హైదరాబాద్ బుక్ ఫెయర్ లో చిరంజీవి ‘శిఖర దర్శనం’ పుస్తకాన్ని రచయిత చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్ నాకిచ్చారు
“Your attititude determines your altitude” ఇది 3Mలో నాకు బాల పాఠం
‘చిరంజీవి with his attitude has reached very great altitude’
చిరంజీవి… తెలుగు సినిమాకు ఒక దశలో అత్యవసరమైన వ్య(శ)క్తి. 70వ దశాబ్దిలో తెలుగు సినిమా జాతీయ స్థాయిలో నవ్వులపాలైపోయిన దశలో ‘ఒక నిజమైన హీరో చిరంజీవి’.
తెలుగు ప్రాంతాలకు బయట వసించిన నాలాంటి మామూలు వాళ్లకు ‘తెలుగు సినిమా నిజమైన హీరో చిరంజీవి’ అన్న నిజం బాగా తెలియవచ్చింది.
తెలుగు నాసిరకం సినిమా హీరోలకు అతీతంగా జాతీయ స్థాయిలో చిరంజీవి పరిగణించబడ్డారు.
చిరంజీవి శిఖర దర్శనం ఒక ‘మనో వైజ్ఞానిక వ్యక్తిత్వ వికాస రచన’. ‘చిరంజీవి మనో వైజ్ఞానిక వ్యక్తిత్వ వికాసం తెలుగు సినిమా హీరోయిజమ్ వికాసం అయింది’ అతః పూర్వం తెలుగు సినిమా హీరోకు లేని పరిశ్రమ, పనితీరు, పనిచెయ్యడం, ఒళ్లు వంగడం, ఆలోచన, ఆచరణ చిరంజీవిలో పుష్కలంగా ఉన్నాయి. వాటిని ఈ పుస్తకం నెమరు వేసుకుంది.
చిల్లర సినిమా రచనకు అతీతంగానూ, మందు సీసాల కోసం, చిల్లర కోసం యూ ట్యూబ్ చానళ్లలో సినిమాపై చిల్లర వాగుడు వాగే సీనిఅర్ జర్నలిస్టులలా కాకుండానూ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్ ఒక మేలైన ప్రయత్నంగా, పనిగా ఈ చక్కటి పుస్తకం రాశారు.
ఇటీవల మన సినిమా ఫస్ట్ రీల్ అన్న ఒక చిల్లర పుస్తకం రావడం, దానిపై చిల్లర వ్యక్తులు సమీక్షలు రాయడం (ఆ రచయిత అడుక్కున్నందు వల్ల), దానికి చిల్లర పద్ధతుల్లో తెలంగాణ ప్రభుత్వ పురస్కారం రావడం (తెలంగాణ ప్రభుత్వాన్ని ఏమార్చగా) శోచనీయమైన పరిణామం; గర్హనీయం.
చిరంజీవి శిఖర దర్శనం పుస్తకం హర్షనీయమైన పుస్తకం. తొలిగా 2005లో వచ్చి విజయవంతమై ఇదిగో ఈ 2025లో తాజా ప్రచురణ అయింది.
రచయిత శ్రీకాంత్ కూమార్ పూర్తిగా అభినందనీయుడు. పుస్తకంలో కొన్ని పుటలు చదివాక రచనా శైలి బావుందని తెలిసింది. రచయిత శైలి పుస్తకాన్ని చదివిస్తుంది. పుస్తకం ముచ్చటగా ఉంది.
రచనా విధానం తెలియకుండానూ, అజ్ఞానంతోనూ, ఆసత్యాలతోనూ, దురాలోచనతోనూ రాసే రచయితల్ని, పుస్తకాల్ని పాఠకులు తిరస్కరిస్తారు. (అందుకు రుజువు మన సినిమా ఫస్ట్ రీల్ పుస్తకం) అందుకు అతీతంగా ఈ పుస్తకం ఈ వరకే ప్రజాదరణ పొందింది; ఇకపైనా పొందనుంది.
ఈ మంచి పుస్తకం రచయిత శ్రీకాంత్ కుమార్ కు మరోసారి అభినందనలు. శ్రీకాంత్ కుమార్ attitude has determined the altitude of the book’
ఈ పుస్తకం చదవని వాళ్లు తప్పకుండా కొనుక్కుని చదవండి.
– రోచిష్మాన్
9444012279