Suryaa.co.in

Andhra Pradesh

చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి ఐపీఎస్‌ గా అనర్హుడు

– టీడీపీ కార్యకర్తలకు బీసీవై అధినేత అండ!
* పెద్దిరెడ్డి రహిత పుంగనూరు లక్ష్యం!
* జైలులో బాధితులను పరామర్శించిన రామచంద్ర యాదవ్

పుంగనూరు నియోజకవర్గంలో అధికార పార్టీ అరాచకాలకు బలై.. అక్రమ కేసుల్లో ఇరుక్కుని, జైలులో మగ్గతున్న టీడీపీ కార్యకర్తలను బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ అండగా నిలిచారు.. కడప, చిత్తూరు జిల్లాలోని జైలులో ఉన్న వారిని పరామర్శించి, అన్ని రకాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
పార్టీలు ఏవైనా, కార్యకర్తలు ఎవరైనా పెద్దిరెడ్డి అరాచకానికి, పోలీసుల అక్రమ కేసులకు బలైన వారికి తాను అండగా ఉంటానని, ఎంతవరకైనా వెళ్లి వాళ్ళను కాపాడుకుంటానని హామీ ఇచ్చారు.. ఈ సందర్భంగా ఆ జైలు వద్ద మీడియాతో మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు..

రిషాంత్ రెడ్డి IPS గా అనర్హుడు.. పెద్దిరెడ్డి కి సొంత పాలేరు!
చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి అఖిల భారత పోలీస్ సర్వీస్ అధికారిగా అనర్హుడని, అతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి సొంత పాలేరు కంటే హీనంగా పని చేస్తున్నాడని దుయ్యబట్టారు.. ఇటువంటి అరచక నాయకులు వస్తూ, పోతూ ఉంటారు.. కానీ అధికారులు తమ సర్వీసును కొనసాగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.. ప్రభుత్వం మారితే పెద్దిరెడ్డి లాంటి అక్రమ నాయకులు భయంతో విదేశాలకు పారిపోతారు.

కానీ ఈ ఎస్పీ లాంటి నాయకులు ఇక్కడే పని చేయాలన్న సంగతి గుర్తు చేసుకోవాలని సూచించారు.. రిషాంత్ రెడ్డి వైఖరి, పాలేరు తనం కారణంగా పుంగనూరు నియోజకవర్గంలో అరచాక శక్తులు రాజ్యమేలుతున్నాయని, ఇది ఎన్నాళ్ళు కొనసాగేది లేదని తేల్చి చెప్పారు.. రిషాంత్ రెడ్డి లాంటి అధికారులు ఈ వ్యవస్థకు దౌర్భాగ్యమని, తన లాంటి వారిపై అట్రాసిటీ కేసులు.., కొందరు అమాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఘాటు విమర్శలు గుప్పించారు..

పెద్దిరెడ్డి రహిత పుంగనూరు లక్ష్యం!
అధికార అండతో రూ. 35 వేల కోట్లు దోచుకుని.. అధికార మదంతో ప్రతిపక్ష నాయకుల్ని వేధిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి రహిత పుంగనూరు నియోజకవర్గం తన లక్ష్యమని.. అందుకు అవసరమైన అందరినీ కలుపుకుని వెళ్తామన్నారు.. ఇటువంటి దుర్మార్గుడు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఉండడం, రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అంటూ విమర్శించారు.

పెద్దిరెడ్డి ధన దాహం, అధికార మదం మొత్తం దించి.. పుంగనూరు వీధుల్లో దోషిగా నిలబెట్టడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.. భారత చైతన్య యువజన పార్టీ విధానాలు, సిద్ధాంతాలు ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయని, వచ్చే ఎన్నికల్లో పూర్తిగా సత్తా చాటుతామని రామంచంద్ర యాదవ్ వెల్లడించారు..

LEAVE A RESPONSE