ఆయన గుడికే కాదు మీకు కూడా పంగనామాలు పెట్టిండు
దానం నాగేందర్ సగం హైదరాబాద్ ను ఆక్రమించుకున్నాడు
పంజాగుట్ట చౌరస్తాలో దివాన్ జీ దగ్గర బీడీలు అమ్ముకునే దానంను ఎమ్మెల్యేను, మంత్రిని చేసింది కాంగ్రెస్
విజయమ్మను గెలిపిస్తే పీజేఆర్ పేరు నిలబెడుతుంది
టీపీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
ఖైరతాబాద్ అంటే గుర్తొచ్చేది ఇద్దరే ఇద్దరు. ఒకరు ఖైరతబాద్ గణేశుడు, ఇంకొకరు పీ.జనార్దన్ రెడ్డి. పీజేఆర్ మన మధ్య లేకపోయినా పేదల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. 20 ఏళ్ల తరువాత పేజేఆర్ కుటుంబానికి ఓటు వేసే అవకాశం ఖైరతాబాద్ ప్రజలకు వచ్చింది. విజయమ్మకు ఓటు వేస్తే రేవంత్ రెడ్డికి ఓటు వేసినట్టే. పీజేఆర్ హయాంలోనే మీకు ఇండ్లు వచ్చినయ్, కరెంటు వచ్చింది.. అభివృద్ధి జరిగింది.
దానం నాగేందర్ సగం హైదరాబాద్ ను ఆక్రమించుకున్నాడు కానీ.. బస్తీల్లో పేదలకు చేసిందేం లేదు. బీజేపీ చింతల రాంచంద్రా రెడ్డి మీకు కొత్త కాదు.. పాత చింతకాయ పచ్చడే.ఆయన గుడికే కాదు మీకు కూడా పంగనామాలు పెట్టిండు.ఈ ఎన్నికల్లో పీజేఆర్ బిడ్డ విజయమ్మకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ ఆడబిడ్డను గెలిపిస్తే మీ ఇంట్లో మీ ఆత్మగౌరవం నిలబడుతుంది. విజయమ్మను గెలిపిస్తే పీజేఆర్ పేరు నిలబెడుతుంది.. మీ కోసం కొట్లాడుతుంది.
పంజాగుట్ట చౌరస్తాలో దివాన్ జీ దగ్గర బీడీలు అమ్ముకునే దానంను ఎమ్మెల్యేను, మంత్రిని చేసింది కాంగ్రెస్. అలాంటి నువ్వు కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తావా?అన్నం పెట్టిన కాంగ్రెస్ కు సున్నం పెట్టడం న్యాయమేనా నాగేందర్.ఇలాంటి దానంను ఓడించి తగిన బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. ఆరు గ్యారంటీలను అమలు చేస్తుంది.