Suryaa.co.in

International

చిత్రం భళారే చైనా..విచిత్రం!

చిత్రం భళారే విచిత్రం! చైనా 19 అంతస్తుల నివాస భవనం మధ్య నుంచి రైలు ట్రాక్‌ను ఏర్పాటు చేసింది ఈ భవనంలో ప్రజలు నివసిస్తున్నారు. ఇప్పుడు ఈ భవనం రైల్వే స్టేషన్‌గా కూడా మారింది. ఈ చైనీస్ టెక్నాలజీ గురించి చెప్పాలంటే, ఈ రైలు ఇతర రైళ్లలాగా పెద్దగా చెవులు పగిలిపోయే శబ్దం చేయదు. ఇది చాలా బ్యాలెన్స్‌డ్ టోన్‌లో సెట్ చేయబడింది. అధిక వేగం ఉన్నప్పటికీ, 60 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం చేయకుండా ప్రయత్నిస్తుంది. ఇకపోతే, ఆ భవనంలో నివసించే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగని విధంగా ఈ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. భవనంలోని వ్యక్తులకు కూడా ప్లస్ పాయింట్ ఉంది. వారికంటూ సొంతంగా ప్రత్యేక రైల్వే స్టేషన్‌ను కలిగి ఉన్నారు. ఇక్కడ ప్రజలు తమ ఇంట్లోంచే నేరుగా రైలు ఎక్కుతున్నారు. రైలు శబ్దం విషయానికొస్తే, చైనా సైలెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించింది. దీని కారణంగా శబ్దం చెవులకు చేరదు.

LEAVE A RESPONSE