Home » ఆనాడు అల్లూరి.. ఈనాడు కనుమూరి!

ఆనాడు అల్లూరి.. ఈనాడు కనుమూరి!

ఆనాడు అల్లూరి!
ఈనాడు కనుమూరి..!
ఆగర్భ శ్రీమంతుడు!
రఘురాముడు!
సాహిత్య పిపాసి!
అవగాహన ఉన్న వివేకి!
ప్రజావ్యతిరేక ప్రభుత్వ నిర్ణయాలను తూర్పారబట్టే హాలికుడు!

నిర్భంధం..నిరంకుశం..హింస..తట్టుకుని నిలిచిన పోరాట యోధుడు!
పల్లె గడప కు చేరిన ఆయన గొంతు!
ప్రత్యర్ధులకు గుండె గుభేలు!

దగాపడిన..గాయపడిన..ప్రజల స్వరం వినిపించే ఆయన్ని ప్రజలు సొంతం చేసుకున్నారు!

ఒకేఒక్కడు!
వెనక్కి తిరిగి చూడడు!
ప్రజల సరదాలు..సుఖసంతోషాలు పంచుకోవాలనుకునే మనస్తత్వం ఉన్న మనిషనిపిస్తారు.
డౌన్ టు ఎర్త్ !
ఆతిధ్యం నిత్యకృత్యం!

తనకన్నా బుడ్డాడిని సర్! సర్!అంటూ ఇంప్రెస్ చెయ్యలేరు.
దూరం పెరిగి ఉండవచ్చు..అడ్డగోలు యవ్వారాలు సహించలేక కావచ్చు..!

కారణాలు ఏమైనా ..ప్రభుత్వ విధానాలతో విభేదించారు.

అవకతవకల మీద ఆయన గొంతు విప్పారు.

అటు ఇటు మాటల దాడులు కొనసాగాయి.
చిలికి చిలికి గాలివాన అయింది.

అధికార పార్టీ కి…ముఖ్యంగా సలహాదారులకు..జగన్ రెడ్డి గారికి…పక్కలో బల్లెం లా మారారు.

ప్రభుత్వ తప్పిదాలను..వేటిని విడిచి పెట్టకుండా..చీల్చి చెండాడుతున్నారు.

ఆయనకు బదులు చెప్పలేని స్దితిలో …ఆత్మరక్షణ లో పడింది అధికారపార్టీ!

ఆయన మీద కేసులు పెట్టారు..మట్టగిడసలా తప్పించుకున్నారు.

ఇంకో పక్క ఆయన మాట వినేవారు రోజురోజుకి పెరుగుతున్నారు.

ఎన్నో చీకటి కోణాల్ని..వెలుగులోకి తీసుకు వస్తున్నారు.

అధినేత బెయిల్ రద్దుకు పిటిషన్ వేసారు.

పిటిషన్ వేసి ఊరుకోలేదు…సీబీఐ..కి అంత ప్రేమ ఎందుకో అయ్య గారి మీద ..అన్న కోణం లో శూలశోధన చేసారు..!

తీసుకెళ్ళి హింసించారు!
కింగ్ కోబ్రా తోకతొక్కారు!

వదులుతారా ! ఆయన !?

నలిపి నలిపి వదిలారు..!
గానుగాడించేసారు!
ఊచకోత! అరాచకం!
కంటి మీద కునుకు లేకుండా చేసారు!
కట్టల పాముల వల్ల కూడా పని అవ్వటం లేదు!

ఇది వరకు రామానంద్ సాగర్ రామాయణం కోసం ఒక తరం ఎదురు చూసేది…వారం వారం..!

ఇప్పుడు ప్రతిరోజూ రాజుగారి రచ్చబండ..!

ఆయన్ని ఎదుర్కోలేని వైసీపి నాయకత్వం..అధిక వ్యయం చేసింది!
రాజపూజ్యం సున్న..అవమానం నూరు!
గోచార ఫలాలు ఈ విధంగా ఉన్నాయి!

అక్కడ ఉన్నది పులి కాదు..గోడ వెనుక దాగిన పిల్లి అని జనానికి రుజువు చేసారు..రఘురాజు గారు.
ఆయన మాటల తూటాలు..నేరుగా తాకుతున్నాయి.

ఐదేళ్ళుగా నలిగి పోతున్న..ప్రభుత్వ బాధితులు..కి ఉపశమనం..ఆశ..ధైర్యం కలిగాయి..!
గడప గడప లో ఛీత్కారాలు!

ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టడంలో రాజుగారి పాత్ర చిరస్మరణీయం!
అనన్య సామాన్యం!
వారిని అభినందించి..ఆదరించాల్సిందే!

వారు ప్రజల గొంతు!

వారి జన్మదినం..!
ఈ సందర్భంగా ..హృదయపూర్వక శుభాకాంక్షలు.

హాపీ బర్త్ డే రఘురామకృష్ణం రాజు గారు..!

– అడుసుమిల్లి శ్రీనివాసరావు

Leave a Reply