– సీఎం ప్రోద్బలంతోనే సీఐడీ తప్పుడు కేసు నమోదు
– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
సీఐడీ అంటే సీఎం ఇంట్రెస్ట్ డిపార్ట్‌మెంట్‌గా మార్చేశారు. తన మిత్రుడైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ని పరామర్శించేందుకు వెళ్లిన ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ పై తప్పుడు కేసు బనాయించిన సీఐడీ ఏపీ పరువు తెలంగాణ నడివీధిలో తీసి పడేసింది.
విచారణకు సహకరించాలని కోరిన సీఐడీ అధికారులే, విచారణకి ఆటంకం కలిగించారని రాధాకృష్ణపై 36 గంటల తరువాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పూర్తిగా కుట్రపూరితం. ఇప్పటికే 2430 జీవోతెచ్చిన మీడియా గొంతుకోసిన జగన్ రెడ్డి , ఇప్పుడు పాత్రికేయదిగ్గజం వేమూరి రాధాకృష్ణ ని అక్రమకేసులో ఇరికించడం ఉద్దేశపూర్వకంగా చేసినదే.
సీఎం ప్రోద్బలంతోనే సీఐడీ నమోదుచేస్తోన్న ఇలాంటి తప్పుడుకేసులని ఇప్పటికైనా ఆపాలి. ఎటువంటి సంబంధంలేని వేమూరి రాధాకృష్ణపై బనాయించిన అక్రమకేసుని వెంటనే ఎత్తేసి వేధించడం మానుకోవాలని హెచ్చరిస్తున్నాను.