• చంద్రబాబు హయాంలో పనులు ప్రారంభమైన గిరిజన విశ్వవిద్యాలయానికి మరలా శంకుస్థాపన చేయడం జగన్ రెడ్డికే చెల్లింది
• ఒడిశా సరిహద్దు గ్రామాల వివాదంపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాష్ట్రప్రజలకు క్షమాపణ చెప్పాలి?
• అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ గిరిజనుల్ని మోసగించి, వారి భూములు, ఖనిసంపదను కొల్లగొట్టిన జగన్ రెడ్డి వారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి
ఒకసారి శంఖుస్థాపన చేసిన సంస్థలకు మళ్లీమళ్లీ శంకుస్థాపన చేయడం జగన్మోహన్ రెడ్డికి అలవాటుగా మారిందని, విజయనగరం జిల్లా, ఎస్ కోట నియోజకవర్గం అప్పన్నదొరపాలెంలో గతంలోనే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు జరగాల్సిన కార్యక్రమం మొత్తం పూర్తై, నిర్మాణపనులు ప్రారంభమైన సంస్థకు రేపు కొబ్బరికాయ కొట్టడానికి ముఖ్యమంత్రి సిద్ధమయ్యాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే …
“ గిరిజనులపై అభిమానంతో, గిరిజన యువత చదువుకోవాలన్న సదుద్దేశంతో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు వారికోసం ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయం ఏర్పా టు చేయాలని సంకల్పించారు. దానికోసం 530 ఎకరాలు కేటాయించి, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో నిర్మాణాన్ని కూడా ప్రారంభించారు. విశ్వవిద్యాలయం నిర్మాణానికి తమభూములు ఇచ్చిన గిరిపుత్రులకు మరలా భూమి ఇవ్వడంతో పాటు ఇంటిస్థలాలను ఆనాడే టీడీపీ ప్రభుత్వం కేటాయించింది.
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చిన జగన్ రెడ్డి, గిరిజన విశ్వవిద్యాలయం నిర్మించి, గిరిజన యువతను ఉద్ధరిస్తాడా?
టీడీపీప్రభుత్వంలో ఇంత పని జరిగితే, అదేదీ ప్రజలకు తెలియదన్నట్టు దుర్మార్గపు ముఖ్యమంత్రి గిరిజన విశ్వవిద్యాలయానికి శంఖుస్థాపన అని కట్టుకథలు చెబుతున్నా డు. అధికారంలోకి వచ్చినప్పటినుంచీ గిరిజనుల్ని పట్టించుకోని జగన్ రెడ్డి, వారిపై ఇప్పుడు కపట ప్రేమ చూపుతున్నాడు. అందుకు కారణం ఎన్నికలు దగ్గరపడటమే. ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణపనులు ఎలా జరుగుతున్నాయని జగన్ రెడ్డి పట్టించుకున్నది లేదు.
గిరిజన విశ్వవిద్యాలయంతో పాటు రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చిన జగన్ రెడ్డి, వైస్ ఛాన్సలర్లు సహా అన్ని పదవుల్ని తనపార్టీ, తనవర్గం వారితో నింపేశాడు. గిరిజన గురుకులాలు, బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను పూర్తిగా నాశనం చేసి, గిరిజ న విద్యార్థులకు విద్యను దూరంచేసిన జగన్ రెడ్డి తగుదనమ్మా అని గిరిజన విశ్వవి ద్యాలయానికి శంఖుస్థాపన చేయడానికి సిద్ధమయ్యాడు.
గతంలో విజయనగరం జిల్లా లో ఏర్పాటు చేసిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని అక్కడ కాదని, పార్వతీపురం మన్యం జిల్లాలో పెడతామన్నారు. ఇప్పుడు మరలా విజయనగరం జిల్లాలోనే ఏర్పాటు చేస్తా మంటున్నారు. ఇలా ఒక ఆలోచన, దూరదృష్టి లేకుండా ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించిన జగన్ రెడ్డి, నాలుగేళ్లుగా గిరిజనుల్ని పట్టించుకోకుండా, ఇప్పుడు వారిని ఉద్ధరిస్తు న్నట్టు అబద్ధాలు చెబుతున్నాడు.
గోబ్యాక్ ఆంధ్రా అన్న కేంద్రమంత్రితో గిరిజన విశ్వవిద్యాలయానికి శంఖుస్థాపన చేయిస్తారా?
