కోర్టు కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవం అరుదైన ఘట్టం

-సీజేఐ ఎన్వీ రమణ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషం
-న్యాయవ్యవస్థకు సహాయ, సహకారాలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఎల్ల‌ప్పుడూ సిద్ధం
-కోర్టు కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

విజయవాడ: జ్యుడీషియల్‌కు అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విజయవాడలో సిటీ సివిల్‌ కోర్టు బిల్డింగ్‌ కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు. ముందుగా కోర్టు బిల్డింగ్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన భారతదేశ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, హైకోర్టు సీజే ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులకు సీఎం వైయస్‌ జగన్‌ అభినందనలు తెలిపారు.

అనంతరం సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. సీజేఐ ఎన్వీ రమణ చేతుల మీదుగా విజయవాడలో కోర్టు కాంప్లెక్స్‌ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, ఇదొక అరుదైన ఘట్టమన్నారు. చాలా చోట్ల కోర్టు కాంప్లెక్స్‌లు నిర్మిస్తుంటారని, కానీ.. జస్టిస్‌ ఎన్వీ రమణ చేతుల మీదుగా ప్రారంభించడం ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందన్నారు. ఇదే కోర్టు కాంప్లెక్స్‌ 2013లో జస్టిస్‌ ఎన్వీ రమణ చేతుల మీదుగానే శంకుస్థాపన జరిగిందని, మళ్లీ ఈరోజు ఆయన చేతుల మీదుగా ప్రారంభించుకోవడం దేవుడి విధి అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జ్యుడిషియల్‌కు సంబంధించి ప్రతీ విషయంలో అన్ని రకాలుగా సహకరించేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు.

అనంతరం సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ..
రాష్ట్ర ముఖ్యమంత్రిగారు తెలుగులో మాట్లాడాక.. తాను తెలుగులో మాట్లాడకపోవడం బాగోదని చెప్తూ తెలుగులోనే ప్రసంగించారు జస్టిస్‌ ఎన్వీ రమణ.

నేను శంకుస్థాపన చేసిన బిల్డింగ్‌ను.. మళ్లీ నేనే ప్రారంభించడం ఆనందంగా ఉంది. రకరకాల కారణాలతో ఈ నిర్మాణం ఆలస్యమైంది. న్యాయ వ్యవస్థకు అదనపు నిధుల విషయంలో కేంద్రం నుంచి వ్యతిరేకYS-JAGAN-2 వచ్చినప్పుడు మద్దతు ఇచ్చిన ముఖ్యమంత్రులకు( ఏపీ సీఎం జగన్‌ కూడా) కృతజ్ఞతలు. పెండింగ్‌ కేసులు విషయంలో సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలనే తపన న్యాయమూర్తులకు, న్యాయవాదులకు ఉండాలని జస్టిస్‌ ఎన్వీ రమణ ఆకాంక్షించారు. విభజన అనంతరం ఏపీ ఆర్థికంగా వెనకబడిందన్న సీజేఐ.. విభజనతో నష్టపోయామన్న భావన ఏపీ ప్రజల్లో ఉందని, కాబట్టి ఈ విషయంలో కేంద్రం రాష్ట్రానికి తోడ్పాటు అందించాలని కోరారు.

నేను రెండు తెలుగు రాష్ట్రాల్లో జడ్జి ల ఖాళీలను భర్తీ చేసాను. 250 మంది హైకోర్టు జడ్జి లను, 11 మంది సుప్రీంకోర్టు జడ్జి లను నియమించగలిగాను. సీఎం వై ఎస్ జగన్ సహకారం వల్లనే ఇప్పుడు ఈ భవనం పూర్తి చేసుకోగలిగాం. విశాఖపట్నం లో కూడా ఓ భవనం చివరి దశలో ఉంది. దానితో పాటు ఇతర కోర్టు భవనాలను కూడా పూర్తి చేయాలని సీఎం జగన్‌ను కోరుతున్నాం అని జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు.

Leave a Reply