Suryaa.co.in

Andhra Pradesh

సీఐడీ సంజయ్.. సర్వీసు ఉల్లం‘ఘనుడు’

– కేసు వివరాలతో ప్రెస్‌మీట్లు పెడుతున్నారు
– ఢిల్లీ, హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్లు ఎలా పెట్టారు?
– అది సర్వీసు నిబంధనలకు విరుద్ధం
– ఆయన ఐపిఎస్ అధికారి కాదు.. వైసీపీ కార్యకర్త
– తక్షణమే సంజయ్‌పై చర్యలు తీసుకోండి
– కేంద్రహోంశాఖ, డిఓపీటీకి ఎంపి రామ్మోహన్‌నాయుడు ఫిర్యాదు

త మ పార్టీ అధినేత చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్టు చేసిన సీఐడీ అధికారులపై ఇప్పుడు టీడీపీ సీరియస్‌గా దృష్టిసారించింది. చంద్రబాబు అరెస్టుపై హైదరాబాద్-ఢిల్లీలో ప్రెస్‌మీట్లు పెడుతున్న సీఐడీ చీఫ్ సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ, టీడీపీ కేంద్రహోంమంత్రి- డిఓపీటీకి ఫిర్యాదు చేసింది. సంజయ్ ఒక ఐపిఎస్ అధికారిగా కాకుండా, వైసీపీ కార్యకర్తగా పనిచేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొంది. సర్వీసు నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంజయ్‌పై క్రమశిక్షణలు తీసుకోవాలని, టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆమేరకు కేంద్రానికి ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.

ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ చిక్కుల్లో పడ్డారు. సర్వీస్ రూల్స్ అతిక్ర‌మించి మ‌రీ వైసీపీకి తొత్తుగా ప‌నిచేస్తు న్నారని ఏపీ సీఐడీ చీఫ్ సంజ‌య్ పై కేంద్ర హోంశాఖ మంత్రికి శ్రీకాకుళం ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు ఫిర్యాదు చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఆల్ ఇండియ‌న్ స‌ర్వీస్ రూల్స్ మేర‌కు రాజ‌కీయ ప‌క్ష‌పాతాలు లేకుండా ప‌నిచేయాల్సిన సీఐడీ చీఫ్ అన్నింటినీ ఉల్లంఘించార‌ని హోం మంత్రికి ఆధారాలతో ఫిర్యాదు చేశారు.

వైసీపీ కార్య‌క‌ర్త మాదిరిగా ప‌నిచేస్తున్న ఐపీఎస్ అధికారి సంజ‌య్, సీఎం వైఎస్ జ‌గ‌న్ కోసం ప్ర‌తిప‌క్షాల‌పై బుర‌ద చ‌ల్లుతున్నారు. స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కేసులో ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబుని అరెస్టు చేసి విచార‌ణ చేయాల్సిన అధికారి, ఎటువంటి విచార‌ణ జ‌ర‌ప‌కుండానే, స‌ర్వీసు నిబంధ‌న‌ల‌కి వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా ప్రెస్ మీట్లు పెడుతూ ఆరోప‌ణ‌లు చేయ‌డం తీవ్ర‌మైన నేరం.

ద‌ర్యాప్తు అంశాలు రూపొందించి కోర్టుల‌కి నివేదించాల్సిన బాధ్య‌త గ‌లిగిన ఐపీఎస్ అధికారి ఫ‌క్తు వైసీపీ నేత‌లాగ ఢిల్లీ, హైద‌రాబాద్, అమ‌రావ‌తిలో ప్రెస్ మీట్లు పెడుతూ ప్ర‌తిప‌క్ష నేత‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తూ, ద‌ర్యాప్తులో గోప్యంగా ఉంచాల్సిన అంశాలు మీడియాకి విడుద‌ల చేస్తున్నారు. సీఐడీ చీఫ్ సంజ‌య్ ఉల్లంఘించిన స‌ర్వీస్ రూల్స్, అతిక్ర‌మించిన నిబంధ‌న‌లు, అడ్డగోలు ప్ర‌వ‌ర్త‌న‌పై అన్ని ఆధారాల‌ను హోంశాఖ మంత్రికి ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు పంపించార‌ని తెలిసింది. ఆమేరకు సంజయ్, అపిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్‌రెడ్డి నిర్వహించిన ప్రెస్‌మీట్ల ఫొటోలు, అందులో మాట్లాడిన వీడియా-పేపర్ క్లిప్పింగులను సమర్పించినట్లు తెలుస్తోంది.

LEAVE A RESPONSE