గిరిజన విశ్వవిద్యాలయం శంఖుస్థాపనకు జగన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ద్వేషిం చిన కేంద్రమంత్రి తప్ప ఎవరూ దొరకలేదా అని ప్రశ్నిస్తున్నాం. గతంలో గోబ్యాక్ ఆంధ్రా, గో బ్యాక్ ఏపీ అని బహిరంగంగా నినదించిన కేంద్రమంత్రి ధర్మాన్ ప్రధాన్ చేతులు మీదుగా గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణానికి శంఖుస్థాపన చేయించడాన్ని గిరిజన ఆడబిడ్డగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. ఇలాంటి పనులు చేయడానికి ముఖ్య మంత్రికి సిగ్గుగా లేదా? ఒడిశా సరిహద్దు గ్రామాల (కొటియా గ్రామాలు) వివాదం సుప్రీం కోర్టులో ఉంటే, దానిపై మాట్లాడకూడదని తెలిసికూడా కేంద్రమంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రదాన్ ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించాడు.
సాలూరు నియోజకవర్గంలో పనిచేసే ఏపీ పోలీస్, ఆరోగ్య శాఖ అధికారుల్ని ఉద్దేశించి కేంద్రమంత్రి గోబ్యాక్ అనడం సరైందే నా? కేంద్రమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కేవలం ఒక రాష్ట్రానికి వత్తాసుగా మాట్లాడటాన్ని తాము తప్పుపట్టి, ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తే, ముఖ్యమంత్రి గా ఉన్న జగన్ రెడ్డి ఏమాత్రం ఆలోచించకుండా వారికే కొమ్ముకాశాడు.
కేవలం ఒడిశా సరిహద్దుగ్రామాల పరిధిలో భూగర్భంలో నిక్షిప్తమై ఉన్న విలువైన ఖనిజసంపదను కాజేయాలన్న దుర్భుద్ధితోనే కేంద్రమంత్రి ఆనాడు అలా మాట్లాడారు. అన్నీ తెలిసి కూడా ముఖ్యమంత్రి అదే వ్యక్తితో రేపు గిరిజన విశ్వవిద్యాల యానికి శంఖుస్థాపన చేయించడాన్ని ఎలా అర్థంచేసుకోవాలి?
గిరిపుత్రుల ఆగ్రహానికి భయపడే నాలుగుకిలోమీటర్ల దూరానికి జ గన్ రెడ్డి హెలికాఫ్టర్ని నమ్ముకున్నాడు
నాలుగేళ్లుగా శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు తప్ప జగన్ రెడ్డి చేసిందేమీ లేదు. గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారని తాము గిరిపుత్రుల పక్షాన ప్రశ్నించినప్పుడల్లా జగన్ రెడ్డి ఏవో కుంటిసాకులు చెబుతూ తప్పించుకున్నా డు. గతంలోనే ప్రారంభమైన గిరిజన విశ్వవిద్యాలయానికి మరలా శంఖుస్థాపన చేయిం చడం కేవలం జగన్ రెడ్డి ఎన్నికల జిమ్మిక్కు. గతంలో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఎంపిక చేసిన ప్రదేశాన్ని కాదని మరలా కొత్తగా మరోప్రదేశంలో శంఖుస్థాపన చేయడా నికి సిద్ధమయ్యారు.
గతంలో పనులుకూడా ప్రారంభమైతే వాటన్నింటినీ నిరుపయోగంగా వదిలేసి, తనకు నచ్చిన ప్రాంతంలో జగన్ రెడ్డి విశ్వవిద్యాలయానికి శంఖుస్థాపన చేస్తున్నాడు. నిలబడి కొబ్బరికాయ కట్టలేని, హెలికాఫ్టర్లో తప్ప నేలపై తిరగని జగన్ రెడ్డి ఎన్నాళ్లిలా కలబొల్లి నాటకాలు ఆడతాడు? నాలుగేళ్లుగా తమకు చేసిన అన్యాయం, ద్రోహంపై ఎక్కడ గిరిపుత్రులు నిలదీస్తారోనన్న భయంతోనే ముఖ్యమంత్రి రేపు జరగబోయే శంఖుస్థాపన కార్యక్రమం, తరువాత జరిగే బహిరంగసభకు చేరుకోవడానికి నాలుగు కిలోమీటర్లకే హెలికాఫ్టర్ని నమ్ముకున్నాడు.
నేలపై తిరిగితే ఎక్కడ తనను ఛీకొడతారోనన్న భయం ముఖ్యమంత్రిలో ఉంది. మూడు, నాలుగు కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాఫ్టర్లో ప్రయాణించే ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నాం. పేదల పక్షపాతినని అబద్ధాలుచెప్పడ తప్ప, పేదలకోసం వారితో కలిసే నడిచే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి లేదు. నిజంగా గిరిజన విశ్వవిద్యాలయం కట్టాలనే ఆలోచన జగన్ రెడ్డికి ఉంటే, గతంలో పనులు ప్రారంభమైన ప్రదేశంలోనే నిర్మాణాన్ని కొనసాగించే వాడు. గిరిజనులకు న్యాయం చేసేవాడు అయితే, వారి భూముల్ని, అటవీ, విలువైన ఖనిజసంపదను తనపార్టీ వాళ్లతో కలిసి లూఠీ చేసే వాడుకాదు.
