ఒమిక్రాన్ పుణ్యమాని ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ఉధృతి తగ్గి ఇక జనజీవనం యధాపూర్వ స్థితికి వచ్చేస్తున్న దశలో..
చైనా మిన్నకుండిపోతుందా?
తాను సృష్టించిన విధ్వంసం ఇంత త్వరగా రెండేళ్లలోనే చరమదశకు చేరితే చైనాకి నచ్చుతుందా..జిన్ పింగ్ కి ఒప్పుతుందా..!?
అందుకే..అందుకే..ప్రపంచం మీద సంధించేందుకు మరో కొత్త అస్త్రాన్ని సందించినట్టు ఉంది.ఇది నిజం కాకపోవచ్చునేమో గాని గత అనుభవాన్ని..ముఖ్యంగా 2019 నాటి భీకర పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ఊహాగానం చేయవలసి వస్తోంది.కరోనా మహమ్మారిని చైనా దేశమే ప్రపంచం మీదకి వదిలిందన్నది మానవాళి చిరకాలం నమ్మే విషయం.స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ
ప్రపంచం ఈ విషయంలో చైనా వైపు వేళ్ళు చూపిస్తూనే ఉంటుంది..ప్రపంచ ఆరోగ్య సంస్ధను కూడా నమ్మనంత బలంగా..!
ఇక్కడ మరో విషయం..చైనా మరో కొత్త రకాన్ని సృష్టించి ఉంటే ఆ దేశ ప్రజలు ఎందుకు మొదటగా బలి పశువులు అవుతున్నారని అనుకోవచ్చు.తనపై అనుమానం రాకుండా ముందుగా తన దేశం మీదనే వదిలి అప్పుడు మిగతా ప్రపంచం మీద వదలడం చైనా 2019లో అమలు చేసిన తంత్రమే.ఇప్పుడూ అదే ప్లాన్..అందుకే ప్రస్తుతం కొత్త వేరియంట్ తో చైనా మాత్రమే అల్లాడుతోంది. మిగిలిన ప్రపంచం కోవిడ్ కబంధహస్తాల నుంచి బయటపడుతూ స్వాంతన చెందుతుంటే అటు చైనాలో మళ్లీ బీభత్సానికి బీజాలు పడ్డాయి.
ఇది ప్రపంచానికి డ్రాగన్ ఇస్తున్న సంకేతమా.. హెచ్చరికా..!?
చైనా ఇక ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉండనివ్వదా..
ప్రపంచ ఆరోగ్య సంస్థ కాని..అమెరికా గాని ఇప్పటికీ
చైనా స్వభావంపై అవసరమైన స్ధాయిలో తీవ్రత చూపకపోవడం వల్ల మానవాళి కోలుకొలేనంత మూల్యం చెల్లించుకుంటోందా!
ఇప్పుడిక ప్రపంచ దేశాల ముందున్న తక్షణ కర్తవ్యం..ఇప్పటికైనా చైనా ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు సమిష్టిగా అడుగులు వేయడం..మొత్తం కరోనా ఎపిసోడ్ పై అతి లోతైన అధ్యయనం సాగించడం.. చైనాను ఒంటరి చేసే దిశగా చర్యలు తీసుకోవడం..వీటన్నిటి కంటే ముందుగా చైనా నుంచి బాహ్య ప్రపంచానికి ఏ మార్గంలోనైనా గాని వస్తువులు..మనుషుల రాకపోకలు నిలుపు చేయడం..ఇవన్నీ యుద్ధప్రాతిపదికన చెయ్యకపోతే ప్రపంచం మరోసారి భయంకర అనుభవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది..
– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286