ తీర్మానం
– చిల్డ్రన్ మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : ఇలాంటి సమావేశాలు సమాజానికి చాలా అవసరం. శాసన సభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు, సమాధానాలు… ఇతర అంశాలను విద్యార్థులు గమనించాలి. విపక్షాలు ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని నిలదీయడం వారి బాధ్యత. లీడర్ ఆఫ్ ది హౌస్, లీడర్ ఆఫ్ ది అపొజిషన్ ఇద్దరికీ సమాన అవకాశాలు ఉంటాయి. సభను సమర్ధవంతంగా నడిపే బాధ్యత స్పీకర్ పై ఉంటుంది.

విపక్షాలు ఆందోళన చేసినా ప్రభుత్వం సమన్వయంతో సభను నడిపించేలా చూడాలి. కానీ దురదృష్టవశాత్తు ఈరోజుల్లో కొందరు సభను ఎలా వాయిదా వేయాలా అనే విధంగా చేస్తున్నారు. చిల్డ్రన్ మాక్ అసెంబ్లీని స్ఫూర్తిదాయకంగా నిర్వహించిన మీ అందరినీ అభినందిస్తున్నా.

జవహర్ లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. వారి వల్లే మనకు సమాజంలో ఇవాళ అవకాశాలు వచ్చాయి. దేశంలో నిర్బంధ విద్య అమలు చేసేందుకు సోనియా గాంధీ, మన్మోహన్ ఎంతో సింగ్ కృషి చేశారు. 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కును అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీ ది. ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసేందుకు 25 ఏళ్ల వయసు నిబంధన ఉంది. 21 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తే యువత రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. చిల్డ్రన్ మాక్ అసెంబ్లీలో ఇలాంటి బిల్స్ ను పాస్ చేయడం అభినందనీయం.

LEAVE A RESPONSE