18 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి, ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉండి గిరిజనులకు ఆవగింజంత సాయంచేయని పీడిక రాజన్న దొర గిరిజన ద్రోహి అయిన జగన్ రెడ్డికి వత్తాసుపలకడం సిగ్గుచేటు. సొంత గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయించుకోలేని రాజ న్నదొర గిరిజనులకు తాను. తనప్రభుత్వం మంచి చేస్తాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.
నాలుగేళ్లుగా గిరిజనులకు చేసిన అన్యాయం, ద్రోహాన్ని కప్పిపుచ్చడానికే జగన్ రెడ్డి ఉత్తుత్తి శంఖుస్థాపనలకు సిద్ధమయ్యాడు కేంద్రమంత్రి ధర్మేంద్రప్రదాన్ రాష్ట్రానికి క్షమాపణలు చెప్పాలి. గిరిజనుల్ని మోసగించిన జగన్ రెడ్డి వారికి బహిరంగక్షమాపణ శంఖుస్థాపనకు రావాలి
స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబు గిరిజనులు ప్రాథమికవిద్యకోసం ఏర్పాటుచేసిన పాఠశాలల్ని లేకుండా చేసేవాడు కాదు. నాడు-నేడు పేరుతో కోట్లాదిరూపాయలు మింగేసిన జగన్ రెడ్డి గిరిజనప్రాంతాల్లోని పాఠశాలలకు ప్రహరీలు నిర్మించలేక పోయా డు. చంద్రబాబు గిరిజనుల సంక్షేమానికి వినియోగించిన అనేక పథకాల్ని జగన్ రెడ్డి రద్దుచేశాడు. టీడీపీప్రభుత్వంలో ప్రతి గిరిజన కుటుంబానికి నెలకు 100రూపాయల విద్యుత్ బిల్లు వస్తే, జగన్ రెడ్డి వచ్చాక అది రూ.500కు పెరిగింది.
చంద్రబాబు అమలుచేసిన వైద్యసేవల్ని గిరిజనులుకు లేకుండా చేశాడు. చంద్రబాబు ఫీడర్ అంబు లెన్సులు ఏర్పాటుచేస్తే, ఈ ముఖ్యమంత్రి వాటిని రద్దుచేశాడు. ఇలా అధికారంలోకి వచ్చినప్పటినుంచీ గిరిజనులకు తీవ్ర అన్యాయం చేసిన జగన్ రెడ్డి ఏ ముఖంపెట్టుకొని గిరిజన విశ్వవిద్యాలయానికి శంఖుస్థాపన చేస్తున్నాడు? నిజంగా జగన్ రెడ్డికి గిరిజనులపై ప్రేమాభిమానాలుంటే ముందు కేంద్రమంత్రి ధర్మాన్ ప్రదాన్ తో రాష్ట్రప్రజలకు క్ష మాపణలు చెప్పించాలి.
అలానే జగన్ రెడ్డి నాలుగేళ్లలో గిరిజనులకు చేసిన ద్రోహానికి గాను, వారికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. గిరిజన విద్యను సక్రమంగా అమలు చేసే ఆలోచన జగన్ రెడ్డికి ఉంటే, గిరిజన ప్రాంతాల్లో గతంలో తొలగించిన పాఠశాలల్ని పునరుద్ధరించాలి. గిరిజనులకు మెరుగైన నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావాలి. విచ్చలవిడిగా ప్రజలసొమ్ము కొల్లగొట్టి, గాల్లో తిరిగే ముఖ్యమంత్రికి ప్రజ ల బాధలేం తెలుస్తాయి?
ప్రజలతో ముఖాముఖి మాట్లాడే ధైర్యం, దమ్ము జగన్ రెడ్డి కిలేదు. ప్రజా నాయకులు అంటే చంద్రబాబు, లోకేశ్ లే… నిత్యం ప్రజల్లో ఉంటూ, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, నిజమైన నాయకులు అనిపించుకుంటున్నారు. పర దాల మాటున దాగి, పోలీసులసాయంతో దాక్కొని తిరిగే వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి అవసరమా? గిరిజన విశవిద్యాలయం శంఖుస్థాపన అని, మరోటని గిరిజనుల్ని ఇంకా మభ్యపెట్టాలని చూస్తే జగన్ రెడ్డికి బుద్ధిచెప్పడానికి గిరిపుత్రులు సిద్ధంగా ఉన్నారు.” అని సంధ్యారాణి తేల్చిచెప్పారు.