కోర్టు సముదాయాలను ప్రారంభించిన సీజేఐ ఎన్వీ రమణ, పాల్గొన్న సీఎం వైయస్ జగన్
విజయవాడలో నూతనంగా నిర్మించిన సిటీ సివిల్ కోర్టు భవన సముదాయం ప్రారంభోత్సవంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణతో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. కోర్టు నూతన బిల్డింగ్స్‌ను సీజేఐ ఎన్వీ రమణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, హైకోర్టు సీజేతో పాటు పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. సిటీ సివిల్ కోర్టు భవన సముదాయ ప్రారంభ కార్యక్రమానికి ముందు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో ఇరువురు మొక్కలు నాటారు.