Home » నానిపై వైకాపా మూక దాడిని ఖండిస్తున్నా

నానిపై వైకాపా మూక దాడిని ఖండిస్తున్నా

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

చంద్రగిరి టిడిపి అభ్యర్థి పులివర్తి నాని పై వైకాపా మూక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థలో గెలుపు ఓటములు సహజం. అపజయం తప్పదనే సంకేతాలతో వైకాపా తన ఫ్యాక్షన్ విషసంస్కృతికి తెరలేపింది. పద్మావతి మహిళ యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలించేందుకు వచ్చిన పులివర్తి నానిపై వైకాపా మూక దాడి దిగ్భ్రాంతికి గురిచేసింది. నాని అన్నతో మాట్లాడాను. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించాను.‌ పోలీసులు వైకాపా మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.

Leave a Reply