Suryaa.co.in

Andhra Pradesh

ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ క్రిస్మస్

-రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
-సెమీ క్రిస్మస్ వేడుకలకు కల్వరి మినిస్ట్రీస్ ఆహ్వానం
గుడివాడ, డిసెంబర్ 15: ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే సాంస్కృతిక పండుగ క్రిస్మస్ అని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని కల్వరి మినిస్ట్రీస్ గుడివాడ నిర్వాహకుడు అనిల్ కుమార్ కలిశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17 వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు గుడివాడ రూరల్ మండలం మల్లాయిపాలెం రైల్వేగేటు సమీపంలో ఉన్న కల్వరి మినిస్ట్రీస్ లో సెమీక్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా రావాలంటూ మంత్రి కొడాలి నానికి ఆహ్వాన పత్రికను అందజేశారు. పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తో పాటు క్రైస్తవ సంఘాల ప్రముఖులు
15-PHOTO-2కూడా విచ్చేస్తున్నారని తెలిపారు. కల్వరి మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు రెవరెండ్ సతీష్ కుమార్ క్రైస్తవ విశ్వాసులు, భక్తులకు దైవ సందేశాన్ని అందజేస్తారన్నారు.అలాగే క్రీస్తు రాకడ, క్రీస్తు జననం గురించి వివరించడంతో పాటు క్రీస్తు బోధనలు చేస్తారని చెప్పారు. అలాగే నాటక, సంగీత ప్రదర్శనలు ఉంటాయని, చిన్నారులు ఆటపాటలతో అలరిస్తారన్నారు. ముందుగా మంత్రి కొడాలి నానికి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు.
అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ క్రిస్మస్ పండుగకు కొద్దిరోజుల ముందు నుండే సెమీ క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటారన్నారు. ఈ వేడుకల్లో క్రైస్తవ విశ్వాసులకు క్రీస్తు బోధనలు, దేవుని వాక్యాన్ని అందిస్తారన్నారు. ప్రతి ఒక్కరూ క్రీస్తు చూపిన ప్రేమ, దయా గుణం వంటి మార్గాల్లో పయనించాలని మంత్రి కొడాలి నాని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బూసి ప్రకాశరావు, మెండా చంద్రపాల్, కందుల నాగరాజు, నగుళ్ళ సత్యనారాయణ, తాళ్ళూరి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE